Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
ఇంట్లో దుమ్ము..ధూళి చేరకుండా....

టైల్స్ ను శుభ్రం చేస్తున్నప్పుడు ముందుగా వేడినీళ్లు చల్లి ఐదు నిమిషాలు అలాగే వదిలేయాలి. దీంతో వాటిపై చేరిన దుమ్ము నానుతుంది. ఆ తరువాత టైల్స్ ను బేకింగ్ సోడా, లెమన్ జ్యూస్ కలిపిన మిశ్రమంతో శుభ్రం చేయాలి. టైల్స్ ను తుడిచిన అనంతరం ఫ్యాన్ వేసి ఆరబెట్టాలి. దీంతో టైల్స్ బాగా ఆరి దుమ్ము చేరకుండా ఉంటాయి. టైల్స్ మరీ మురికిగా ఉన్నట్లయితే లెమన్ జ్యూస్ కు కాస్తంత వెనిగర్ కూడా కలిపితే ఫలితం మీరే చూడొచ్చు..
సాధ్యమైనంతవరకు కిటికీలను మూసి ఉంచినట్లయితే ఇంట్లోకి దుమ్ము, ధూళి రాకుండా నిరోధించవచ్చు. లేదంటే కిటికీలకు కర్టెన్లను తగిలించినా దుమ్ము నుంచి కాస్తంతయినా రక్షణ లభిస్తుంది. కిటికీల అద్దాలను శుభ్రం చేస్తున్నప్పుడు బయటవైపు అడ్డంగానూ, లోపలివైపు నిలువుగానూ శుభ్రం చేయాలి. ఇలా చేయటంవల్ల ఏవైపు సరిగా శుభ్రం అవలేదో అర్థమవుతుంది. ఎప్పటికప్పుడు కిటికీలను శుభ్రం చేస్తూ ఉంటే, నల్లగా మురికిపట్టినట్లుగా ఉండవు. కిటికీలను శుభ్రం చేసే సమయంలో వెనిగర్ తో శుభ్రం చేయటం మంచిది.
ఇంట్లో వాడే అద్దాలను సోప్ వాటర్ స్ప్రే చేసి న్యూస్ పేపర్ తో తుడిచినట్లైతే క్లీన్ గా కనబడుతాయి. అలాగే వార్డ్ రోబ్, కబ్ బోర్డ్స్, బీరువాలను కూడా సోప్ వాటర్ లేదా ఏదేని సోప్ లిక్విడ్ స్ప్రే చేసి స్పాంజ్ తో తుడవాలి. తర్వాత పొడిబట్టతో తుడిచినట్లైతే తడి ఆరి దుమ్ము చేరకుండా ఉంటుంది. మనం నడవడం ద్వారా కూడా కాళ్ళ ద్వారానూ ఇంట్లో దుమ్ము ఎక్కువగా చేరుతుంది. కాబట్టి డోర్ మ్యాట్ ను తప్పకుండా ఉపయోగించాలి.



Click it and Unblock the Notifications