Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇంటి అందంతో పాటు గుణగణాలను తెలిపి రంగులు..!

ఇంట్లోని హాల్ అందాన్ని రెట్టింపు చేయడానికి దివాన్ సెట్లని అందంగా తీర్చిదిద్దుతుంటారు నేటి మేటి మహిళామణులు. ఇంటికి వచ్చిన అతిథులు కూర్చోవడానికైనా, కాస్త నడుం వాల్చడానికైనా ఇవి సౌకర్యంగా ఉంటాయి. ప్లెయిన్, వర్క్, డిజైన్స్, ప్రింటింగ్ కలిగి ఉన్న బెడ్ షీట్స్ వీటిమీదకి బాగానే ఉన్నా ఇప్పుడవి అవుట్‌డేటెడ్ ఫ్యాషన్స్ అయిపోయాయి. మీ ఇంటికి వచ్చిన వారికి మీ ఇల్లు మరింత అందంగా కనపడాలంటే మీరు వాడే బెడ్‌సెట్ స్టైల్‌ని కాస్త మార్చి చూడండి. మరి ఆసెట్ మీదకి ఎలాంటి రంగులు ఫ్యాషనబుల్‌గా కనిపిస్తాయో చూద్దాం.
పర్పల్: ప్రస్తుతం ఈ కలర్‌కి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఈ రంగులో ఇప్పుడు ఎరుపు రంగు మిక్స్ అయి బెడ్ షీట్లు వస్తున్నాయి. పర్పుల్‌లో లావెండర్ , పర్పుల్ లైన్స్ రింగ్స్ ఇమిడి ఉన్న బెడ్‌షీట్లు దివాన్‌కు ఇప్పుడు ఎంతో అందాన్నిస్తున్నాయి. ఇవి ఇప్పుడు గ్రే, బ్లాక్, వైట్ రౌండ్స్‌లో మార్కెట్లో లభిస్తున్నాయి.
గ్రీన్: గ్రీన్ కలర్ చాలామందికి నచ్చుతుంది. ప్రస్తుతం గ్రీన్ కలర్ టాప్‌లో చేరింది. ఇది ఎకో ఫ్రెండ్లి కలర్ కాబట్టి ఏకాలంలోనైనా ఇట్టే సెట్ అవుతుంది. ఇంటికి ఇది ఓ హుందాతనాన్ని తీసుకొస్తుంది. ఇలాంటి బెడ్‌షీట్లని పరిస్తే మీ ఇంటికి అతిథులు వచ్చినప్పుడు వాటిని చూసి మీ అలంకరణకు ముగ్దులౌతారనడంలో సందేహం లేదు.
అక్కడ వారు ఉన్నంతసేపు ప్రకృతితో గడిపిన ఆనందానికి లోనవుతారు. ఈ రంగుల్లో బోల్డ్ ఫ్లోరల్, లీఫ్ డిజైన్స్, బ్రైట్ కలర్స్ బాగుంటాయి. వీటిమీద సన్‌లైట్, గ్రీన్ ఫీల్డ్, సముద్రం, బీచుల్లాంటి ఆర్ట్ ఉంటే ఇంకా అందంగా ఉంటుందంటున్నారు ఇంటీరియర్ డెకార్స్ వారు.
గులాబి, ఆకపచ్చ జీవశక్తిని సూచిస్తాయి. ఎరుపు న్యాయానికి చిహ్నం. తెలుపు స్వచ్ఛతను, నలుపు భయం, గొప్పదనం, గాంభీర్యాన్ని సంకేతిస్తాయి. వ్యక్తులలో అంతర్గత సామరస్యానికి, వెలుపల వ్యక్తుల మధ్య సామరస్యాన్ని నిర్వహించడానికి ఏ రంగూ అన్నికాలాల్లో ఉపయోగపడవు. అణువు నుంచి అంతరిక్షం వరకు అన్ని మార్పులు మనలోకి ప్రసరిస్తాయి. మనల్ని రంగులతో ముడివేసే శక్తి వైశ్విక ప్రాణవాయువు....



Click it and Unblock the Notifications