Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఎంత ఇరుకైనా సౌకర్యం అధికమే...!

ఇంట్లో మెట్ల కింద ఏదన్నా పెట్టడం తేలికే. వాటిని తీసుకొనేటప్పుడు ఇబ్బంది ఎందుకంటే మాటిమాటకి అవి తలకు తగులుతూ ఉంటాయి. అందుకే ఆ ప్రాంతం ఎక్కువ మంది వాడకుండా ఉంచేస్తారు. అందుకే చెక్కతో మెట్ల పొడవునా... అరలు ఏర్పాటు చేయాలి. అప్పుడు మెట్లు తగలకుండా వస్తువులు తీసుకోవచ్చు. పుస్తకాలు కూడా పెట్టుకొంటే లైబ్రరీలా పనికొస్తుంది.
మొట్లు ఎత్తుగా ఉంటే రెండు భాగాలుగా... పైన, కింద విభజించి సొరుగులుగా అమర్చితే పిల్లల పుస్తకాలు. ఆట వస్తువులు సర్ధవచ్చు. అవసరానికి వెతుక్కోకుండా ఆ సొరుగులను వాళ్ళకి అప్పగించేస్తే సరిపోతుంది. అంతే కాదు సెలవునాడు పిల్లలతోనే వాటిని శుభ్రం చేయిస్తే పనిలో వారినీ భాగస్వాముల్ని చేసినట్టు అవుతుంది.
మీరు ప్రకృతి ప్రేమికులైతే వృథాగా ఉన్న స్థలంలో పచ్చిన ప్రకృతిని ఆవిష్కరించే దిశగా అడుగులు వేయబచ్చు. బల్ల వేసి దానిపైన రంగుల్లో మెరిసిపోయే ఫ్యాబ్రిక్ వస్త్రాన్ని పరిచి బోన్సాయ్ మొక్కలు, వాటర్, మనీ ప్లాంట్స్ వంటివి ఏర్పాటు చేయవచ్చు వాటిలో రంగు రాళ్లు. పూలరేకులు వేసి అలంకరిస్తే ఇల్లంతా హరిత వర్ణంలో ఆనందభరితంగా కనిపిస్తుంది.
మెట్ల కింద చెక్కలతో డబ్బాలా వేయించి...తలుపులు ఏర్పాటు చేయాలి. అందులో అదనంగా ఉన్న దుప్పట్లు, వాడుకోనివి, వాడుకోనివి, ఉతకాల్సిన దుస్తులు.. డిటర్జెంట్లు, సబ్బులు ఉంచితే సరిపోతుంది. అడ్డు రాకుండా ఉంటాయి. ఇంట్లో వాటికోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించాల్సిన పనుండదు. బయటకు కనిపించకుండానూ ఉంటాయి.
ఒక వేళ బయట వైపు మెట్లు ఉంటే కింద మట్టిలో మొక్కలు నాటితే వాటికి ఎండతగిలి పచ్చదనం వెల్లివిరిస్తుంది. అలానే ట్యాంక్ లా కడితే నీళ్లు నిల్వ చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి ట్యాంకు నింపుకొంటే అవసరానికి వాడుకోవచ్చు. సిమెంట్ తో అరలు కట్టుకొంటే వాహనాలకు సంబంధించిన పరికరాలు, సామాగ్రి, హార్డ్ వేర్ వస్తువులు పెట్టుకొంటే వానకు తడవకుండా ఉంటాయి. అవసరమైనప్పుడు వెతుక్కోవడం తేలికవుతుంది.



Click it and Unblock the Notifications