Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆస్తులు అగ్నికి ఆహుతి కానివ్వకండి .... !

ప్రతి ఫ్లోర్ లోను స్మాక్ డిటెక్టర్స్ పెట్టండి. బేస్ మెంట్, బయట నిద్రించే ప్రదేశాలలో కూడా వుంచండి. తయారీ దారులు తమ లిటరేచర్ లో తెలిపిన విధంగా బ్యాటరీలను ఎప్పటికపుడు మార్చండి. ప్రతినెలా వాటినొ ఒకసారి టెస్ట్ చేయండి. 10 సంవత్సరాలు పైబడిన డిటెక్టర్లను మార్చండి. అగ్ని ప్రమాదాలనుండి ఇంటిని కాపాడాలంటే ఇంటి చుట్టూతా తగులబెట్టగలిగిన చెత్తను తొలగించండి. ఇంటి పైభాగంలో వున్న ఎండు ఆకులు, చెట్టు కొమ్మలు వంటివి వెంటనే ఎప్పటికపుడు తొలగించండి.
ఎలక్ట్రిసిటీ పరంగా షార్ట్ సర్క్యూట్ లు అవుతూ వుంటాయి. అటువంటపుడు ఇంటిలో ఎక్స్టెన్షన్ వైర్లు, కార్పెట్ల క్రిందా, రగ్గుల క్రిందా పోకుండా చూడండి. వీలైనంతవరకు వైర్లపై అధిక లోడ్ పడకుండా చూడండి. ఫ్యూజ్ బాక్స్ లలో సరైన ఫ్యూజ్ కేరియర్ పెట్టండి. ఏదైనా పరికరం పొగ లేక వాసన వస్తుంటే, ప్లగ్ వేరు చేసి రిపేరు చేయించండి. హీటర్లు ఏవైనప్పటికి తగలబడే వస్తువులకు మూడు అడుగుల దూరం వుంచండి. పిల్లలను, పెంపుడు జంతువులను హీటర్లకు దూరంగా వుంచండి. ఇంట్లో సిగరెట్ తాగే వారుంటే నిప్పు పట్ల మరింత జాగ్రత్త వహించాలి. నీరు కల యాష్ ట్రేలు వారి అవసరానికివ్వండి. మీ బట్టలు అంటుకుంటే, పరుగు పెట్టవద్దు. మీరు వున్న చోటే నేలపై దొర్లండి. ముఖాన్ని చేతులతో కప్పేయండి. మంటలు చల్లారేవరకు నేలపై దొర్లండి. మంటలనుండి బయటకు రావాలంటే, తలవంచి నేలపై పాకుతూ బయటకు రండి.
ఫైర్ యాక్సిడెంట్ అయితే, ఇంటి నుంచి ఎలా బయటకు రావాలనే దానిపై ఖచ్చితమైన ప్రణాళిక ముందుగా వేయండి. ఇంటిలోని కుటుంబ సభ్యులందరూ ఈ ప్రణాళికను రిహార్సల్ గా సంవత్సరంలో రెండు సార్లు వేయండి.



Click it and Unblock the Notifications