Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
తళ తళ లాడే ఇంటి కిటీకీ అద్దాలు ఎలా?

మొదటగా....గ్లాసు తుడవటానికి గుడ్డ కంటే కూడా పేపర్ మంచిదని తెలుసుకోండి. ఇంటిలో వున్న పాత వార్తా పత్రికలకు పని కల్పించండి. శుభ్రపరచేందుకు పేపర్ ఉపయోగించటం వలన దానిని పారవేయటం కూడా తేలిక. నీటితో శుభ్రపరచే ముందుగా, విండోలపై దుమ్ము దులపండి. లేదంటే నీటితో కలసి అది మరింత అసహ్యంగా అవుతుంది. విండో గ్లాసులను దుమ్ము దులపటానికిగాను శుభ్రమైన గుడ్డను ఉపయోగించండి. తుడవకండి, దులపండి. గుడ్డ ఒక చివరగా పట్టుకొని వరుసగా కొడుతూ వుంటే దుమ్ము పోతుంది.
విండో గ్లాసులు మురికి పేరుకొని వుంటే, కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిందే. గ్లాసులను డిటర్జెంట్ కలిపిన వేడినీటితో శుభ్రం చేయాలి. గుడ్డను నీటిలో ముంచి అదనపు నీటిని పిండి ఇక దానితో తుడవండి. నీరు తక్కువ వాడాలి. అధికమైతే, గ్లాసుకు మరకలవుతుంది. మురికి తుడిచేటపుడు గ్లాసుకు ఒత్తిడి కలిగించకండి. గ్లాసు పగిలే ప్రమాదముంది. గుడ్డతో తుడిచిన గ్లాసును చివరగా పాత పేపరుతో తుడిచి నీటి మరకలు పోగొట్టాలి. తడి పోయేటంతవరకు తుడవండి...ఇక మీ ఇంటి విండో గ్లాసు తళ తళా మెరుస్తుంది.
ఇటీవలి కాలంలో, నీటికి బదులుగా క్లీనింగ్ సొల్యూషన్లు క్లీనెక్స్, కోలిన్స్, ఈజీ ఆఫ్ బేంగ్ వంటివి వస్తున్నాయి. అవి కూడా స్ప్రే చేసేటందుకు సౌకర్యంగా వస్తున్నాయి. ఇక మీరు చేయాల్సిందల్లా స్ప్రే చేయటం, తుడవటం మాత్రమే.
ఈ చిట్కాలు మీ విండో గ్లాసుల శుభ్రతకు చక్కగా పనిచేస్తాయి.



Click it and Unblock the Notifications