Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
వార్డ్ రోబ్ లో ఏర్పాటు ఎలా వుండాలి?

మీ వార్డ్ రోబ్ లో తగినన్ని అరలు పెట్టుకోండి. ఒక దానిలో ప్రతిరోజూ ధరించే ఫార్మల్ దుస్తులు, మరో దానిలో మీటింగులకు ప్రత్యేక సందర్భాలకు అవసరమైన ప్రత్యేక దుస్తులు వుంచండి. ఇలా వేరుగా వుంచుకోకపోతే, మీటింగ్ కు వెళ్లేటపుడు మీకు కావలసిన షర్టు దొరకక సమయం మీటింగ్ కొరకు పెట్టాల్సింది బదులు షర్టు వెతకటంపై పెట్టాల్సివస్తుంది. వార్డ్ రోబ్ లో పై అరలో డైలీ వేసుకునే దుస్తులు వుంచండి. అవి మీకు తేలికగా అందేలా వుండాలి.
సాధారణంగా మనం అట్టడుగునవున్న వాటిని బయటకు లాగేస్తూవుంటాం. పైన పెట్టిన దుస్తులు చిందరవందర అయినా పట్టించుకోము. తర్వాత పై బట్టలలో మీకు అవసరమైనవి వెతకాలంటే ఇక కష్టమే మరి. కనుక అడుగున వున్నప్పటికి పై బట్టలు జాగ్రత్తగా తీసి వేరే చోట పెట్టి అడుగున వున్న దానిని తీసుకోండి. దీనికిగాను 1 నిమిషం సమయం పెడితే చాలు. తర్వాత మీరు వెతుకులాట చేయాల్సినపనిలేదు.
వీలైతే, ఉదయం వేళ ఆపీసుకు వేసుకు వెళ్ళవలసిన దుస్తులు రాత్రి పూటే తీసి బయట పెట్టుకోండి. ఖంగారులో ఉదయం వేళ వార్డ్ రోబ్ చిందర వందర కాకుండా వుంటుంది. దుస్తులకు తగిన టై లేదా దుప్పటా మొదలైనవి కూడా వాటితో పాటే వుంచుకుంటే బాగుంటుంది. ఈ వస్తువులకు ఉదయం పూట వెతుకులాడితే సమయం వృధా అవుతుంది. ఎప్పటికపుడు వార్డ్ రోబ్ సరిగా సర్ది వుండేలా చూసుకుంటే, ప్రతిరోజూ అది చిందరవందర కాకుండా వుంటుంది.
వారాంతంలో లాండ్రీ నుండి వచ్చే దుస్తులు ఒక ప్రణాళిక మేరకు వార్డ్ రోబ్ లో పెట్టుకోండి. మడతలు ఒక సారి తొలగితే మరల పెట్టటం మనకు కుదరని పని. వారాంతంలో ఈ పనికి ఒక గంట కేటాయిస్తే వారమంతా మైండ్ గుడ్డలకు సంబంధించి హాయిగా వుంటుంది. వార్డ్ రోబ్ సర్దుడనేది ఇంటి పని మాదిరిగా కాకుండా టైమ్ మేనేజ్మెంట్ రీత్యా చేసుకుంటే మన ఆఫీసు ఉద్యోగాలు సౌకర్యవంతంగా కూడా చేసుకున్నట్లు వుంటుంది.



Click it and Unblock the Notifications