Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
ఇంటి సౌందర్యం అసలు రంగులోనే ఉంది...!

ఇంట్లోని హాల్ అందం పెరగడానికి దివాన్ సెట్లని అందంగా తీర్చిదిద్దుతుంటారు నేటి మేటి మహిళామణులు. ఇంటికి వచ్చిన అతిథులు కూర్చోవడానికైనా, కాస్త నడుం వాల్చడానికైనా ఇవి సౌకర్యంగా ఉంటాయి. ప్లెయిన్, వర్క్, డిజైన్స్, ప్రింటింగ్ కలిగి ఉన్న బెడ్‌షీట్స్ వీటిమీదకి బాగానే ఉన్నా ఇప్పుడవి అవుట్ డేటెడ్ ఫ్యాషన్స్ అయిపోయాయి.
మీ ఇంటికి వచ్చిన వారికి మీ ఇల్లు మరింత అందంగా కనపడాలంటే మీరు వాడే బెడ్ సెట్ స్టైల్ ని కాస్త మార్చి చూడండి. మరి ఆసెట్ మీదకి ఎలాంటి రంగులు ఫ్యాషనబుల్ గా కనిపిస్తాయో చూద్దాం.
పర్పల్: ప్రస్తుతం ఈ కలర్‌కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఈ రంగులో ఇప్పుడు ఎరుపు రంగు మిక్స్ అయి బెడ్ షీట్లు వస్తున్నాయి. పర్పుల్ లో లావెండర్ , పర్పుల్ లైన్స్ రింగ్స్ ఇమిడి ఉన్న బెడ్ షీట్లు దివాన్ కు ఇప్పుడు ఎంతో అందాన్నిస్తున్నాయి. ఇవి ఇప్పుడు గ్రే, బ్లాక్, వైట్ రౌండ్స్ లో మార్కెట్లో లభిస్తున్నాయి.
గ్రీన్: గ్రీన్ కలర్ చాలామందికి నచ్చుతుంది. ప్రస్తుతం గ్రీన్ కలర్ టాప్ లో చేరింది. ఇది ఎకో ఫ్రెండ్లి కలర్ కాబట్టి ఏకాలంలోనైనా ఇట్టే సెట్ అవుతుంది. ఇంటికి ఇది ఓ హుందాతనాన్ని తీసుకొస్తుంది. ఇలాంటి బెడ్‌షీట్లని పరిస్తే మీ ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వాటిని చూసి మీ అలంకరణకు ముగ్దులౌతారనడంలో సందేహం లేదు.
అక్కడ వారు ఉన్నంతసేపు ప్రకృతితో గడిపిన ఆనందానికి లోనవుతారు. ఈ రంగుల్లో బోల్డ్ ఫ్లోరల్, లీఫ్ డిజైన్స్, బ్రైట్ కలర్స్ బాగుంటాయి. వీటిమీద సన్ లైట్, గ్రీన్ ఫీల్డ్, సముద్రం, బీచుల్లాంటి ఆర్ట్ ఉంటే ఇంకా అందంగా ఉంటుందంటున్నారు ఇంటీరియర్ డెకార్స్ వారు.



Click it and Unblock the Notifications