Latest Updates
-
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ! -
నాన్ వెజ్ ని మించిన రుచి, ఆరోగ్యం కూడా..చపాతీ, రైస్ లోకి కిర్రాక్ అనిపించే గోంగూర సోయా చేసుకోండిలా.. -
రాజస్థాన్ ఫేమస్ కార్న్ ఢోక్లా..బరువు తగ్గాలనుకునేవాళ్లకి ఇది బెస్ట్! -
గుడ్డు పచ్చసొన తింటే కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ఎటాక్ వస్తుందా? డాక్టర్ విక్రాంత్ సింగ్ ఏమంటున్నారంటే.. -
ఈ ఒక్క పొడి ఉంటే చాలు..జీవితంలో హాస్పిటల్ కి వెళ్లాల్సిన పనే ఉండదు..అన్నం, టిఫిన్స్ లోకి సూపర్
వాషింగ్ మిషన్ గురించి తెలుసుకొంటే.. దుస్తులు సురక్షితం...
ప్రస్తుతం చాలా ఇల్లలో వాషింగ్ మిషన్స్ ను ఉపయోగిస్తున్నారు. అయితే వాషింగ్ మిషిన్ తెచ్చామన్న మాటే కానీ, దాన్ని ఎలా ఉపయోగించాలో, దాని ఉపయోగించాల్సిన డిటర్జెంట్స్, కెమికల్స్ ఏంటో తెలియక చాలా మంది సమస్యలను ఎదుర్కొంటున్నారు. అవన్నీ తెలుసుకోకుండా అన్ని రకాల బట్టలు కలిపి మెషిన్లో వేస్తే కొన్ని దుస్తులు రూపురేఖలు మాయమైపోతాయి. ఇలాంటి ప్రమాదం లేకుండా ఏ దుస్తులు ఎలా ఉతికితే మన్నికగా ఉంటాయో తెలుసుకోవడం మంచిది కదా!
వేసుకునే దుస్తులే కాదు బెడ్‌షీట్స్, డోర్ కర్టెన్స్, మాట్స్, సోఫా, దివాన్ కుషన్ కవర్స్, ఇన్నర్స్ ఇవి కాకుండా వేసుకునే దుస్తులు వేటికవే విడివిడిగా ఉతకడం లేదా వాషింగ్ మెషిన్ వేయడం చేయాలి. మరొక ముఖ్యమైన విషయం తెలుపుబట్టలన్నీ విడిగానే వేయాలి. వేటితో కలిపినా మాసిపోయిన రంగుకు మారిపోతాయి. లేతరంగులు, ముదురు రంగులు విడివిడిగా వేయడం మంచిది. ఇక రంగు వెలిసిపోతాయను కున్నవి వాషింగ్‌మెషిన్‌లో వేయకూడదు.

నూలు దుస్తులు: వీటిని వేసవిలో ప్రత్యేకంగా వాడుతుంటాం. అంతేకాదు, అందానికి హుందాతనానికి వీటికే పెద్ద పీట వేయవచ్చు. వీటిని మామూలుగా సబ్బు, సర్ఫ్లతో ఉతికేయవచ్చు. అయితే కాటన్లో రంగు వెలిసేవి ఎక్కువగా ఉంటాయి. కాటన్ దుస్తుల్ని ఉతికేటపుడు వెంటనే తడిపే యకుండా ఒక మూల నీటితో తడిపి నలిపి చూడాలి. రంగు పోతుంటే చల్లని నీటిలో ముందుగా కొంచెం ఉప్పు లేదా వైట్ వెనిగర్ వేసి బట్టల్ని నానబెట్టాలి. రంగుని దిగనివ్వాలి. వీటిని ఉతికాక నీడలో ఆరేసి ఎక్కువ వేడితో ఐరన్ చేయాలి.
పట్టు: ఇవి కొన్ని చాలా సున్నితంగా మరికొన్ని ఎక్కువ కాలం మన్నేవిగా ఉంటాయి. రంగులు కూడా అంతే కొన్ని ఉతికిన వెంటనే రంగు వెలిస్తే, మరికొన్ని చిరిగిపోయేవరకూ రంగు వెలవవు. కొన్ని రకాల సిల్కులు తప్ప మిగిలినవి చేతులతో నలిపి ఉతకవచ్చు. మృదువైన మచ్చలు పడని షాంపూలను వాడవచ్చు. వీటిని ఉతికిన వెంటనే ఆరవేయకుండా ఒక టవల్లో కాసేపు చుట్టి ఉంచాలి. మందాన్ని బట్టి తక్కువ వేడితో ఐరన్ చేయాల్సి ఉంటుంది. ఈ చీరల్ని గంజిపెట్టి రోలింగ్ చేయకూడదు. ఇలా చేస్తే క్రిములు చేరే ప్రమాదం ఉంటుంది. వీటిని దాచేముందు డ్రై క్లీనింగ్ చేయించడం మంచిది. నేరుగా ఎండలో వేయకూడదు, రంగులు పోతాయి.
ఊలు: ఇవి అల్లిక దుస్తులు. ఇవి చలికాలం వాడదగినవి. వీటికి ఎండలో సాగే గుణం ఉంది. వీటిని ఇంట్లోనే ఉతకదలచుకుంటే గాఢత తక్కువ ఉన్న లిక్విడ్ డిటర్జెంట్‌ని వాడవచ్చు. ఉతికిన తరువాత వీటిని తీగమీద వేలాడదీయకుండా నేలమీద పరిచినట్టుగా ఆరవేయాలి. నైలాన్ పోగు కలిసినవైతే ఐరన్ అవసరం ఉండదు. కాటన్వైతేనే మరీ ఎక్కువ, తక్కువ కాని వేడిమీద ఐరన్ చేయాలి.
లినెన్: వీటిని ఉతకటం వాడుకోవటం కొంచెం కష్టమైన పని. దీనికి సాగే గుణం తక్కువగా ఉంటుంది. ముడతలు త్వరగా పడతాయి. రంగు త్వరగా పోదు. ఇది ఎంత వేడిని అయినా తట్టుకుంటుంది. వాషింగ్ మెషిన్లో ఉతికినా, చేత్తో పిండినా నీడలో ఆరవేయాలి. ఈ దుస్తుల్ని ఇYసీ చేసేటప్పుడు మడతలు అలాగే ఉంచడం మంచిది కాదు. ఎందుకంటే ఎక్కువ మడతలు వేస్తున్న కొద్దీ ఆ ప్రాంతంలో చినిగే అవకాశం ఉంది. ఇవి మరింత ఎక్కువ కాలం మన్నాలంటే తడిగా ఉన్నపుడే ఇYసీ చేసి తరువాత ఆరనివ్వాలి.
డెనిమ్: దీనిని వాడటం సులువు. దీనిని ఎంతగా ఉతుకుతుంటే అంతగా బాగుంటుంది. చల్లని లేదా గోరువెచ్చని నీటిలో ఉతకవచ్చు. దీనికి సబ్బుల్ని నేరుగా వాడటం లేదా ఎక్కువ సేపు నాననివ్వటం చేయకూడదు. తిరగవేసి ఆరవేయాలి. వాషింగ్ మెషిన్‌తో కూడా ఉతకవచ్చు. ఐరన్ చేయాల్సిన అవసరం లేదు. సరిగ్గా నిర్వహణ ఉంటే ఇది త్వరగా పాడవదు.
జార్జెట్లు-షిఫాన్లు: ఎక్కువ వాడుకలో ఉన్న దుస్తులు ఇవన్నీ. పాలియస్టర్ని ఎక్కువ వాడినా పాడవటంఉండదు కానీ దీనికి ఎండకి కరిగే గుణం ఉంటుంది. జార్జెట్, షిఫాన్, ఆర్గండి దుస్తులు అన్నీ మృదువుగా ఉంటాయి. కొన్ని రకాల గంజితో కూడిన సిల్క్ షిఫాన్ దుస్తులు తడిపిన వెంటనే నీటి మరకలు పడతాయి. వీటిని గోరువెచ్చని నీటిలో సర్ఫ్ వేసి ఉతకాలి. ఎక్కువ నలపడం బాదటం చేయకూడదు. నీటిలో బాగా జాడించి నీరంతా పోయాక పరిచినట్టు ఆరవేయాలి. కాస్త తడిగా ఉండగానే ఇస్త్రీ చేయాలి.



Click it and Unblock the Notifications
