Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రెగ్యులర్ మెయింటైనెన్స్-డోర్ క్లీనింగ్ టిప్ప్...

ఇంటికి వాడే తలుపులపై వివిధ రకాల డిజైన్లను మీరు రూపొందించుకోవచ్చు. తలుపుల మీద మీ పేర్లనే కాదు... మీకు నచ్చిన బొమ్మలను కూడా డిజైన్ చేయించుకోవచ్చు.
ఇంటి సింహ ద్వారానికున్న తలుపుకు మీ పేరును చెక్కించుకోండి లేదా నేమ్ ప్లేట్ చేయించి దానిని తలుపులోనే ఇమిడేటట్లు చూడండి. పూజ గదికి మీ కిష్టమైన దేవుని ప్రతిమ, పిల్లల గదికి కార్టూన్లు కలిగిన బొమ్మలను చెక్కించండి. వంట గదికి కూరగాయలు లేదా పండ్లు కలిగిన డిజైన్‌తో కూడుకున్న బొమ్మలను చెక్కించుకోండి.
ప్రతిరోజూ ఇంటి తలపులను డస్టర్ తో తుడిచేస్తుండాలి. లేదా పొడిబట్టతో డోర్స్ ను శుభ్రం చేసుకోవాలి. ఇంటి తలపులతో పాటు తలపులను అమర్చిన డోర్ ఫ్రేమ్స్ లను కూడా తుడిచుకొంటుంటే ఇల్లు ఎప్పుడూ కొత్తగా కనిపిస్తుంటుంది.
వుడ్ డోర్స్ వారిష్ తో కానీ, సోప్ వాటర్ లో క్లాత్ ను ముంచి తలుపులు తుడవాలి. దాంతో తలుపులపై ఉండే దుమ్ము దూళీ తొలగి పోయి, తలుపులు మెరుస్తుంటాయి.
ప్లెయింటింగ్ డోర్స్ మరింత సున్నితంగా శుభ్రం చేసుకోవాలి. స్పాంజ్ తీసుకొని దానిపై ఆల్ పర్పస్ క్లీనర్ వేసుకొని శుభ్రం చేసి తర్వాత మంచి నీళ్ళలో ముంచిన క్లాత్ తో శుభ్రపరుచుకోవాలి. అలాగే ఆల్ పర్పస్ క్లీనర్ తో డోర్ నాబ్స్, డోర్ హ్యాండిల్స్ కూడా శుభ్రం చేసుకోవచ్చు.
మరికొన్ని ఇండ్లకు ఇత్తడి డోర్లను అమర్చి వుంటారు అలాంటి వాటికి, బ్రాస్ క్లీనర్ తో శుభ్రం చేసుకోవాలి. కొన్ని ఇళ్ళ డోర్స్ లేదా విండోలకు గ్లాస్ ఫిట్ చేసినట్లైతే అటువంటి గ్లాస్ డోర్స్ కి డోర్ బ్రాస్ క్లీనర్ తో శుభ్రం చేసుకోవాలి. ఇది అన్ని హోం ఇంప్రూవ్ మెంట్ స్టోర్స్ లో లభ్యమవుతుంది.
ఇంటి నిర్మాణం చేపట్టేటప్పుడు మీరు వాడే కొయ్య ఒకే రకానికి చెందినదై ఉండేలా చూసుకోండి. వీటితో పాటు గ్లాస్ కాంబినేషన్ ఉంటే ఇంటికి మరింత అందం. అలాగే ఇంటికి తోరణాలుగా కృత్రిమంగా కాకుండా ప్రకృతి పరమైన మామిడి ఆకులను కట్టి ఉంచండి. దీంతో నిత్యం మీ ఇంట్లో శుభకార్యం జరుగుతుందా అనే భావన కలుగుతుంది. ఇలా నిత్యం ఇంటికి తోరణాలు కడుతుంటే ఆ ఇల్లు సుఖ-శాంతులతో విరాజిల్లుతుంది.



Click it and Unblock the Notifications