Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ స్నానాల గది ఆహ్లాదంగా ఉందా!?

ఇంట్లో పూలకుండీలను అమర్చుకున్న తరహాలోనే స్నానాల గదిలోనూ దానికోసం కొంత సమయాన్ని కేటాయించాలి. ఒకవేళ గదిలో ఖాళీ స్థలం లేకపోతే.. హ్యాంగింగ్ పాట్‌ను వేలాడదీయాలి. ఇలా చేయడం వల్ల స్నానాల గదిలో ఉండే దుర్వాసనలను మొక్కలు పీల్చేస్తుంటాయి. ముఖ్యంగా, స్నానాల గదిలోకి వెంటిలేషన్ చాలా తక్కువగా ఉండే వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది.అలాగే అనేక గృహాల్లో బాత్రూమ్ గదుల తలుపులు నిరంతరాయంగా మూసి ఉంచుతారు. దీనివల్ల గాలి ఆడదు. ఉక్కపోత ఎక్కవగా ఉంటుంది. ఇలాంటి గదుల్లో మొక్కలను ఉంచితే ఈ సమస్య ఉత్పన్నం కాదు. బాత్రూమ్‌లో తేమ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పురుగులు, ఫంగస్ చేరుతుంది. అయితే, కుండీని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల దానిలోని మొక్క తేమను త్వరగా పీల్చుతుంది.
అయితే, బాత్రూమ్‌లలో ఎలాంటి మొక్కలను పెంచాలన్న దానిపై సందేహాలు ఉత్పన్నమవుతుంటాయి. సౌందర్యోత్పత్తుల్లో ఎక్కువగా వినియోగించే కలబందను వాడటం మంచింది. దీనికి గాలి, వెలుతురు అవసరం ఉండదు. ఎలాంటి వాతావరణంలోనైనా పెరుగుతాయి. అందుకే స్నానాల గదిలో కలబందను పెంచడానికి ఉపయోగపడుతుంది. గృహాంతర వాతావరణంలో చక్కగా పెరిగే వెదురును కూడా పెంచొచ్చు. ఇది పెరిగే కొద్దీ ఎప్పటికపుడు కత్తిరిస్తూ ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. పైపెచ్చు స్థలం కూడా ఎక్కువగా కేటాయించాల్సిన అవసరం లేదు. ఈ మొక్కలు పెంచిన కుండీల పైభాగంలో రంగురాళ్లు, గులకరాళ్లను ఉంచితే మరింత అందంగానూ ఉంటాయి. అలాగే, అర్కిడ్ జాతి మొక్కలను కూడా పెంచడం వల్ల స్నానాల గదిని మరింత హరితంగా తీర్చిదిద్దవచ్చు.



Click it and Unblock the Notifications