Latest Updates
-
దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే!
పడకగది వాస్తు చిట్కాలు, బెడ్ ఎటు వైపు ఉండాలి, టేబుల్‌పై ఏమేం పెట్టుకోవాలంటే..
వాస్తు ప్రకారం పడకగదికి సరైన దిశలో ఇంటి నైరుతి మూల ఉండాలి. తల దక్షిణం లేదా తూర్పు వైపు ఉండాలి. బెడ్ పొజిషన్ గోడ యొక్క మధ్య భాగంలో ఉండాలి. ఇలాంటి కొన్ని చిట్కాలతో దంపతుల మధ్య సంబంధం మెరుగుపడుతుంది. అలాంటి వివిధ వాస్తు చిట
నివాస స్థలాన్ని, జీవితాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి, సానుకూలంగా ఉండటానికి వాస్తు సహాయపడుతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఉండే ఇంటిని, పని చేసే చోటును, వ్యాపారంలోని అంశాలను మార్చుకోగలిగితే గొప్ప మార్పు వస్తుందని, పరిస్థితులు అనుకూలిస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దంపతుల మధ్య సంబంధాన్ని మెరుగుపరచడానికి కూడా వాస్తు చక్కగా ఉపయోగపడుతుంది. పడకగదిలోని వాస్తు లోపాలని సరిచేసుకుని వాస్తు చిట్కాలు పాటిస్తే దంపతుల మధ్య అన్యోన్యత మెరుగుపడుతుంది. సాన్నిహిత్యం పెరిగి బంధం బలోపేతం అవుతుంది.

వాస్తు ప్రకారం పడకగదికి సరైన దిశలో ఇంటి నైరుతి మూల ఉండాలి. తల దక్షిణం లేదా తూర్పు వైపు ఉండాలి. బెడ్ పొజిషన్ గోడ యొక్క మధ్య భాగంలో ఉండాలి. ఇలాంటి కొన్ని చిట్కాలతో దంపతుల మధ్య సంబంధం మెరుగుపడుతుంది. అలాంటి వివిధ వాస్తు చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పడకగదిలో బెడ్ ఎక్కడ ఉంచాలి:
పడక గదిలో బెడ్‌ను మూలను పెట్టకూడదు. దీని వల్ల సానుకూల శక్తి స్వేచ్ఛగా ప్రవహించదు. వాస్తు ప్రకారం పడకగదిలో బెడ్ మధ్య భాగంలో ఉండాలి. బెడ్ చుట్టూ తిరగడానికి వీలుగా తగినంత స్థలం ఉండేలా చూసుకోవాలి.

దంపతుల కోసం వాస్తు చిట్కాలు:
* దంపతులు ఇంటికి యజమాని అయితే వాస్తు ప్రకారం నైరుతిలో పడకగది దిశను ఎంచుకోవాలి. కొత్తగా పెళ్లైన వారి పడకగది వాయువ్య మూలలో ఉండాలి. వాస్తు నియమాల ప్రకారం పడకగది ఈశాన్యంలో ఉండకూడదు.
* మాస్టర్ బెడ్రూములో బెడ్ దక్షిణం లేదా నైరుతి వైపు ఉండాలి. భర్తకు ఎడమ వైపున భార్య నిద్రించాలి.
* బెడ్‌ను గోడకు వేసుకోకూడదు. కొంత స్థలం వదిలి బెడ్ వేసుకోవాలి. బెడ్ చుట్టూ తిరిగేంత స్థలం ఉంచుకోవాలి.
* పడకగదిలో ఒంటరి జంతువులు, పక్షులు, మనిషి ఉండే పెయింటింగ్స్, ఫోటోలు ఉంచకూడదు. జంట పక్షులు, రాధాకృష్ణులు, జంట జంతువుల పెయింటింగ్స్, ఫోటోలనే ఉంచాలి.
* బెడ్రూములో యుద్ధ పెయింటింగ్స్, దెయ్యాలు, గుడ్లగూబలు, గద్దలు, రాబందులు, భయంకర దృశ్యాల వంటి పెయింటింగ్స్ ఉంచకూడదు.
* జింకలు, హంసలు, చిలుకలు లాంటి వాటి పెయింటింగ్స్ ఉంచుకోవచ్చు.
* పడకగదిలో కుటుంబసభ్యుల ఫోటోలు, విహారయాత్రలకు వెళ్లినప్పుడు ఫోటోలు, పోస్టర్లు పెట్టుకోవచ్చు.
* మార్బుల్ ఫ్లోరింగ్ ఉన్న పడకగదిలో కొత్తగా పెళ్లైన వారు ఉండకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది.

బెడ్‌సైడ్ టేబుల్‌పై ఎలాంటి వస్తువులు ఉంచాలి:
పడకగది పక్కన టేబుల్ ఇప్పుడు అవసరంగా మారిపోయింది. అలాగే బెడ్‌సైడ్ టేబుల్ పడకగదికి అందాన్ని కూడా తీసుకువస్తుంది. అయితే బెడ్‌సైడ్ టేబుల్‌పై అసలు ఎలాంటి వస్తువులు ఉంచాలి, ఎలాంటి వస్తువులు ఉంచకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
* క్యాండిల్ లైట్ వెలుతురులో భాగస్వామితో గడపడం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ ఊహే గమ్మత్తుగా ఉంటుంది. ఆ ఫీల్ కోసం కొంతమంది బెడ్‌సైడ్ టేబుల్‌పై కొవ్వొత్తులు వెలిగిస్తారు. అయితే బెడ్‌సైడ్ టేబుల్‌పై కొవ్వొత్తులు వెలిగించకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది.
* చాలా మంది మంచం పక్కనే వాటర్ బాటిళ్లు, జగ్గులు ఉంచుకుంటారు. కానీ వాస్తు ప్రకారం అది మంచిది కాదు. వాటర్ బాటిళ్లను బెడ్‌కు కొద్ది దూరంలో ఉంచాలని వాస్తు శాస్త్రం చెబుతోంది.
* బెడ్‌సైడ్ టేబుల్‌పై మెటల్ వస్తువులు ఉంచడం మంచిది కాదు. బెడ్‌కు దగ్గరగా ఉంచినప్పుడు శరీరం యొక్క శక్తితో సంకర్షణ చెందుతుంది. దాని వల్ల తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
* బెడ్‌సైడ్ టేబుల్‌పై కొందరు గడియారాలను ఉంచుతారు. బెడ్ పక్కనే గడియారాలను ఉంచడం వల్ల విద్యుదయాస్కాంక వికిరణాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒత్తిడి, తలనొప్పి, నిద్రలేమి కారణమవుతుంది.



Click it and Unblock the Notifications