Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఇల్లు మారుతున్నారా? ప్యాకింగ్ ఎలా చేయాలి?

కనుక ప్యాకింగ్ కొరకు దిగువ ఇవ్వబడే సూచనలు మీకెంతో ఉపయోగపడతాయి. పరిశీలించండి.
1. ఇంటిలోని ఒక్కొక్క గదిలోని వస్తువులను ప్యాక్ చేయడం మొదలుపెట్టండి. అన్ని గదులలోని సామానులు ఒకే సారి ప్యాక్ చేయటానికి మొదలు పెట్టవద్దు. బెడ్ రూమ్ ఫర్నిచర్ వేరుగాను, షోకేసు వస్తువులు వేరుగాను ప్యాక్ చేయండి. కొత్త ఇల్లు మీ ఇప్పటి ఇంటికంటే వేరుగా వుండవచ్చు. కనుక మీరు తీసుకు వెళ్ళే సామాగ్రి కొత్త ఇంటికి సరిపోయాలాగా కూడా వుండాలి. కొత్త ఇంట్లో అతిధి రూమ్ లేకుంటే ఆ వస్తువులు పిల్లల గదిలో పెట్టండి.
2. అత్యవసరం అనుకున్న వస్తువులు ముందుగా ప్యాక్ చేయండి. టూత్ బ్రష్లు, రాత్రి రుసుకునే క్రీములు, ఫేస్ వాష్, టవల్, రాత్రి వేసుకునే బట్టలు అన్నీ ముందుగా ప్యాక్ చేయాలి. లేదంటే చివరకు వీటిని ఎక్కడ వుంచామో కూడా తెలియని పరిస్ధితి వస్తుంది. ఉదయం లేవగానే తింటానికి కొద్దిపాటి ఆహారాన్ని కూడా రెడీగా పెట్టుకోండి. కొత్త ఇంటిలో కిచెన్ వెంటనే రెడీ కాకపోయినా పరవాలేదు.
3. ఉపయోగంలో లేని వస్తువులను వదిలేయండి. ఇది మీకు చాలా పని తగ్గిస్తుంది. అవసరమనుకున్నవే తీసుకోండి. కొత్త ఇంటికి కర్టెన్ల వంటివి కొనాలనుకుంటే పాతవి ఇక్కడే వదిలేయండి. అదే విధంగా ఫర్నిచర్ కూడా రిపేరులో వున్నా లేదా అనవసరమనుకున్నా వాటిని వదిలించుకోవడం మంచిది.
కొత్త ఇంటిని ఎలా సర్దుకోవాలి?
పాత ఇంటిలో ఒక్కొక్క గది ఎలా ప్యాక్ చేసుకుంటూ వచ్చారో, కొత్త ఇంటిలో అదే విధంగా ఒక్కొక్కగది సర్దుకుంటూ రావాలి. హడావుడి పడకండి. సర్దుకోటానికి కొద్ది రోజులు తీసుకోండి. మరల తర్వాత మార్పులు చేసుకునే కంటే, కొద్ది రోజులు ఒకేసారి ప్లాన్ చేసి వస్తువులు సర్దుకోవడం తేలికైన పని. మీరు సర్దు కోవాల్సిన వస్తువులను ఆ గదికి తీసుకు వచ్చి ప్యాకింగ్ తెరవండి. చాలా సమయం కలిసివస్తుంది. ప్యాకింగ్ లో చిన్నపాటి ఈ సలహాల ఆచరణ మిమ్మల్ని పెద్ద పెద్ద అసౌకర్యాలకు గురి చేయకుండా వుంటుంది.



Click it and Unblock the Notifications