For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చక్కగా శుభ్రం చేస్తే.....ఇంద్ర భవనమే మరి!

By B N Sharma
|

Places To Clean At Home
ఇంటిని పరిశుభ్రం చేసేటపుడు ప్రతి వారు వారి షెడ్యూలును ఆచరిస్తూనే వుంటారు. కొంతమంది వారానికి, కొంతమంది నెలకు లేదా మూడు నెలలకోసారి కూడా ఇంటిని శుభ్రం చేస్తుంటారు. అయితే, ఇంటి శుభ్రతలో కొన్ని ముఖ్యమైన ప్రదేశాలున్నాయి. ఇల్లంతా శుభ్రం చేసినా వీటిని మరచిపోతుంటాం. అవేంటో ఇపుడు చూద్దాం!

వీటిని ఖచ్చితంగా వారానికోసారి చేయాలని కాదు. కనీసం సంవత్సరానికి ఒకటి లేదా రెండు సార్లయినా మీ క్లీనింగ్ షెడ్యూలులో పెట్టాలి. వీటిని ఆచరిస్తే ఇల్లు తళ తళలాడుతుందనటం అతిశయోక్తి కాదు.

శుభ్రపరచాల్సిన అంశాలు
1. ఎలక్ట్రానిక్స్: ప్రతిదినం ఉపయోగించే రిమోట్ కంట్రోల్స్, మౌస్, కీబోర్డు, టెలిఫోన్ మొదలైనవాటిని యాంటీ బాక్టీరియల్ లోషన్స్ తో శుభ్రం చేయండి. సందేహం లేదు అవి కొత్త వాటిగా మెరుస్తుంటాయి. అదే సమయంలో వాటికి అంటుకొని వున్న బాక్టీరియా నశిస్తుంది.

2. శుభ్రపరిచే పరికరాలు: శుభ్రపరిచే పరికరాలనే శుభ్ర పరచటం మర్చిపోతాం. వాషింగ్ మెషీన్, డిష్ వాషర్, వాక్యూమ్ క్లీనర్ మొదలైనవి కూడా శుభ్రం చేయాలి. నీటిలో నిమ్మరసం, వెనిగర్, బేకింగ్ సోడాలు కలిపి ఆ మిశ్రమాన్ని వాషింగ్ మెషీన్ లేదా డిష్ వాషర్ లో వేసి పూర్తి సైకిల్ నడపండి. వాటికి అతుక్కుని వున్న మరకలన్ని మటుమాయం. పాత టూత్ బ్రష్ ఉపయోగించి కొన్ని భాగాలు క్లీన్ చేయవచ్చు.

3. రిఫ్రిజిరేటర్ : దీనిని లోపలి భాగాల్లో ఎపుడూ శుభ్రంగానే వుంచుతాం అయితే వెనుక భాగం, పై భాగాలు దుమ్ముకొట్టి అసహ్యంగా వుండటాన్ని గమనించం. రిఫ్రిజిరేటర్ ను స్విచ్ ఆఫ్ చేయండి. చక్కగా శుభ్రం చేయండి.

4. గోడలు, సీలింగ్ : బూజులు దులిపేస్తాం. అయితే సీలింగ్, గోడలు వదిలేస్తాం. చక్కటి ఫెదర్ డస్టర్ ఉపయోగించి ఈ రెంటిని కూడా శుభ్రం చేసి మార్పు చూడండి.

5. చెంచాలు, ఫోర్కుల స్టాండు: సాధారణంగా దీనిని స్టవ్ పక్కన పెడతాము. కావలసినంత జిడ్డు, మురికి అంటుకుని వుంటుంది. వేడి సోప్ నీటితో శుభ్రంచేసి ఆరబెట్టండి.

6. గేట్ లైట్లు లేదా గార్డెన్ లైట్లు: బయట ఉండే ఈ లైట్లపై లేదా షేడ్లపై పక్షుల రెట్టలు, వాహనాల దుమ్ము ఎంతో వుంటుంది. కనుక బయటవుండే వీటినికనీసం మూడు లేదా నాలుగు నెలలకొకసారి శుభ్రం చేయండి. బల్బులను సోప్ వాటర్ తో శుభ్రపరచి వెలుగులు విరజిమ్మేలా చేయండి.

English summary

Places To Clean At Home - Do Not Miss These 6! | చక్కగా శుభ్రం చేస్తే.....ఇంద్ర భవనమే మరి!

Walls & Ceilings: You clear cobwebs from windows, doors and even the corners of the house. However, most often we forget the walls and ceiling. Using a feather duster will get rid of the dust settled on the walls and ceilings.
Story first published:Saturday, August 20, 2011, 16:45 [IST]
Desktop Bottom Promotion