Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
మేలు చేసే సులువైన మార్గాలెన్నో...!

దుప్పట్లు, దిండు గలేబులను వారం పదిరోజులకోసారి మార్చుతూ ఉండాలి. కొన్ని సూక్ష్మజీవులు పరుపుల లోపలకు చేరిపోతాయి. అందుకే వారానికోసారి ఎండలో వేయాలి. పరుపు, దిండ్లకు సంచులు బిగుతుగా కట్టాలి. వాటిలోపలికి ఎలాంటి పురుగులూ వెళ్లకుండా చూడాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే చర్మ సంబంధ సమస్యలు బాధించే ఆస్కారమెక్కువ.
జంతు ప్రేమికులు వాటి శుభ్రత విషయంలో దృష్టి పెట్టాలి ఎందుకంటే వాటి జుట్టు, చర్మం నుంచి రాలిన పొట్టు ఆస్తమా సమస్యకు కారణమవుతుంది. సాధ్యమైనంత వరకూ వాటిని వంటగది, జోజనాల బల్ల వద్దకు రాకుండా చూడాలి. వాటి కోసం ప్రత్యేకంగా గది కేటాయించి ఎప్పుడూ శుభ్రంగా, పొడిగా ఉండేలా చూడాలి. వాటి మెడకు ఉన్న తాడును పట్టుకున్నప్పుడు సబ్బునురగతో చేతులు కడుక్కుంటే మంచిది.
వెంటిలేటర్లు, గదిలో అమర్చిన ఫ్యాన్లకు ఎప్పటికప్పుడు తుడవాలి వాటిని చాలా మంది పట్టించుకోరు. వరండాలో పరిచిన కార్పెట్లు ఎప్పటికప్పుడు మార్చుతుండాలి. దీని అడుగున దుమ్ము పేరుకుపోయిన కదిలించినప్పుడు ఇబ్బంది పెడుతుంది. తరచూ వాక్యూమ్ క్లీనర్ తో శుభ్రపరిచినా దులిపేయడం మంచిది. వాటి అడుగున ఎండబెట్టిన నిమ్మ తొక్కలను పొడి చేసి అడుగున చల్లితే బ్యాక్టీరియా పేరుకోదు. దుర్వాసనలు దూరమవుతాయి.
బకెట్ వేడినీటిలో అరకప్పు వెనిగర్, రెండు టేబుల్ స్పూన్ల మొక్కజొన్న గంజి కలపాలి. దాంతో కిటికీలను తుడిస్తే..కొత్తవాటిలా కనిపిస్తాయి. అలాగే తివాచీ నుంచి దుర్వాసన వస్తుంటే దానిపై కొద్దిగా బేకింగ్ సోడా చల్లి..ఐదారు గంటలయ్యాక దులిపేయండి లేదా వాక్యూమ్ పెట్టండి. చక్కని సువాసన వస్తుంది. ఫర్నీచర్ కు చెదులు పట్టకుండా ఉండాలంటే కర్పూరం పొడి, లిక్విడ్ పారాఫిన్ ను సమపాళ్లలో తీసుకుని రెండింటినీ కలపాలి. ఈ మిశ్రమంతో ఫర్నిచర్ ను తుడిస్తే సమస్య తగ్గుతుంది.
ఎంతో ఖరీదు పెట్టి తోలు బ్యాగులు కొంటుంటారు. అసలు చిక్కు వాటిని శుభ్రపరచడంతోనే. కొంతకాలం వాడకం తరవాత అవి దుర్వాసన వస్తుంటే లోపల వ్యర్థాలు చేరాయని అర్థం. అప్పుడు బ్యాగ్ అంతటా గాలి తగిలేలా ఉంచాలి. కొద్దిసేపయ్యాక మెత్తటి వస్త్రంతో లోపలంతా తుడిచి, శుద్దిచేసిన నీరు, సబ్బునురగ మిశ్రమంలో ముంచిన స్పాంజ్ తో శుభ్రపరచాలి. తర్వాత లోపల తేమ చేరకుండా మందపాటి వస్త్రంతో తుడవాలి. ముఖ్యంగా ఇంక్, లిప్ స్టిక్ మరకలు పడ్డప్పుడు పచ్చిపాలు లేదా వెనిగర్ లో ముంచిన దూదితో అవి త్వరగా పోతాయి.



Click it and Unblock the Notifications