Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
ఉప్పు-వెనిగర్ ఉంటే చాలు జీన్స్ ఎప్పుడూ కొత్తవాటిలా మెరుస్తుంటాయి...
కనిపిస్తున్నవన్నీ జీన్స్ ప్యాంట్స్. ఇందుకు వయో బేధాలు, మగ, ఆడ అనే తారతమ్యాలు కూడా లేనే లేవు. శరీరానికి అతుక్కు పోయేలా ఉండేలా రూపొందిన జీన్ ఫ్యాంట్లు అటు ఫ్యాషన్‌ని..ఇటు స్టైలిష్‌ని చూపిస్తుండటంతో.... ఇప్పుడు ఆరేళ్ల చిన్నారుల నుండి అరవై ఏళ్ల వయో వృద్దుల వరకు జీన్ ఫ్యాంట్లు ధరించడానికి తెగ ఇష్టపడుతున్నారంటే అతిశయోక్తి కాదేమో?అబ్బాయిలే కాదు.. అమ్మాయిల సంగతీ అంతే.. ఇంకో మాటలో చెప్పాలంటే జీన్స్ ధరించే వారిలో అమ్మాయిలే ఎక్కువే. అబ్బాయిలకు ప్యాంట్స్ విషయంలో ప్రత్యామ్నాయాలున్నా, అమ్మాయిలు మాత్రం జీన్స్, కాటన్స్ మాత్రమే ధరిస్తున్నారు. జీన్స్ స్టైలే వేరని అంటున్నారు.జీన్స్‌లో ఫ్యాషన్, స్టైల్స్‌తోపాటు కంఫర్ట్ కూడా ఉండడంతో వాళ్ళంతా దానికే ఓటేస్తున్నారు. అయితే ఇంత ఫ్యాషన్ లుక్ ఇచ్చే జీన్స్ ఎంత శుభ్రంగా పెట్టుకొంటే అంతకు రెటింపు లుక్ ను అందిస్తుంది.
ఇంత బరువైన ఫేంట్‌ని ఉతకడమంటే మాటలు కాదు... అవగాహనలేకుండా ఇష్టానుసారం ఉతికి పారేస్తే పాడై పూర్తిగా చిరిగిపోయి.. కనీసం తొడుక్కో డానికి కూడా పనికిరాకుండా పోతుంది. కాబట్టి జీన్స్ ను ఉతకడంలో కొన్ని మెలుకువలను తెలుసుకోవాలి. అందుకు చాల టెక్నిక్సే వున్నాయి. వాటిని కనుక పాటించినట్లైతే తప్పకుండా ఉపయోగం వుంది, కలర్ పోవడం, లేదా ముడతలు పడటం వంటివి జరగవు. మరకలను సులభంగా వదిలగొట్టి కొత్తవాటిలా మెరుపు నందిస్తాయి. మరి ఆ టెక్నిక్స్ ఏంటో చూద్దాం..

1. జీన్స్ కలర్ పోకుండా ఫ్యాబ్రిక్స్ ను కొత్తవాటిలా కాపాడగలిగే శక్తి ఒక ఉప్పుకే ఉంది. ఒక బకెట్ నీటిలో ఒక చెంచా ఉప్పు వేసి కరిగిన తర్వాత ఆ నీటిలో జీన్స్ ప్యాంట్స్ నానబెట్టాలి. ఒక గంట పాటు నాని తర్వాత వాషింగ్ మిషన్లో వేసి శుభ్రం చేయవచ్చు. లేదా చేత్తో కూడా శుభ్రం చేయవచ్చు. జీన్స్ శుభ్ర పరచడానికి లాండ్రీ డిటర్జెంట్ లేదా సాధారణ డిటర్జెంట్ ను ఉపయోగిస్తే సరిపోతుంది. కొత్త జీన్స్ ను ఉప్పుతో ఉతకడం వల్ల కలర్ పోకుండా కాపాడుతుంది. జీన్స్ మీద పడ్డ దుమ్ము, ఫుడ్ మరకలను పోగుడుతుంది.
2. వాషింగ్ మిషన్లలో ఉతికే కన్నా లిక్విడ్ వాష్ తోఉతికితే జీన్స్ ఎక్కువకాలం మన్నికగా ఉంటుంది.
3.ఇష్టపడి కొనుగోలు చేసిన రంగులు బాగా వెలిసిపో తుంటే మనసు చివుక్కుమనటం ఖాయం. అందుకే కాసింత వెనిగర్‌ని బకేట్ నీళ్లలో కలిపి అందులో జీన్స్‌ని కాసేపు నానబెట్టి తరువాత సర్ఫ్ లేదా సబ్బుతో ఉతకండి ఆపై కాసింత గంజి పెట్టి ఇస్త్రీ చేయిస్తే తాజాగా ఉంటాయి.
4. లైట్ కలర్ జీన్స్‌ని ఉతికే ముందు చల్ల నీళ్లలో నానబెట్టి, లైట్ డిటర్జంట్ పౌడర్ మాత్రమే వాడి ఉతకాలి. వేడినీళ్లలో నాన బెడితే వాటికున్న స్టిచెస్ దెబ్బతినే అవకాశం ఉంది. జీన్స్ నిత్యం చల్లని వాతావరణంలో ఉంచితే ఎక్కువ కాలం మన్నుతుందని గమనించండి.
5. కనీసం 4 సార్లు వేసుకున్న తరువాతే జీన్స్ ఉతకడమే కాక...అవిమడత పెట్టి కవర్‌తో సహా కాసేపు ఫ్రీజర్‌లో ఉంచితే అందులో నిలవున్న బాక్టీరియాలు పోతాయి.
6. జీన్స్‌పై మరకలు పడితే వెనిగర్, బేకింగ్ షోడా నీటిలో కలిపి ఓ 15 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాక ఉతకండి. ఆ మరకలు పోతాయి.



Click it and Unblock the Notifications
