Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఇంటిని శుభ్రపరిచేటప్పుడు ముఖ్యంగా పాటించాల్సిన జాగ్రత్తలు
సాధారణంగా ఇంటిని శుభ్రపరచడమనేది ఓ కళ. ప్రతి ఇంట్లో ప్రతి ఇల్లాలు ఇంటిని చక్కబెట్టడంలో ఎంతో నేర్పు.. ఓర్పు కలిగి ఉంటుంది. ప్రతి రోజూ ఇంటిని శుభ్రపరచడమనేది తప్పనిసరి. ఇంట్లో ఉన్న సభ్యులను సంఖ్యను బట్టి ఇంటి పరిమాణంను బట్టి మీ ఇంటిని మీరే శుభ్ర పరుచుకోవచ్చు. అలా కాకుండా ఇతరుకు డబ్బు ఇచ్చి ఇంటిని శుభ్ర పరిచి, చక్కబెట్టించుకోవచ్చు. మీ అంతట మీరే ఇంటిని శుభ్రపరచుదలుచుకొన్నప్పుడు, చాలా జాగ్రత్తగా ఉండాలి. క్లీనింగ్ చేసేటప్పుడు ఏ చిన్న పొరపాటు జరిగిన మీకు ప్రమాదం జరగవచ్చు. ఇంటిని శుభ్ర పరచుకోవాలనుకొన్నప్పుడు ఏఏ వస్తువులను శుభ్రపరుచుకోవాలనుకొంటున్నారో మొదటి సెలక్ట్ చేసుకోవాలి. అందుకు కరెక్ట్ క్లీనింగ్ కు ఉపయోగపడే పరికరాలను ఉపయోగించుకోవాలి. అప్పుడు ఇంటిని క్లీన్ చేయడం చాలా సులభమవుతుంది. ఇంటిని శుభ్రపరుచుకొనుటలో కొన మొదలు లేకుండా ఎలా పడితే అలా చేస్తుంటారు అలా చేయకుండా ఓ పద్దతి ప్రకారం ఇంటిని శుభ్రపరచుకోవడానికి కొన్నిజాగ్రత్తలతో కూడిన చిట్కాలు మీ కోసం....
శుభ్రపరుస్తామనే నమ్మకం కలిగి ఉండాలి: ఏ పని మొదలు పెట్టినా ఈ పనిని నేను చేయగలను అనే నమ్మకం కలిగి ఉండాలి. ఇంట్లో కొన్ని ఎత్తు ప్రదేశాలు, కొన్ని మూలలను మీరు శుభ్రపరచుకోలేకపోవచ్చు. అటువంటప్పుడు ఇతరుల సహాయం తప్పని సరి అని గ్రహించాలి. అటువంటి ప్రదేశాలను మీరే శుభ్రపరుచుకోవాలనుకొంటే వాటికోసం ఉపయోగించే నిచ్చెనలు, స్టూల్స్ సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. అవి మీ శరీరం యొక్క బరువును మోయగలవో లేదో సరిచూసుకోవాలి. ఎందుకంటే ఎత్తులో ఉన్న ఫ్యాన్స్, లైట్స్ ను శుభ్రపరచడం కష్టమైన పని కాబట్టి అంత ఎత్తుకు మీరు ఉపయోగించే పరికరాలు అందుతాయో లేదా సరిచూసుకొని తర్వాత ఆ పనిని మొదలు పెట్టాల్సి ఉంటుంది. అప్పడే ఎటువంటి ఆపదా జరగకుండా ఉంటుంది.
పరికరాలు: ఏ పని మొదలు పెట్టినా వాటికి సరిపోయే పరికరాలు ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోవాలి. ఇంటిని శుభ్రపచడానికి ముందే ఏఏ పరికరాలు అవసరమవుతాయో చూసుకొని వాటిని బయటకు తీసి పెట్టుకోవాలి. అనవసరమైన పరికరాలన్నింటిని ఒక చోటపెట్టుకోవడంతో అవసరమైనవి వెతుక్కోవడానికి సమయం ఎక్కువ తీసుకొంటుంది. కాబట్టి అవసరమైన వాటిని మాత్రమే దగ్గర ఉంచుకోవాలి. ఇంటిని శుభ్రపరిచేందుకు మల్టీ పర్పస్ స్టూల్ ఉపయోగించినట్లైతే అది మీకు వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. ఇంటిని శుభ్రపచుటలో ఉపయోగపడే ఒక ముఖ్యమైనటువంటి చిట్కా ఇది.

గ్లౌజులు(చేతి తొడుగులు): ఇంటిని శుభ్రపచుటలో చాలా రకాల రసాయనాలు కలిగిని ఉత్పత్తులను వినియోగిస్తాము. మన చేతులు చాలా సున్నితమైనవి కాబట్టి రసాయనాల దాటికి తట్టుకోలేవు, కాబట్టిచేతులకు తప్పని సరిగా గ్లౌజులను ధరించడం మంచిది. గ్లౌజులను ధరించడం ద్వారా దుమ్ము, ధూళి దుళిపేటప్పుడు చేతులను శురక్షితంగా ఉంచుతుంది. కఠినమైన రసాయనాలు, బ్లీచింగులు చేతులను బర్న్ చేస్తాయి. కాబట్టి శుభ్రం చేసే ప్రతి సారి చేతులకు గ్లౌజులను ధరించడం మరిచిపోకండి.
ఒక సహాయకుడు: ఇంటి శుభ్రం చేయడం ఒక్కరి వల్ల అయ్యేపనికాదు. ఒక్కరైన సహాయంగా ఉండాలి. ఒక్కరు సహాయపడితే ఎటువంటి ప్రమాదం జరగకుండా సపోర్ట్ గా ఉంటారు. ఇది చాలా ముఖ్యమైన చిట్కా. ఎత్తులో ఉన్న వాటిని శుభ్రపరచడానికి ఉపకరణాలు అందివ్వడానికి ఒకరి సహాయం తప్పనిసరి. పని సులభం అవుతుంది.
సోప్ వాటర్: వస్తువులను శుభ్రం చేసేటప్పుడు తప్పని సరిగా సోప్ వాటర్ వాడుతుంటారు. దాంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సోప్ వాటర్ ఫ్లోర్ మీద పడిన వెంటనే మాప్ తో వెంటనే తుడిచేయాలి. లేదంటే జారిపడే అవకాశం ఉంది.
మూలల్లో శుభ్రం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేతులను చాచి మరీ శుభ్రం చేయాలి. లేదంటే చేతులు మూల గోడలకు తగిలి గోక్కోవడం, రాసుకోవడం జరుగుతుంది. వీటన్నిటిని పాటించాలంటే, ఇంటిని శుభ్రం చేయాలంటే ఎంతో ఓర్పు, సహనం కలిగి ఉండాలి. ఇంటిని త్వరగా శుభ్రం చేయాలని గాబరా పడకూడదు.



Click it and Unblock the Notifications