For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తళ తళ లాడే ఇంటి కిటీకీ అద్దాలు ఎలా?

By B N Sharma
|

window
ఇంటి విండోల గ్లాసులను శుభ్రపరచటం ఏమంత తేలికైన పనికాదు. ఆధునిక ఇండ్లకు కిటికీలకు అద్దాలు తప్పని సరిగా వేయిస్తున్నారు. శుభ్రం చేయించాలంటే ఒక పనివాడిని పెట్టి రోజు జీతం ఇస్తే కాని పని జరగదు. వారాంతపు సెలవుల్లో మీరే ఈ పని చేసుకుని ఆ సొమ్మును మరో రకంగా ప్రయోజనకరంగా వాడుకోవచ్చు. కనుక మీరు విండో గ్లాసులను శుభ్రపరచేముందుగా సహాయకారిగా వుండే కొన్ని చిట్కాలు తెలుసుకోండి.

మొదటగా....గ్లాసు తుడవటానికి గుడ్డ కంటే కూడా పేపర్ మంచిదని తెలుసుకోండి. ఇంటిలో వున్న పాత వార్తా పత్రికలకు పని కల్పించండి. శుభ్రపరచేందుకు పేపర్ ఉపయోగించటం వలన దానిని పారవేయటం కూడా తేలిక. నీటితో శుభ్రపరచే ముందుగా, విండోలపై దుమ్ము దులపండి. లేదంటే నీటితో కలసి అది మరింత అసహ్యంగా అవుతుంది. విండో గ్లాసులను దుమ్ము దులపటానికిగాను శుభ్రమైన గుడ్డను ఉపయోగించండి. తుడవకండి, దులపండి. గుడ్డ ఒక చివరగా పట్టుకొని వరుసగా కొడుతూ వుంటే దుమ్ము పోతుంది.

విండో గ్లాసులు మురికి పేరుకొని వుంటే, కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిందే. గ్లాసులను డిటర్జెంట్ కలిపిన వేడినీటితో శుభ్రం చేయాలి. గుడ్డను నీటిలో ముంచి అదనపు నీటిని పిండి ఇక దానితో తుడవండి. నీరు తక్కువ వాడాలి. అధికమైతే, గ్లాసుకు మరకలవుతుంది. మురికి తుడిచేటపుడు గ్లాసుకు ఒత్తిడి కలిగించకండి. గ్లాసు పగిలే ప్రమాదముంది. గుడ్డతో తుడిచిన గ్లాసును చివరగా పాత పేపరుతో తుడిచి నీటి మరకలు పోగొట్టాలి. తడి పోయేటంతవరకు తుడవండి...ఇక మీ ఇంటి విండో గ్లాసు తళ తళా మెరుస్తుంది.

ఇటీవలి కాలంలో, నీటికి బదులుగా క్లీనింగ్ సొల్యూషన్లు క్లీనెక్స్, కోలిన్స్, ఈజీ ఆఫ్ బేంగ్ వంటివి వస్తున్నాయి. అవి కూడా స్ప్రే చేసేటందుకు సౌకర్యంగా వస్తున్నాయి. ఇక మీరు చేయాల్సిందల్లా స్ప్రే చేయటం, తుడవటం మాత్రమే.

ఈ చిట్కాలు మీ విండో గ్లాసుల శుభ్రతకు చక్కగా పనిచేస్తాయి.

English summary

Tips For Cleaning Glass Windows | కిటికీల అద్దాలను శుభ్రపరచే చిట్కాలు!

There are alternatives to water available these days for cleaning windows. There are cleaning solutions like Kleenex, Collin's or Easy Off Bang. They are available in dispensers so all you have to do is spray it on the target area and wipe it clean.
Story first published:Thursday, October 13, 2011, 15:05 [IST]
Desktop Bottom Promotion