For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వర్షాకాలంలో వేగంగా బట్టలు ఆరిపోవాలంటే.. ఇలా ట్రై చేయండి...

వర్షాకాలంలో డ్రయర్ లేకుండా మీ బట్టలను వేగంగా ఎలా ఆరబెట్టుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

|

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో కుండపోతలు బీభత్సంగా ఉన్నాయి. ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు, ఉత్తరాంధ్ర జిల్లాలను వరదలు ముంచెత్తాయి.

How to Dry Your Clothes Fast Without a Dryer in Rainy Season in Telugu

వీటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. చాలా రోజులుగా సూర్యుడి దర్శనం అనేదే లేకుండా పోయింది. ఇదిలా ఉండగా.. ఈ వర్షాకాలంలో బట్టలు ఉతకడం వాటిని ఆరబెట్టడం అంటే చాలా కష్టమైన పని. మనలో చాలా మంది బట్టలు ఆరబెట్టడం వెనుక రాకెట్ సైన్స్ ఏంటని ఆలోచిస్తూ ఉంటారు.

How to Dry Your Clothes Fast Without a Dryer in Rainy Season in Telugu

సాధారణంగా కాస్త ఎండ తగిలితే.. బట్టలు కొన్ని గంటల్లోనే ఆరిపోతాయి. అయితే చలికాలంలో, ముఖ్యంగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాకాలంలో బట్టలు ఉతకడం మరియు వాటిని ఆరబెట్టడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సూర్యుడు కనబడని సమయంలో జీన్స్ వంటి బట్టలు ఆరేందుకు చాలా సమయం పడుతుంది.

How to Dry Your Clothes Fast Without a Dryer in Rainy Season in Telugu

వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. ప్రస్తుత లైఫ్ స్టైల్ లో బట్టలు త్వరగా ఆరబెట్టడం చాలా అవసరం, ఎందుకంటే మీరు తర్వాత చాలా బిజీగా మారొచ్చు. ఈ నేపథ్యంలో కొందరు తమ బట్టలను దోబిలకు ఇచ్చేస్తారు. వారు వాటిని ఇంటి వద్ద లేదా ఎక్కడైన రేవులకు తీసుకెళ్లి అక్కడే వాష్ చేసి.. ఆరబెట్టుకుని.. ఇంటికొచ్చి ఐరన్ చేసి మనకు మంచిగా అప్పగిస్తారు. మరి కొందరు తామే సొంతంగా వాష్ చేసుకుని, ఐరన్ చేసుకుంటారు. ఇంకా కొందరు వాషింగ్ మెషిన్లో బట్టలను వేసి ఆరబెడుతుంటారు. ఈ సందర్భంగా వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరిపోవడానికి ఏమి చేయాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

planting ideas:బాల్కనీలో ఈ మొక్కలను పెంచితే.. మీ మూడ్ కచ్చితంగా మారిపోతుందట...!planting ideas:బాల్కనీలో ఈ మొక్కలను పెంచితే.. మీ మూడ్ కచ్చితంగా మారిపోతుందట...!

ఇలా వేలాడదీయాలి..

ఇలా వేలాడదీయాలి..

వర్షాకాలంలో లేదా చలికాలంలో మీ బట్టలు త్వరగా ఆరిపోవడానికి ఇలా ప్రయత్నించండి. ముందుగా మీ వాషింగ్ మెషిన్ యొక్క బట్టల డ్రయ్యర్ నుండి తీసిన తర్వాత మీ బట్టలను లైనులో విడిగా వేలాడదీయడానికి ప్రయత్నించండి. ఒకదానిపై ఒకటి ఎట్టి పరిస్థితుల్లో ఉంచొద్దు. ఎందుకంటే వాటిలో ఏదీ పొడిగా ఉండదు. అంతేకాదు అవి ఒకదానికొకటి తేమను గ్రహిస్తాయి.

స్వచ్ఛమైన గాలిలో..

స్వచ్ఛమైన గాలిలో..

మీరు ఉతికిన బట్టలను లేదా వాషింగ్ మెషిన్ నుండి తీసిన బట్టలను ఇండోర్ వంటి ప్రాంతాల్లో కాకుండా ఆరుబయట ఆరబెట్టేందుకు ప్రయత్నించడం ఎల్లప్పుడూ మంచిది. ఒకవేళ తగిన సూర్యరశ్మి లేకపోతే, మీరు కనీసం స్వచ్ఛమైన గాలి వచ్చే ప్రాంతాల్లో ఆరబెట్టాలి. దీని వల్ల బట్టల నుండి వచ్చే దుర్వాసన అయినా తొలగిపోయేందుకు సహాయపడుతుంది. అయితే ఆకాశంలో మబ్బులు ఉంటే మీరు ఇంటి లోపలే బట్టలు డ్రై అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకోవడం మంచిది.

ఇది చాలా ముఖ్యం..

ఇది చాలా ముఖ్యం..

మీరు ఇంటి లోపల బట్టలు ఆరబెట్టినప్పటికీ, వాటిని వరుస క్రమంలో వేలాడదీయడం అనేది చాలా ముఖ్యమైనది. అలాగే మీ బట్టలు ఇంటిలోపల ఆరబెట్టేందుకు ఎక్కువ స్థలం కావాలి. మేక్ షిఫ్ట్ బట్టల లైనున ఏర్పరచేందుకు తాడులను కట్టి, ఫ్యాన్ ఆన్ చేయండి.

అన్ని బట్టలను ఉంచలేం..

అన్ని బట్టలను ఉంచలేం..

వాషింగ్ మెషిన్ యొక్క బట్టల డ్రయ్యర్లో అన్ని బట్టలను ఉంచలేం. పట్టు లేదా షిఫాన్ వంటి కొన్ని సున్నితమైన దుస్తులకు మరింత సున్నితమైన నిర్వహణ అవసరం. కాబట్టి మీ బట్టలు త్వరగా ఆరబెట్టడం అవసరమైతే వాటిలోని తేమను పిండటం ఉత్తమ మార్గం. అవి ఎంత తక్కువ నీటిని నిల్వ చేసుకుంటే అంత వేగంగా ఎండిపోతాయి.

యంత్రాల సహాయం..

యంత్రాల సహాయం..

మీరు పైన ఉన్న సహజ మార్గాల కంటే త్వరగా బట్టలు ఆరబెట్టాలనుకుంటే.. యంత్రాల సహాయం తీసుకోవచ్చు. కొన్ని సాధారణ హౌస్ హోల్డ్ మెషీన్లు మీ తడి బట్టలను ఆరబెట్టడంలో సహాయపడతాయి. లోదుస్తులు, సాక్స్, రుమాలు వంటి చిన్న వస్తువులను యంత్రాలలో ఆరబెట్టేందుకు ఉపయోగించొచ్చు. ఎయిర్ కండిషనర్లు మీ చర్మాన్ని తప్ప.. మీ బట్టలు ఆరడంలో ఏ మాత్రం పని చేయవు. అయితే మీరు రూమ్ హీటర్ తో కొన్ని ప్రయోగాలు చేయొచ్చు.

దుర్వాసన నుండి విముక్తి..

దుర్వాసన నుండి విముక్తి..

మీరు ఇంటిలోపల బట్టలు ఆరబెట్టినప్పుడు, మీ బట్టల్లో నుండి సాధారణంగా దుర్వాసన వస్తుంది. దీని గురించి మీరు తరచుగా ఆందోళన చెందుతూ ఉంటారు. దీన్ని సహజంగా వదిలించుకోవాలని నిర్ధారించుకోండి. ఇలాంటి సమయంలో మీ ఇంటి చుట్టూ సువాసనను వెదజల్లే ధూప దీపాలను వెలిగించొచ్చు. బట్టల్లోకి వచ్చే దుర్వాసనను పోగొట్టడానికి ఈ దూప్ కూడా మంచి మార్గమే. దీపం లేదా ధూప్ వల్ల బట్టల దగ్గరికి వాసన రాకుండా చూసుకోండి.

బాత్ రూమ్ లో డ్రిప్ చేయండి..

బాత్ రూమ్ లో డ్రిప్ చేయండి..

ముందుగా బాత్ రూమ్ లోపల బట్టలు ఆరనించే ప్రయత్నం చేయండి. ఈ విధంగా, మీరు నీటిని బాత్రూమ్ లోపల మరియు మీ ఇంటి ఆవరణంలోకి ప్రవేశించకుండా అనుమతిస్తారు. అలాగే, మీ బట్టల నుండి నీరు బయటకు పోయినప్పుడు, వీటిని ఆరబెట్టడం సులభమవుతుంది. ఈ విధంగా బట్టలు ఆరిపోయే ముందు బట్టల లైనులో కొన్ని నిమిషాలు మాత్రమే ఉండాలి. అలాగే మీ బట్టల నుండి నీటిని మాన్యువల్ గా పిండాలి. బట్టలను డ్రిప్ తో ఆరబెట్టిన తర్వాత కూడా మీ బట్టల్లో కొంత మొత్తంలో నీరు ఉన్నట్లు మీరు చూస్తారు. వాటిని హ్యాంగర్ పై ఆరబెట్టడానికి ముందే, బట్టల నుండి నీటిని బాగా వదిలించుకోవాలి.

FAQ's
  • వర్షాకాలంలో వేగంగా బట్టలు ఆరిపోవడానికి ఏమి చేయాలి?

    వర్షాకాలంలో లేదా చలికాలంలో మీ బట్టలు త్వరగా ఆరిపోవడానికి ఇలా ప్రయత్నించండి. ముందుగా మీ వాషింగ్ మెషిన్ యొక్క బట్టల డ్రయ్యర్ నుండి తీసిన తర్వాత మీ బట్టలను లైనులో విడిగా వేలాడదీయడానికి ప్రయత్నించండి. ఒకదానిపై ఒకటి ఎట్టి పరిస్థితుల్లో ఉంచొద్దు. ఎందుకంటే వాటిలో ఏదీ పొడిగా ఉండదు. అంతేకాదు అవి ఒకదానికొకటి తేమను గ్రహిస్తాయి.

  • చలికాలంలో వేగంగా బట్టలు ఆరిపోవడానికి ఏమి చేయాలి?

    మీరు ఉతికిన బట్టలను లేదా వాషింగ్ మెషిన్ నుండి తీసిన బట్టలను ఇండోర్ వంటి ప్రాంతాల్లో కాకుండా ఆరుబయట ఆరబెట్టేందుకు ప్రయత్నించడం ఎల్లప్పుడూ మంచిది. ఒకవేళ తగిన సూర్యరశ్మి లేకపోతే, మీరు కనీసం స్వచ్ఛమైన గాలి వచ్చే ప్రాంతాల్లో ఆరబెట్టాలి. దీని వల్ల బట్టల నుండి వచ్చే దుర్వాసన అయినా తొలగిపోయేందుకు సహాయపడుతుంది. అయితే ఆకాశంలో మబ్బులు ఉంటే మీరు ఇంటి లోపలే బట్టలు డ్రై అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకోవడం మంచిది.

English summary

How to Dry Your Clothes Fast Without a Dryer in Rainy Season in Telugu

Here we are talking about the how to dry your clothes fast without a dryer in rainy season in Telugu. Have a look
Desktop Bottom Promotion