Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మీ ఇంటి సౌందర్యం మీ చేతుల్లోనే....

1. ఇల్లు అందంగా కనిపించాలని అనుకుంటే సరిపోదు. డ్రాయింగ్ రూం, లివింగ్ రూం, డ్రెస్సింగ్ రూం, డైనింగ్ రూం, హాల్, కిచెన్, కిడ్స్ రూం.. ఇలా ప్రతిదాన్ని అందంగా సర్దినప్పుడే వాటి సౌందర్యం మరింత ద్విగుణీకృతం అవుతుంది.
2. ఎప్పటికప్పుడు దుమ్ము, ధూళి దులపటం, రోజుకు రెండు పూటలా ఇల్లు తుడుచుకోవడం చాలా అవసరం. దాని తర్వాతే ఏ అలంకరణైనా. ప్రధాన ద్వారం ముందు, ఇంటికి చుట్టపక్కల మురికి గుంతల్లో నీరు నిలిచి ఉండకుండా చూసుకోవాలి.
3.. అక్వేరియం, వాటర్ ఫౌంటెన్ వంటి నీటికి సంబంధించినవి ఉంటే, ఎల్లప్పుడూ శుభ్రమైన నీరే ఉండేలా వాటిని చక్కబెట్టుకోవాలి.
4. అనారోగ్యానికి దారితీసే వాటిలో ప్రధానంగా వంటింటి గురించే చెప్పుకోవాలి. ఇక్కడ పరిశుభ్రత పాటించకపోతే అనారోగ్యాన్ని ఆహ్వానించినట్టే. కాబట్టి వంట చేసేటప్పుడు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు గది శుభ్రంగా ఉండాలి. స్వచ్ఛమైన గాలితో పాటు తగినంత వెలుతురు వచ్చేలా చూసుకోండి.
5. స్నానాలగదిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి. దుర్వాసన రాకూడదు. ఈ గది తలుపుల్ని ఎప్పుడూ మూసిఉంచాలి. ముఖ్యంగా టాయిలెట్ సీట్ ను మూసి పెట్టాలి. బాగా ఒత్తిడికి గురయినట్లు అన్పిస్తే.. ముదురుఎరుపు వర్ణాలు ఉన్నాయోమో చుట్టూ చూడాలి. ప్రతికూల శక్తిని పెంచి పోషించే ఇలాంటి వాటిని గుర్తించి, రంగులు మార్చాలి.
6. అద్దాలు, ప్రతిబింబించే ఉపరితలాలు మంచానికి సరళరేఖలో ఉన్నాయోమో చూడాలి. అలా ఉన్నట్లయితే అద్దంలో ప్రతిబింబం పడకుండా తెరల్లాంటివి కప్పాలి లేదా, వాటిని అక్కడినుంచి మార్చి మరోచోట పెట్టాలి.
7. ఇంటి్కి తెలుపు రంగు సున్నం వేయడం వల్ల ఆ తెలుపు రంగు మనసుని ఎన్లప్పుడూ ఉత్తేజితం చేస్తుంది. ఎండను, చలిని తగ్గిస్తుంది. సూక్ష్మి క్రిములు నశిస్తాయి.
8. ఇంటి గుమ్మానికి పసుపు రాయడం వల్ల సూక్ష్మక్రిములు, విషక్రిములు లోనికి సులువుగా ప్రవేశించలేవు.
9. ఇంట్లో గచ్చు మీద ఈగలు ముసురుతున్నట్టయితే, కాసిని గోరు వెచ్చని నీటిలో కాస్త ఉప్పు కలిపి శుభ్రం చేస్తే ఈగలు దరి చేరవు.
10. వాడేసిన దోమల మ్యాట్‌లను పారేయకండి. నేలమీద ఏదైన ద్రవ పదార్ధం ఒలికినప్పుడు బ్లాటింగ్ పేపర్ లా ఉపయోగించవచ్చు.



Click it and Unblock the Notifications