Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
చూడగానే మతిపోతుందా..?? ఇలా చేయండి...!!

మన నిత్యావసరాల్లో ఒకటైన విద్యుత్ ను ఉపయోగించే తీరునుబట్టి బిల్లు వస్తుంది. కరెంటు బిల్లు అధికంగా వస్తున్న కుటుంబాల్లో సమస్య ఎక్కడ వస్తుందంటే. ఎక్కడైతే తక్కువ కాంతి అవసరమో, అక్కడ ఎక్కువ కాంతినిచ్చే బల్బులను ఉపయోగించడం. నిర్లక్ష్యంతో వెలిగించిన బల్బును ఆఫ్ చేయకపోవడం, ఫ్రిజ్ ను అనవసరంగా తెరుస్తుండటం, అవసరం లేకున్నా ఫ్యాన్లు వేయడంలాంటి అవనసర విషయాల వల్ల నెలోచ్చేసరికి కరెంటు తడిచి మోపెడవుతుంది. కాస్తంత శ్రద్ధ వహించి ఈ చిట్కాలను పాటిస్తే విద్యుత్ 'షాక్' నుంచి మీరు బయట పడోచ్చు.
విద్యుత్ ని ఇలా ఆదా చేయ్యండి..:
- ఇంట్లో వేడి వాతావరణాన్ని నియంత్రించడానికి ఇంటిచుట్టూ మొక్కలను పెంచేలా చూడండి. అవసరమైనప్పుడు మాత్రమే కరెంటును ఉపయోగించుకోండి.
- సాధారణంగా వినియోగించే బల్బులు స్థానంలో లేటెస్టుగా వస్తున్న సీఎఫ్ ఎల్ బల్బులను ఉపయోగిస్తే దాదాపు 80 శాతం విద్యుత్ ను ఆదా చేసుకోవచ్చు. ఈ బల్బుల నుంచి వెలువడే కాంతి కూడా అధికంగానే ఉంటుంది.
- వేడిని తగ్గించుకోవడానికి ఎయిర్ కండీషనర్ కు బుదులుగా సీలింగ్ ఫ్యాన్ కాని టేబుల్ ఫ్యాన్ ను ఉపయోగించండి. ఒక వేళ ఎయిర్ కండీషనర్ ను ఉపయోగించాల్సి వస్తే కిటికీలు, తలుపులు మూసే ఉంచండి.
- ప్రస్తుత మార్కెట్లో మనకు ఆటోమెటిక్ సాంకేతిక వస్తువులు లభ్యమవుతున్నాయి. వీటి ప్రత్యేకతలను పరిశీలిస్తే పని పూర్తికాగానే వాటంతంటికి అవే ఆఫ్ అయిపోతాయి. వీలుంటే ఈ వస్తువులు కోనుగోలు చేయండి.
- మిక్సర్ లేడా గ్రైండర్ లను పదే పదే ఉపయోగించకుండా, కావల్సిన పదార్థాన్ని ఒకే సారి రుబ్బుకోండి. టీవి విషయంలోనూ జాగ్రత్త వహించండి. రిమోట్ దగ్గర కాకుండా పూర్తిగా ఆఫ్ చేయండి.
- వేడిగా ఉన్న పదార్థాలను చల్లబడిన తర్వాత మాత్రమే ఫ్రిజ్ లో పెట్టాలి. దీని వల్ల విద్యుత్ వినియోగం తక్కువ మోతాదులో ఖర్చవుతుంది. ఫ్రీజర్ ను ఎప్పటికప్పుడు డీఫ్రాస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రిజ్ తలుపు మూసారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి.



Click it and Unblock the Notifications
