Latest Updates
-
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.!
ముత్యాల సరాలను భద్రపరిచేదెలా?

ముత్యాలను శుభ్రపరచటంలో సెంట్లు మొదలైన ఎటువంటి సువాసన ద్రవ్యాలు వాడకండి. వాటిని ధరించే ముందుగానే మీ మేకప్, సెంట్ రాచుకోవటం వంటివి పూర్తి చేయండి.
ముత్యం ఉంగరం వుందా, స్నానం చేసేటపుడు తీసేయండి. ఘాటైన షాంపూలు, సోపులు లేదా నీరు అధికంగా దానిమీద పడటం వంటివి ముత్యానికి మంచిది కాదు. మీ చేతులకు బాడీ లోషన్ రాయటం పూర్తయిన తర్వాత ఉంగరం ధరిచండి.
ముత్యాలు డల్ గా వుండి మురికి పట్టాయా? మెత్తటి మజ్లిన్ గుడ్డ తీసుకొని వాటిని తుడవండి. గట్టిగా వుండే గుడ్డలు ముత్యపు పై భాగ కోటింగ్ ను పాడు చేస్తాయి.
తుడవటం సరిపోకపోతే, గుడ్డను తడి చేసి ముత్యాన్ని తుడవండి. అంతేకాని నీరు అధికంగా ముత్యంపై పోయకండి. ఎందుకంటే ముత్యాలు కట్టిన దారం కూడా తెగిపోయే ప్రమాదముంది.
నీటితో తుడిచిన తర్వాత కొంత పొడి అవ్వని్వండి. వెంటనే వాటిని ప్యాక్ చేసి వార్డ్ రోబ్ లో పెట్టేయకండి. పది నిమిషాలు ఫ్యాన్ కు ఆరపెట్టి అపుడు ప్యాక్ చేయండి.
శుభ్రం చేసిన తర్వాత వాటిని అన్నిటితో కలిపి ఒకే బాక్స్ లో పెట్టవద్దు. నిర్దేశిత బాక్స్ లో పెడితే ముత్యాలు నగలనుండి ఊడిపడకుండా వుంటాయి.
ముత్యాలను ఇతర జ్యూయలరీ తో కలిపి పెట్టద్దు. ముత్యాలపై వున్న షైనింగ్ కోటింగ్ దెబ్బతింటుంది.
ముత్యాలు కట్టిన దారం అపుడపుడూ తెగిపోతూంటుంది. అందుకని అది కొంచెం బలహీనమయిందనుకుంటే వెంటనే కొత్త నైలాన్ లేదా ఇతర తీగలతో చేర్చి మరోమారు తాజాగా దానిని తయారు చేసుకొని అలంకరించుకోండి.



Click it and Unblock the Notifications