Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
బూట్లు, చెప్పులు శుభ్రం చేయాలంటే కొన్ని చిట్కాలు!

1. ముందు బూట్లు బురద, మురికి, లేదా మట్టి తగిలించుకున్నాయోమో పరిశీలించండి. మరకలు తక్కువే అనుకుంటే ఒక కాటన్ గుడ్డను సోప్ నీటిలో తడిపి బూట్లను తుడవండి. ఈ చర్య బూట్లపైనా, చెప్పులపైనా వున్న మరకలను పోగొడుతుంది.
2. తెల్లని కాన్వాస్ బూట్లు లేదా చెప్పులు మెషీన్ లో వేసి వాష్ చేయాలనుకుంటే వాటి లేసులు తీసి వేడినీటిలో కడగండి. అవసరమైన డిటర్జెంట్ వాడండి. బ్లోయర్ వాడవద్దు. ఇది వాడితే షూస్ పాడవుతాయి.
3. బ్లీచ్, బేకింగ్ సోడా, లేదా కొద్దిపాటి డిటర్జెంట్ ను నీటిలో కలపండి. ఆ మిశ్రమంలో ఒక టూత్ బ్రష్ ముంచి మరకలు పోయేటంతవరకు వైట్ షూస్ శుభ్రం చేయండి.
4. కడిగే ముందు, బూట్లకు, లేదా చెప్పులకు వున్న దుమ్ము పూర్తిగా దులపండి. అరకప్పు వేడి నీరు. ఒక టేబుల్ స్పూన్ అమోనియా, కొద్దిపాటి సబ్బు కలిపిన మిశ్రమం తయారు చేయండి. బాగా కలపండి. మొదట బేకింగ్ సోడాలో ముంచిన టూత్ బ్రష్ తో శుభ్రపరచి తర్వాత దానిని ఈ మిశ్రమంలో ముంచి మరోసారి కడగండి.
5. తెల్లటి బూట్లను, చెప్పులను శుభ్రం చేయటానికి సాధారణంగా బేకింగ్ సోడా లేదా తెల్లని వినేగర్ వాడతారు. ఈ మిశ్రమాన్ని బూట్లకు రాసి పది నుండి పదిహేను నిమిషాలపాటు నానపెట్టండి. తర్వాత కడిగేయండి.
6. మరో చిట్కాగా, తెల్లటి బూట్లను, చెప్పులను శుభ్రపరచేందుకు టూత్ పేస్ట్ వాడండి. బ్రష్ ను వేడి నీటిలో ముంచి కొద్దిపాటి టూత్ పేస్ట్ ను బూట్లపై రుద్దండి. తర్వాత నీటితో కడిగి టవల్ లేదా గుడ్డతో బాగా తుడవండి.



Click it and Unblock the Notifications