Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
ఆకర్షణీయమైన..సహజమైన వంటగది...

వంటగదిలో స్టవ్ పెట్టే ప్లాట్‌ఫామ్, కిచెన్ సింకు గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేటట్లు ఉండాలి, వంట చేసే సమయంలో లైట్ వేయాల్సిన పరిస్థితి ఉండకూడదు. అలాగే సింకులోకి సూర్యరశ్మి పడేలా అమర్చుకొంటే అందులో క్రిములు చేరకుండా అనేక అనారోగ్యాలను నివారించవచ్చు.
వంటగదిలో సాధారణంగా వినియోగించే ప్లాస్టిక్ వెజిటేబుల్ కటింగ్‌బోర్డులు, వెజిటబుల్ బౌల్స్ వాడకాన్ని మానేసి ఉడెన్ కటింగ్ బోర్డులు, వెదురు వెజిటబుల్ బౌల్స్ వాడితే... మీ ఎకో ఫ్రెండ్లీ కిచెన్ కాలుష్యరహితంగా మాత్రమే కాక ఆకర్షణీయంగా ఉంటుంది. కొంతమంది అవసరం ఉన్నా లేకపోయినా సరే సరదా పడి ఆకర్షణీయంగా కనిపించే ప్లాస్టిక్ వస్తువులను కొనే అలవాటు చాలామందికి ఉంటుంది. ఈ సరదాని పింగాణి, టైట పాత్రలు, ఉడెన్ కంటెయినర్‌లు, స్పూన్లు, ఫోర్కులు, మంచినీటి గ్లాసుల మీద మూతల వంటి వాటివైపు మరల్చితే ఇల్లు నేచర్ హోమ్‌ను తలపిస్తుంది.
కాలం మారే కొద్ది ఆధునిక సాంకేతిక వస్తువుల వాడకం ఎక్కువైపోతోంది. అందులో బాగంగా మిక్సీ, గ్రైండర్, ఓవేన్, హీటర్స్, రైస్ కుక్కర్స్, గ్లీసర్స్, వాషింగ్ మెషిన్ మొదలైనవి. వాషింగ్ మెషీన్‌లో డ్రయర్ సౌకర్యం ఉన్నప్పటికీ ఎండకాలంలో దుస్తులను సహజమైన గాలి, ఎండకు ఆరనివ్వడమే మంచిది. కరెంటు వాడకం తగ్గడంతోపాటు దుస్తులు సూర్యరశ్మికి ఆరడం ఆరోగ్యకరం కూడ.
ఇక మిక్సీ, గ్రైండర్ వంటి వాటికి ప్లాస్టిక్ కవర్లను మానేసి క్లాత్ కవర్లను వాడాలి. ఆకర్షణీయంగా ఉండాలంటే వాటి మీద చిన్న డిజైన్‌ను పెయింటింగ్ లేదా ఎంబ్రాయిడరీ చేసుకుంటే చాలు. ఇది ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడమే కాకుండా ఎలక్ట్రిక్ ఉపకరణాల నుంచి వెలువడే వేడిని అలాగే పట్టి ఉంచకుడా బయటకు ప్రసరింపచేస్తుంది. దీంతో వాడిన వెంటనే క్లాత్‌తో కవర్ చేసినా కూడా మిక్సీకి ఎలాంటి హాని ఉండదు. ఒవెన్ హీట్ అయ్యే లోపు, పదార్థాలు బేక్ అవుతున్నప్పుడు ఒవెన్ డోర్ అనవసరంగా తెరవకూడదు. దీని వల్ల వేడి బయటకు వెళ్లిపోతుంది, ఒవెన్ తిరిగి వేడెక్కడానికి కరెంటు వినియోగం పెరుగుతుంది.
పాలిథిన్ కవర్లలో ప్యాక్ చేసిన వస్తువులను కొంటుంటాం. ఆ కవర్లను అలాగే పారేయకుండా వీలైనన్ని సార్లు ఇతర ప్యాకింగుల కోసం ఉపయోగించిన తర్వాత మాత్రమే పారేయాలి. ఒక కవర్‌ని ఎన్ని సార్లు ఉపయోగిస్తే అన్ని కవర్ల తయారీని అరికట్టిన వాళ్లం అవుతాం. దాంతో కవర్ తయారీలో, అది మట్టిలో కలిసిపోయే క్రమంలో విడుదలయ్యే కాలుష్యాన్ని ఆ మేరకు తగ్గించవచ్చు.
డస్ట్ బిన్‌ను పనికిరాని అన్ని వస్తువులనూ పడేసే డబ్బాలా చూడకుండా... కూరగాయల వ్యర్థాలు, రీ సైకిల్ చేసే వస్తువులు విడిగా పారేసే ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఈ విషయంలో మాత్రం కాలనీవాసులంతా కలిసి ఒక అవగాహనకు వస్తే బాగుంటుంది. కూరగాయల చెత్తను పార్కులో చెట్లకు ఎరువుగా వాడవచ్చు. పాలప్యాకెట్ వంటి ప్లాస్టిక్ ఆధారిత వస్తువులను రీసైకిల్ యూనిట్‌కు చేర్చే ఏర్పాటు చేసుకుంటే ఏదీ వృథా కాదు. పర్యావరణాన్ని కాపాడడంలో మన వంతు సామాజిక బాధ్యత వహించిన వాళ్లం అవుతాం.



Click it and Unblock the Notifications