Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బాత్ రూమ్ క్లీనింగ్ తో వ్యక్తిగత పరి శుభ్రత..!

బాత్ రూమ్ శుభ్ర పరచడానికి ముందు ఏ వస్తువులు అవసరం అవి ముందుగా ఏర్పటు చేసుకొని ఒక ప్లేస్ లో అమర్చుకోవాలి. మాప్, చీపురు, బకెట్, మగ్ ఇటివంటి తప్పని సరిగా ఉండేలా చూసుకోవాలి. మీకు ఇంకా టాయిలెట్ బ్రెష్ కూడా అవసరమౌతుంది. దాన్ని కూడా దగ్గరలో ఉంచుకోండి. అలాగే క్లీనింగ్ చేసే సమయంలో చేతులుకు గ్లౌజులను వేసుకోవడం మరిచిపోకూడదు. మీరు సాధారణంగా శుభ్రం చేయాలానుకొన్నా సరే గ్లౌజులు తప్పనిసరి ఎందుకుంటే బాత్ రూమ్ క్లీనింగ్ కు ఉపయోగించే కెమికెల్స్ చేతులమీద పడి చర్మఇన్ఫెక్షన్, మరే ఇతర సమస్యలు రాకుండా కాపాడుకోవాలి.
సోప్ వాటర్/ టాయిలెట్ క్లీనర్: సోప్ వాటర్ లో కొద్దిగా డిటర్జెంట్ పౌడర్ మిక్స్ చేసి బాత్ రూమ్ లో అన్ని ప్రదేశాల్లో మూలల్లో చల్లాలి. టాయిలెట్ క్లీనర్ ను ఉపయోగించి కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చు. టాయిలెట్ క్లీనర్ ను స్ప్రెడ్ చేసి ఒక నిమిషం పాటు అలాగే ఉంచేయాలి.
స్ర్కబ్: సోప్ వాటర్, టాయిలెట్ క్లీనర్ ను చల్లి ఒక నిమిషం తర్వాత, టైల్స్, బాత్ రూమ్ గోడలు చీపురుతో బాగా రుద్దాలి. లేదా టాయిలెట్ బ్రెష్ ఉపయోగించి కూడా రుద్దుకోవచ్చు. తర్వాత నీళ్ళు పోసి శుభ్రపరుచుకోవాలి.
వాష్ బేసిన్: బాత్ రూమ్ లో వాష్ బేసిన్ ఉన్నట్లైతే దాన్ని కూడా శుభ్రం చేయడం మరచిపోకూడదు. వాష్ బేషన్లో టాయిలెట్ క్లీనర్ ను వేసి శుభ్రం చేయాలి. ఎందుకంటే టాయిల్ క్లీనర్ టైల్స్ ను శుభ్రపచడమే కాకుండా క్రిములను హరిస్తుంది. వాష్ బేషన్ శుభ్రం చేసేటప్పుడు గ్లౌజులను ధరించి చేతుల చర్మ సౌందర్యాన్ని కాపాడుకోండి.
వాటర్ ను ఫ్లష్ చేయాలి: బాత్ రూమ్ ను సోప్ క్లీనింగ్, స్ర్కబింగ్, వాటరింగ్ తర్వాత బాత్ షవర్ తో లేదా పైప్ తో బాత్ రూమ్ లో వాటర్ ఫోర్స్ గా తిప్పి నీటితో శుభ్రపరచాలి. లేదా మగ్గుతో నీటిని ఫోర్స్ గా పోసి సోప్ వాటర్, పోయే విధంగా చూసుకోవాలి.
ఫినాయిల్: వాటర్ తో శుభ్ర పరిచిన తర్వాత, చివరగా ఫినాయిల్ చల్లి శుభ్రం చేసుకోవాలి. ఒక మగ్గునీటిలో కొన్ని ఫినాయిల్ కొద్దిగా వేసి బాత్ రూమ్ లో చల్లి శుభ్రం చేస్తే సూక్ష్మక్రిములను నాశనం చేసి, ఫినాయిల్ స్మెల్ బాత్ రూమ్ లో రిఫ్రెష్ చేస్తుంది.
మాప్: బాత్ రూమ్ ఇలా శుభ్రపరిచిన తర్వాత మాప్ తీసుకొని తడినంత తుడిచేయాలి. బాత్ రూమ్ ను ఎప్పుడూ పొడిగా ఉంచాలి. ఇలా వుంచడం ద్వారా నీటి వాసన బాత్ వాసన లేకుండా చేస్తుంది.



Click it and Unblock the Notifications