Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఇంటి పరిశుభ్రతతో చక్కటి ఆరోగ్యం....

ఇంటిని ఎంత చక్కగా దిద్దుకుంటే అంతపేరు ప్రతిష్ఠలు వస్తాయి. అందుకే ఇంటిపై పెక్కు శ్రద్ధ చూపండి. ఒక వ్యక్తి శుభ్రత ఒకరికే మంచి చేస్తుంది. ఒక ఇంటి శుభ్రత ఓ ఇంటి వారికి మాత్రమే గాక కుటుంబ సభ్యులందరికీ మంచి చేస్తుంది. ఇంటిని శుభ్రంగా పెట్టుకోక పోతే చాలామందికి విరక్తి పుడుతుంది. సామాన్లతో ఇంట్లోని గదులన్నిటినీ నింపేస్తే చాలా చికాకుగా అనిపిస్తుంది. గదిలో ముప్పావు భాగం లేదా సగభాగమైనా ఖాళీగా వదిలేసి చూడటానికి విశాలంగా కనిపిస్తుంది. గదులన్నీ సామాన్లతో నింపేస్తే ఎంత విశాలమైన ఇల్లయినా చిన్నదిగానే కనిపిస్తుంది.
ఇంటిలోకి ధారాళంగా గాలీ, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. ఇంటిలో వీలైనంత వెంటిలేషన్ బాగా వుండేటట్లు చూసుకోవాలి. మన పరిసరాల నుంచి వీచే గాలిపైనే మన ఆరోగ్యం ఆధారపడి వుంటుంది. మన పరిసరాల నుంచి వీచేగాలిపైనే గాక, పీల్చేగాలి కాలుష్యమయమైపోతే ఎన్ని సబ్బులతో ఒళ్ళు రుద్దుకుని ఏం లాభం? ఎంత తళతళలాడే దుస్తులు వేసుకుని ఏం ప్రయోజనం. అందుకే ఉతికిన దుస్తులను శుభ్రంగా మడతలు పెట్టుకొని చక్కగా అరమరలో అమర్చుకోవాలి.
మురుగునీరు ఎప్పటికప్పుడు బైటికి ప్రవహించే విధంగా చూసుకోవాలి. కూరగాయలు మీద ఈగలు, దోమలు వాలకుండా జాగ్రత్త పడాలి. ఈగలు, దోమలు వాలిన పదార్థాలు తినటం వలన అనేక రకాల రోగాలు వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ వుంటుంది. ప్రతిరోజూ ఇంటినీ చీపురుతో ఊడవటం, తడిబట్ట పెట్టి ప్రతిరోజూ ప్లోరును తుడవడం చేయాలి.



Click it and Unblock the Notifications