Latest Updates
-
దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే!
ఆనందం, శ్రేయస్సు వెల్లివిరియాలంటే ఇంట్లో నుండి ఈ వస్తువులు తీసేయండి
ఇంట్లో ప్రశాంతత, ఆనందం, శ్రేయస్సు ఉండాలంటే కొన్ని వస్తువులను తీసేయ్యాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఎలాంటి వస్తువులు తీసివెయ్యాలి, ఎందుకు తీసివెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రశాంతత, ఆనందం ఉంటేనే అది ఇల్లు అనిపించుకుంటుంది. బయట ఎంత కష్టపడ్డా, ఎంత ఒత్తిడి ఎదుర్కొన్నా ఇంటికి వచ్చాక ప్రశాంతంగా అనిపించాలి. అప్పుడు ఇల్లు అనే దానికి అర్థం ఉంటుంది. ఇంట్లో గొడవలు ఉంటాయి, దంపతులు, కుటుంబసభ్యుల మధ్య వాదోపవాదాలు నడుస్తాయి, తీవ్రస్థాయిలో చర్చలూ జరుగుతుంటాయి. కానీ అవి మానసిక ప్రశాంతతను చెరిపివేయకూడదు.

ఇంట్లో ప్రశాంతత, ఆనందం, శ్రేయస్సు ఉండాలంటే కొన్ని వస్తువులను తీసేయ్యాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఎలాంటి వస్తువులు తీసివెయ్యాలి, ఎందుకు తీసివెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.

విరిగిన అద్దాలు:
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో విరిగిపోయిన అద్దాలు, పాడేపోయి ప్రతిబింబం కనిపించని అద్దాలను ఇంట్లో నుండి తీసెయ్యాలి. పగిలిపోయన అద్దాలను ఇంట్లో ఉంచితే కుటుంబసభ్యుల మధ్య సంబంధాలు దెబ్బతింటాయి.
ఇంటి ముఖభాగం గోడపై కాన్వెక్స్ మిర్రర్ ఉంచడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగించబడుతుంది.

చనిపోయిన జంతువులు:
వాస్తు ప్రకారం అసహజమైన వాటిని ఇంట్లో ఉంచొద్దు. దంతాలు, తొక్కలు, గుండ్లు, నత్తలు, కొమ్ములు, జంతువుల చర్మాలు ఇలాంటి చనిపోయిన జంతువుల భాగాలను ఇంట్లో ఉంచకూడదు. అవి ఇళ్లలోకి దురదృష్టాన్ని తీసుకువస్తాయి.

చనిపోయిన, స్పైకీ మొక్కలు:
కాక్టస్ లాంటి ముళ్ల మొక్కలు ఇంట్లోని ప్రశాంతతను తొలగిస్తాయి. కుటుంబసభ్యుల మధ్య సఖ్యత కోల్పోయేలా చేస్తాయి. ఇలాంటి మొక్కలను ఇంట్లో పెంచడం వల్ల శృంగార సమస్యలూ వస్తాయి. వాటి వల్ల ఆర్థిక సమస్యలు నెలకొంటాయి.
లివింగ్ రూము, బెడ్రూము, ఇంటి ప్రదాన ప్రవేశంలో ఇలాంటి ముళ్ల మొక్కలను ఉంచొద్దని వాస్తు శాస్త్రం చెబుతోంది. అలాగే వాడిపోయిన పువ్వులను ఇంట్లో ఉంచకూడదు. నిర్జీవమైన పువ్వులు, మొక్కలు పరిసరాలల్లో శక్తి ప్రవాహానికి అంతరాయం కలిగిస్తాయి. ఇంట్లోని శక్తి సమతుల్యతను దెబ్బతీస్తాయి.
కార్నేషన్ వంటి కొన్ని పూలను ఎప్పుడూ ఇంటి లోపల ఉంచొద్దు. వాటి వల్ల దురదృష్టం వస్తుందని నమ్ముతారు. అయితే తోటలో కార్నేషన్లను నాటవచ్చు.

ఆగిపోయిన గడియారాలు:
వాస్తు శాస్త్రం ప్రకారం విరిగిన, ఆగిపోయిన గడియారాలను ఎక్కువ రోజులు ఇంట్లో ఉంచకూడదు. గడియారాలు ఆగిపోతే వెంటనే బ్యాటరీ మార్చాలి లేదంటే ఇంట్లో నుండి తొలగించాలి. ఆగిపోయిన గడియారాలు జీవితంలో బద్దకం, అస్థిరతను సూచిస్తాయి. సంబంధాలు, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో పురోగతిని నిరోధిస్తాయి.

పాడైపోయిన పాత్రలు:
దెబ్బతిన్న, పగిలిన, సొట్టలు పోయిన పాత్రలను వాడకూడదు. చాలా పాత్రలకు కింద పడి, దెబ్బలు తగిలి పాడైపోతాయి. వాటిని వీలైనంత త్వరగా రిపేర్ చేయించుకోవాలి లేదంటే ఇంట్లో నుండి తీసేయ్యాలి. వాటి వల్ల ఇంట్లో ప్రతికూల శక్తులు రాజ్యమేలే అవకాశం ఉంది.

ఇంట్లో ప్రతికూలతను తొలగించే చిట్కాలు:
* పరిశుభ్రత:
భారతీయ సాంప్రదాయం ప్రకారం లక్ష్మీ దేవి చక్కగా, శుభ్రంగా ఉన్న ఇంట్లో ఉండటానికి ఇష్టపడుతుందని నమ్ముతారు. మంచి వాతావరణంలో జీవించడం కూడా వ్యాధులు, నిరాశను దూరం చేస్తుంది.
* విండ్ చైమ్స్:
ఇంట్లో విండ్ చైమ్స్ పెట్టుకోండి. శబ్ధం చేసే విండ్ చైమ్స్ ఇంట్లోని ప్రతికూల శక్తిని తొలగిస్తాయి.
* అగర్‌బత్తీలు కాల్చాలి:
సువాసన అందించే పొగ చాలా కాలం నుండి ఆధ్యాత్మిక, ధ్యాన సాధనగా ఉంది. ఇంట్లో నుండి ప్రతికూలతను తొలగించడానికి అందుబాటులో ఉన్న సరళమైన పద్ధతుల్లో ఇది కూడా ఒకటి.
* ఉప్పు వాడకం:
సముద్రపు ఉప్పు ఇంట్లోని చెడు శక్తిని తటస్థీకరిస్తుంది. ప్రతి గదిలో సముద్రపు ఉప్పును ఉంచండి. సముద్రపు ఉప్పు రాళ్లను మూలల్లో ఉంచవచ్చు.
* రంగులు ఉపయోగించండి:
ఇంట్లో మనం అనుభవించే శక్తిపై రంగులు బలమైన ప్రభావాన్ని చూపుతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం, వాయువ్య, ఉత్తరం మరియు ఈశాన్యంలో నీలం, ఆగ్నేయంలో నారింజ, దక్షిణాన ఎరుపు, నైరుతిలో పసుపు రంగులు వేసుకోవడం మంచిది.
* మతపరమైన చిహ్నాలను ఉంచడం:
ఇంట్లో మతపరమైన శిల్పాలు, పెయింటింగ్‌లు మరియు కళాఖండాలను ప్రదర్శించడం ప్రతికూలతను దూరం చేస్తుంది.



Click it and Unblock the Notifications