Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
కలర్ ఫుల్ బుట్టలతో కలర్ ఫుల్ ఇల్లు...

ఇక వంటింటి విషయానికి వస్తే... పాల ప్యాకెట్ కత్తిరించేందుకు కత్తెర ఓ పట్టాన కనిపించదు. ఇలాగే చాలా వాటిలో జరుగుతుంటుంది. అందుకే కూరగాయలు కోసే కత్తులు, కత్తెర్లు, ఒకచోటు ఉంచుకోవాలి. వెడల్పు మూతి ఉండే డబ్బా తీసుకుంటే, ఇలాంటివాటినన్నింటినీ అందులో వేయవచ్చు. అలాగే చెంచాలన్నింటినీ గిన్నెల స్టాండుకు తగిలించకుండా డబ్బాలో వేసి ఓ చోట పెట్టుకోవాలి. అగ్గిపెట్టెలు, క్యాండిల్స్ కూడా ఒక్క చోట భద్ర పరచుకుంటే కరెంట్ పోయినప్పుడు వెతకాల్సిన అవసరం ఉండదు.
దుస్తులకు మ్యాచ్ అయ్యే యాక్సెసరీలు ఒక్కోసారి ఎంత వెతికినా కనిపించవు కాబట్టి.. క్లిప్పులు, రబ్బరు బ్యాండ్లు, పిన్నులు లాంటివన్నీ అరలుండే ఒకే డబ్బాలో పెట్టుకుంటే హడావుడి సమయంలో సులువుగా కనిపిస్తాయి. అలాగే వార్డ్ రోబ్ పై భాగంలో రోజూ ధరించే దుస్తులు, అడుగు అరల్లో మిగిలినవీ సర్దుకోవాలి. సాక్సులు, లోదుస్తుల్లాంటివి పారదర్శకంగా ఉండే డబ్బాల్లో పెడితే వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు.
మీ ఇంట్లోని డ్రాయింగ్ రూంలో కళాకాంతులు తెచ్చే ఇత్తడి ఫర్నిచర్, ఉడ్ ఫర్నిచర్‌ను అమర్చండి. సోఫాలు, మంచి కళాత్మకమైన పెయింటింగ్స్, చక్కటి క్రోటన్ మొక్కలు, ప్లవర్ వాజ్‌లు ఏవిధంగా ఉంటే మీకు నచ్చుతుందో అలా చేయండి. మీ హాలులో ఏవిధమైన సిటింగ్ ఏర్పాట్లు ఉంటే బావుంటుందో చూపండి. ఏ మ్యూజిక్ సిస్టం, టివి, వాల్ హ్యాంగింగ్స్, లైటింగ్ సిస్టం, సోఫాల దగ్గర నేలమీద సుతిమెత్తని తివాచీలు అందంగా అలంకరించండి. సాధారణంగా నెలకు ఓ సారి మార్చి చూడండి. మార్పు మీకే తెలుస్తుంది.
ఇంట్లో చిన్నపిల్లలుంటే ఎక్కడచూసినా వారు ఆట్లాడుకొనే బొమ్మలే కనిపిస్తాయి. వాటికి తోడు పాలబుడ్డీలు, చిన్న చిన్న బట్టలు..ఇలా ఒకటేంటి ఇల్లంతా చిందరవందరే. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎక్కడ చదివిన దినపత్రికలు అక్కడే, ఇతర మ్యాగజైన్లు కుర్చీల్లో ఎక్కడపడితే అక్కడ పడి ఉంటాయి. వీటన్నింటినీ రోజూ సర్దాలంటే ఇబ్బందే. కాబట్టి.. వెదురుబుట్టలు తీసుకుని ఒక దాంట్లో పత్రికలు, మరో దాంట్లో మ్యాగజైన్లు, ఇంకో దాంట్లో బొమ్మలు.. ఇలా సర్దేసుకుంటే ఇల్లు చూడటానికి అందంగా కనిపించడమే కాకుండా, పని సులభం అవుతుంది. వీటన్నింటినీ ఓచోట అందంగా పెడితే అవసరమైనప్పుడు సులువుగా దొరుకుతాయి. ఇంకాస్త ఆకర్షణీయంగా ఉండాలంటే ఈ వెదురుబుట్టలకు రంగులు కూడా వేయవచ్చు.



Click it and Unblock the Notifications