Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ఈ రంగుల చెప్పులు వేసుకుంటే దురదృష్టాన్ని మోసుకువెళ్తున్నట్లే
పసుపు రంగు బూట్లు లేదా చెప్పులు ఎప్పుడు కొనవద్దు. పసుపు రంగు బృహస్పతి రంగుగా పరిగణిస్తారు. ఈ రంగు బూట్లూ లేదా చెప్పులు ధరిస్తే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి.
అందంగా, ఆకర్షణీయంగా కనిపించడానికి మంచి మంచి డ్రెస్సులు, ట్రెండ్‌కు తగ్గ ఫ్యాషన్ వేర్, మ్యాచింగ్ ఆభరణాలు, చెప్పులు, బూట్లు ధరిస్తాం.

అయితే జ్యోతిష్యం ప్రకారం ఈ రంగు చెప్పులు ఎప్పుడూ ధరించకూడదని చెబుతారు. ఇలా వేసుకుంటే దురదృష్టం, ఆర్థిక సమస్య వెంటాడుతాయి. కుటుంబ సమస్యలు తలెత్తుతాయి. జీవితంలో సమస్యలు తెచ్చిపెట్టే ఎలాంటి రంగుల చెప్పులు ధరించకూడదో ఇప్పుడు చూద్దాం.

1. పసుపు రంగు చెప్పులు
పసుపు రంగు బూట్లు లేదా చెప్పులు ఎప్పుడు కొనవద్దు. ఎందుకంటే పసుపు రంగు బృహస్పతి రంగుగా పరిగణిస్తారు. ఈ రంగు బూట్లూ లేదా చెప్పులు ధరిస్తే జాతకంలో బృహస్పతి బలహీనపడతాడని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. ఖర్చులు భారీగా పెరిగి ఆదాయం తగ్గుతుంది. పిల్లలు, పెళ్లి, వివాహ జీవితానికి సంబంధించిన సమస్యలు కూడా తలెత్తుతాయి.
బృహస్పతి కోపాన్ని ఎదుర్కొనే వారి జీవితంలో సమస్యలు తిష్ట వేస్తాయి. దీని వల్ల జీవితంలో ప్రశాంతత కనుమరుగవుతుంది. కాబట్టి పసుపు చెప్పులు లేదా బూట్లు ఎప్పుడూ ధరించవద్దని గుర్తుంచుకోవాలి. జ్యోతిషశాస్త్రం ప్రకారం, నలుపు, నీలం, ఊదా రంగుల్లోని బూట్లు ధరించవచ్చు. అలాగే తెలుపు రంగు బూట్లు, చెప్పులు ధరించడం వల్ల ఎటువంటి సమస్యా ఉండదు.

2. పాదరక్షలు ధరించేటప్పుడు జాగ్రత్తలు
ఎవరైనా చెప్పులను బహుమతిగా ఇస్తే వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ ధరించవద్దు. అలాంటి చెప్పులను లేదా బూట్లను ధరించడం వల్ల జీవితంలో సమస్యలు వస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.



Click it and Unblock the Notifications