For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దీపావళి పండుగ కాలుష్యాన్ని అరికట్టే 5 మార్గాలు!

By B N Sharma
|

5 Ways To Prevent Pollution This Diwali!
దీపావళి పండుగ వస్తోందంటే, పండుగకు ముందు వారం రోజులు, తర్వాత వారం రోజులు, టపాకాయల పేలుళ్ళు, వాటి పొగలు, ధ్వని, వాతావరణ కాలుష్యం కలుగజేస్తాయి. ఏ ఏటికాఏడు ఈ పండుగను జరుపుకోవడం ఆనందంగా వున్నప్పటికి కష్టతరమైపోతోంది. ఈ కాలుష్యం తగ్గాలంటే కొన్ని చర్యలు చేపట్టాలి. వాటిలో ప్రధానమైనవి కొన్ని పరిశీలించి ఆచరించండి. పండుగను ఆనందంగా జరుపుకోండి.

1. గ్రీన్ లైట్స్ ఉపయోగించండి - దీపావళి వేడుకలకు ప్రధానంగం ఇండ్లలో లైటింగ్ ఏర్పరుస్తాం. సాంప్రదాయ నూనె దీపాలకు బదులు, నేడు ఆధునికంగా వస్తున్న గ్రీన్ లైట్లు పెట్టండి.

2. క్రాకర్లు ఓపెన్ ప్రదేశాలలో కాల్చండి - క్రేకర్స్ వలననే అధిక కాలుష్యం కలుగుతుంది. వాటిని ఆపలేము. అయితే కాల్చేటపుడు కొంత భాధ్యత వహించి సాధారణంగా ఇండ్లముందు, రోడ్ల మీద కాకుండా నివాసాలకు దూరంగా బయలు ప్రదేశాలలో కాలిస్తే, ధ్వని, పొగ కాలుష్యాలుండవు.

3. ధ్వని కాలుష్యం నిలపండి - దీపావళిని దివ్వెల పండుగ అన్నారే కానీ ధ్వని పండుగ అనలేదు. కనుక మీరు కాల్చే టపాసులు రంగు రంగుల పూలతో కాంతులిచ్చేవిగానే ఎంపిక చేసుకోండి కాని చెవులు పగిలేలా, లేదా గుండె నొప్పులు వచ్చేలా అధిక ధ్వనులు వచ్చే బాంబులు వంటివాటి జోలికి పోకండి.

4. క్రేకర్లు కాల్చేసిన మరుసటి రోజు ఇంటిముందు, ఇంటిలోపల, రోడ్డు పైనా ఎక్క డ చూసినా చెత్తే. ఈ చెత్తను తొలగించే చర్యలు మీరే చేపట్టండి. మీ ఇంటి ముంగిట వున్న చెత్తనంతా దూరంగా పడవేసి దానిని తగలబెట్టటం వంటి చర్య చేస్తే మీ పరిసరాలు కాలుష్యం లేకుండా వుంటాయి.

5. దీపావళి వచ్చిందంటే...అంతా ప్లాస్టిక్ కవర్ల, బాక్సుల వినియోగం వుంటుంది. క్రేకర్ల కవర్లు, స్వీట్ బాక్సుల కవర్లు పగిలిన బాటిల్స్, ఎన్నో దర్శనమిస్తాయి. పండుగ పేరుతో ఆనందించదగినదే. కాని అనవసరమైన బాటిల్స్ వంటి వాటికి చోటివ్వకండి. వీటిన్నింటిని సేకరించి తగిన విధంగా నిర్మూలించండి.

ఈ చర్యలలో కొన్నింటిని పాటించినప్పటికి మీరు కాలుష్యాన్ని తొలగించటానికి లేదా తగ్గించటానికి పాటు పడిన వారే. దీపావళి పండుగను విభిన్న రీతిలో జరుపుకొని ఆనందించండి.

English summary

5 Ways To Prevent Pollution This Diwali! | దీపావళి పండుగ కాలుష్యాన్ని అరికట్టే 5 మార్గాలు!

Diwali Does Not Have To Be Plastic: The smoke pollution on Diwali is understandable but what about the plastic covers of the fire crackers, the sweet boxes disposed offhandedly and the broken bottles in the middle of the alleys. Let Diwali not be an excuse for drunken and disorderly behavior. Collect all the plastic and non-explosive garbage separately so that it can be disposed appropriately.
Story first published:Saturday, October 15, 2011, 14:29 [IST]
Desktop Bottom Promotion