Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇంటి శుభ్రత వేగంగా... !

ఇంటి శుభ్రతకు ఉపయోగించే పరికరాలు ఎలాగుండాలనేది పరిశీలించండి.
1. క్లాత్ డస్టర్ - వాక్యూమ్ క్లీనర్ ఎంత శుభ్ర పరచినప్పటికి, ఫర్నిచర్ వస్తువులన్ని ఒక క్లాత్ డస్టర్ తో ముందుగా దులపాలి. దుమ్ము అంతా పోయిన తర్వాత శుభ్రం చేస్తే వస్తువులు మరింత బాగుంటాయి.
2. పొడవైన కుంచె చీపురు - ఇల్లు శుభ్రం చేయటమంటే, దీని సాటికి మరోటి లేదు. గదిలో పై భాగాన వుండే మూల మూలలా పట్టే బూజులు తీసేయటానికి ఇది మంచి సాధనం. ఛాండిలీయర్లు, సీలింగ్ ఫ్యాన్ లు కూడా దీనితో శుభ్రం చేయవచ్చు.
3. మ్యాజిక్ మోపా - ఖరీదైనప్పటికి కొనటానికి వెనకాడకండి. ఒక సారి కొంటే కొన్ని సంవత్సరాలపాటు పడి వుంటాయి. గట్టి మోపా హేండిల్ ఫ్లెక్సిబుల్ గా వుండేది కొనండి. నేల తడిపి శుభ్రం చేయటానికి పనికి వస్తుంది.
4. హేండిల్ వైపర్ - ఇల్లు వేగంగా శుభ్రపరచాలంటే ఇది వుండాల్సిందే. నేలపై నీరు ఎక్కడవున్నా తుడిచేయటానికి ఇది పనికి వస్తుంది.
5. ఫెదర్ డస్టర్ - టి.వి., కంప్యూటర్ మొదలైన ఎలక్ట్రానిక్ పరికరాలు శుభ్రంచేయాలంటే ఫెదర్ డస్టర్ వుండాలి. చాలా మెత్తగా వుండి పరికరాలలోని భాగాలు దెబ్బతినకుండా తేలికగా క్లీన్ చేస్తుంది.
6. వాక్యూమ్ క్లీనర్ - కార్పెట్లు, సోఫాలు, కుషన్లు, మేట్రస్ లు మొదలైనవి శుభ్రం చేయటానికి వాక్యూమ్ క్లీనర్ కావాలి. దీనిని రోజూ ఉపయోగించకపోయినా వారానికోకసారి చేసే ఉపయోగం అధిక ఫలితాన్నిస్తుంది.
పై శుభ్రత జాగ్రత్తలు పాటించాలంటే, సూచించిన పరికరాలు కొనుగోలు చేసి రాబోయే క్రిస్టమస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలకు మీ ఇంటిని తళ తళ లాడేలా వుంచి ఆనందించండి.



Click it and Unblock the Notifications