Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
చిట్కా ప్రపంచం .. ‘బ్యాచిలర్స్ ప్రత్యేకం’..!!

- మీరు ఇష్టపడికొనుక్కున్న జీన్స్ రంగుమారకుండా ఉండాలంటే, అరబక్కెట్ నీటిలో 4 నుంచి 6 చుక్కల వెనిగర్ వేసి, ఆ నీటిలో జీన్స్ ను నానబెట్టి ఆ తరవాత ఉతుక్కోండి.
- రెండు టేబుల్ స్పూన్ల నిమ్మ చెక్కల పొడిని వాషింగ్ పౌడర్ లో కలిపి బట్టలను ఉతికితే తెల్లగా ఉంటాయి.
- ఐరన్ బాక్స్ అడుగున కొద్దిగా ఫారాఫిన్ రాస్తే గంజి పెట్టిన బట్టలు అతుక్కోకుండా ఉంటాయి.
- మీ దుస్తల పై గమ్ అతుక్కుంటే కొద్ది సేపే ఐస్ ముక్కను క్లాత్ పై ఉన్న గమ్ పై ఉంచి ఆ తర్వాత గీరేస్తే గమ్ ఊడిపోతుంది.
- గోడకు కొట్టిన మేకుకి బట్టలు తగలించి తీసేటప్పుడు హడావిడిగా లాగితే దుస్తులు చిరిగే ప్రమాదం ఉంది. ఆ మేకులో రబ్బురు కాని, స్పాంజ్ కాని గుచ్చి ఉంచితే బట్టలు చిరగవు.
- తుప్పుపట్టిన తీగల పై బట్టలు ఆరేసినప్పుడు బట్టలకు తుప్పు మరకలు అంటుతాయి. ఆ తప్పు మరకలు పోవాలంటే మరకల మీద నిమ్మ తొక్కలతో రుద్ది ఎండలో వేయండి.
- తెల్లని బట్టల పైన పడిన మరకలను నిమ్మరసం వేసి నిమ్మ తొక్కతో రుద్ది తర్వాత సబ్బుతో ఉతికితే మచ్చలు మాయమవుతాయి. అదే విధంగా తెల్లని బట్టమీద కూర మరకలు పడితే తెల్లని టూత్ పేస్టు కొంచెం మరక పై రాసి నీటిలో తడిపి ఉతికి ఆరేస్తే మరక పోతుంది.
- దుస్తలు పై గోరింతాకు మరకలు పోవాలంటే నిమ్మతొక్కలతో మరకల పై రుద్దండి
- దుస్తల పై పేరకున్న మురికిని వదలించడానికి గట్టిగా బ్రష్ తో రుద్దితే షర్టుకాలర్లు త్వరగా పాడవుతాయి. కాస్త షాంపు వేసి నాననిచ్చి ఉతికి చూడండి మార్పు తెలుస్తుంది.
- బట్టల పై సిరా మరకలు పోవాలంటే నిమ్మరసం కాని, పుల్లని పెరుగకాని ఆ మరక పై వేసి రుద్దండి. ఆ పైన ఉప్పుతో సీరా మరక పోయేంత వరకు రుద్ది ఉతికేయండి.
- బట్టల్లో బొద్దింకలు చేరకుండా ఉండేందుకు కలరా ఉండలతో పాటు కర్పూరాన్ని పెట్టి ఉంచండి.
- వైట్ సాక్స్ బ్రౌన్ గా తయారైందా.. నీటిలో రెండు లెమన్ నిమ్మకాయ బద్దలను వేసి ఈ నీటిలో సాక్సులను వేసి కొద్ది సేపు బాయిల్ చేయండి. ఆ పై ఉతికితే మీ సాక్సులు తెల్లగా వచ్చేస్తాయి.



Click it and Unblock the Notifications