Latest Updates
-
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా!
బేసిక్ ఐడియాస్స్ తో మీ ఇంటిని డ్రీమ్ హౌస్ చేసుకోండి...
Improvement
oi-Saraswathi
By Sindhu

2. ఇంట్లో హాలు, డైనింగ్ రూం, బెడ్ రూం, వంటగది ఇలా ప్రతి గదీ కొత్తగా కనిపించాలంటే డిజైన్ లో, ప్యాట్రన్ లో, రంగులో విభిన్న తరహాలలో ఉన్న వాల్ పేపర్స్ ని ఎంచుకోవాలి. సీజన్ కు తగ్గ వాల్ పేపర్స్ కంటికి మనస్సుకు ఆహ్లాదాన్ని ఇస్తాయి.
3. వంటగది, బాత్రూమ్స్ నీరు చెమ్మ ఎక్కువగా తగిలే చోట్లు కాబట్టి ఈ గదులలో వాల్ పేపర్స్ ని వాడకపోవడమే మంచిది.
4. ఇల్లు తుడిచే నీటిలో కాస్తంత ఉప్పు కలిపితే దోమలు, ఈగలు రాకుండా ఉంటాయి.
5. ఇల్లు తుడిచే స్పాంజిలను నీటిలో విదిలించి, ప్లాస్టిక్ బ్యాగులో చుట్టి పెడితే ఎండిపోయి, త్వరగా పాడవకుండా ఉంటాయి.
6. కర్ర సామాను మీద, నేలపై మంచు కురిసినట్లు చెమ్మపడుతూ ఉంటుంది. నీటిలో కొద్దిగా కడిగే సోడా కలిపి కడగి, తర్వాత మంచినీటితో మరోసారి కడిగితే మంచిది.
7. గది గోడలను ఖాళీగా వదిలేయకుండా అక్కడక్కడ వాల్ హ్యాంగింగ్స్, పెయింటింగ్‌లు అమరిస్తే ఆ అందమే వేరు.
8. గది మరీ చిన్నదిగా కనిపిస్తుంటే, కిటికీలకు లేతరంగు పరదాలు వేలాడదీయాలి. కనీసం రెండు పూలకుండీలు, మనీప్లాంట్ కిటికీలకు దగ్గరగా ఏర్పాటుచేయగలిగితే.. చూడముచ్చటగా ఉంటుంది. ఆహ్లాదంగానూ కనిపిస్తుంది.
9. ఇంట్లో కుర్చీల వంటి ఫర్నిచర్‌కు రంగు వేసేటపుడు నాలుగు కోళ్ళకింద సీసామూతలు ఉంచితే రంగు కారినా గచ్చుకు అంటుకోవు. ఫర్నీచర్ కొత్త వాటిలా మెరవాలంటే నీటిలో ఒక స్పూను టీ పౌడర్ కలిపి అందులో ముంచిన క్లాతుతో తుడవాలి. ఒక టేబుల్ స్పూను వెనిగర్ లో ఆలివ్ ఆయిల్ కలిపి తుడిస్తే ఫర్నీచర్ కొత్త వాటిలా మెరుస్తాయి.
10. ఇల్లు రెండు వారాల పాటు తాళం పెట్టి ఉంటే తలుపులు తెరవగానే ఒకలాంటి వాసన వస్తుంది. అలా రాకుండా ఎండాలంటే తలుపులు తెరచి ఒక పెద్ద ప్లేటులో కర్పూరం వెలిగించి అన్ని గదుల్లో కాసేపు ఉంచాలి. ఈగలను పారద్రోలడంలో మిరియాలు మంచి కీటకనాశినిగా పనిచేస్తుంది.
Comments
English summary
Basic home improvement tips for women.... | చిన్నపాటి బేసిక్ ఐడియాస్ తో మీ డ్రీమ్ హౌస్
Story first published: Thursday, March 29, 2012, 14:33 [IST]
Other articles published on Mar 29, 2012



Click it and Unblock the Notifications