Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇంటి అలంకరణకు ఖరీదైనవే అవసంర లేదు...!

ఫ్లవర్ అరేంజ్‌మెంట్: డైనింగ్ టేబుల్, సెంటర్ టేబుల్ మీద పెట్టే పాట్‌లలో ఫ్లవర్ అరేంజ్‌మెంట్ లోలెవల్‌లో ఉండాలి. టీవీ, కార్నర్ టేబుల్ మీద, కార్నర్ స్టాండ్ కోసం హైలెవెల్ ఫ్లవర్ అరేంజ్‌మెంట్ చేయాలి. బెడ్‌రూముల్లో ఫ్లవర్ వాజ్‌లు పెట్టవచ్చు కానీ పాట్‌లో నీటిని పోస్తే దోమలు వస్తాయి. కాబట్టి నీరు లేకుండా పూలను అమర్చుకోవచ్చు. బెడ్‌రూముల్లో పూలు సువాసన భరితంగా ఉంటే ఆహ్లాదంగా ఉంటుంది. ఫ్లవర్ అరేంజ్‌మెంట్‌కోసం ప్రత్యేకంగా పూలను కొని అలంకరిస్తేనే ఇంటికి అందం వస్తుందనుకుంటే మాత్రం పొరపాటే. మన ఇంట్లో పూసిన ఏ పువ్వునైనా ఒక ఆకుతో కలిపి అలంకరిస్తే చాలు. అది గది అందాన్ని పెంచి తీరుతుంది. నేను అలాగే చేస్తాను. బంతి, మందార వంటి పూలతోనే డెకరేట్ చేసుకోచ్చు.
ఫ్లవర్ అరేంజ్ మెంట్ లో ముఖ్యంగా లోతు తక్కువగా ఉన్న పాత్ర(బౌల్) ఎంపిక చేసుకోవాలి. అందులో చల్లటి నీళ్లతో నింపి..తర్వాత అందులో మీకు నచ్చిన పువ్వులతో అలంకరణ చేసుకోవాలి. గులాబీలు, బంతులు, చేమంతులు, మందారం.. ఇలా చలా పువ్వులు ఉంటాయి. సువాసనలు కలిగినవి అయితే మరీ మంచిది. లేదా ఒకటి రెండు చుక్కలు ఏదైనా సెంట్ ఆ నీళ్ళలో వేస్తే సువాసనల గుభాళింపు గదంతా వెల్లువిరుస్తుంది. ఇలా చేయడం వల్ల కనీసం మూడు, నాలుగ గంటలైనా వాడకుండా ఉంటాయి.
ముఖ్యంగా బాగా వికసించిన ముదురు రంగు పువ్వులు మధ్యలో ఉంచి, అరవిరిసిన పువ్వులు చుట్టూరా పెట్టాలి. ఇలా చేస్తే అవి కూడా విచ్చుకుంటాయి. ఎరుపు, నేరేడు రంగు, ముదురు రంగు పువ్వులు ఒకే చోట కాకుండా మ్యాచింగ్ వుండేలా చూడాలి.
ఇలా ఫ్లవర్ అరేంజ్ మెంట్ చేసిన ఫ్లవర్ బౌల్ ను ఈశాన్యం మూలలో కానీ లేదా ఇంటి ముంగిట్లో కానీ, హాలు మధ్యలో కాని పెట్టుకోవచ్చును. తోటలోనూ పెట్టుకోవచ్చు. ఎత్తుగా టేబుల్ అరేంజ్ చేసుకొని దాని మీద పెట్టుకోచ్చు. పాత్రలు, పెద్దవి, చిన్నవి, అనేకమైన ఆకారాలలో దొరుకుతాయి. టెర్రకోట, ఇత్తడి, రాగి, రాతి, ప్లాస్టిక్ పాత్రలను వాడుకోవచ్చు. దాంతో అందం. ఆకర్షణ, ఆహ్లాదం చేకూరుతాయి.



Click it and Unblock the Notifications