Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
స్నానాల గదిని కళాత్మకంగా తీర్చిదిద్దడం ఎలా....!

సాధారణంగా ఇల్లంతా అద్దంలా శుభ్రంగా వుంచుకునేవాళ్ళు కూడా స్నానాల గది దగ్గరికి వచ్చేసరికి అలిసిపోతారు. స్నానాల గది సంగతి తర్వాత చూద్దాం అనుకుంటారు. తత్ఫలితంగా స్నానాల గది చిన్న చెత్తబుట్టలా తయారవుతుంది. మీయింటికి వచ్చిన అతిథులు కళాత్మకంగా అలంకరించిన మీ డ్రాయింగ్ రూమ్ ని చూసి మురిసిపోయి స్నానాల గది చూసి ముఖం చిట్లించుకుంటే ఎలా ? అలాంటి పరిస్థితి మీకు ఎదురు కాకుండా వుండాలంటే తగిన జాగ్రత్తలు అవసరం.
1. బాత్ రూమ్ చిన్నదైనా పెద్దదైనా టైల్స్‌వున్నా లేకపోయినా అందులో అవసరమైనవి మాత్రమే వుంచండి.
2. ఖాళీ షాంపూ బాటిల్స్, పౌడర్ డబ్బాలు, విరిగిపోయిన బకెట్లు మీ స్నానాల గదిలో వుంచకండి.
3. స్నానాల గదిలో హెన్నా, సబ్బు మరకలు పడితే యాసిడ్ పోసి శుభ్రంగా కడగండి.
4. అరిగిపోయిన సబ్బు బిళ్ళల ముక్కల్ని స్నానాల గదిలో చెల్లా చెదురుగా పడేయకుండా ఓ మగ్గులో నీళ్ళు తీసుకొని దాంట్లో వేస్తే లిక్విడ్ సోప్ తయారవుతుంది. ఈ నీళ్ళతో చేతులు కడుక్కోవచ్చు.
5. శానిటరీ నాప్ కిన్స్ లాంటివి ఎప్పుడూ ప్లెష్ లో పడేయకండి. దానివల డ్రైనేజీ సిస్టం దెబ్బతిని నీటి సరఫరా ఆగిపోతుంది.
6. ప్రతిరోజూ ఏదైనా డిటర్జంట్ తో బాత్ రూమ్ శుభ్రం చేసుకోండి.



Click it and Unblock the Notifications
