Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఫ్రిజ్ ఎక్కువ కాలం మన్నాలంటే నిర్వాహణా చిట్కాలు...!

1. ఫ్రీజ్ లోపల సామర్థ్యానికి మించి ఎక్కువ వస్తువులు పెట్టకూడదు. తక్కువగా ఉంటే లోపల ఉండే చల్లని గాలి స్వేచ్ఛగా తిరగడానికి అవకాశం కలుగుతుంది.
2. పచ్చి పదార్థాలు, వండినవి ఒకేచోట కాక వేర్వేరుఅరల్లో పెట్టాలి. లేకపోతే ఒకదాని వల్ల ఇంకొకటి పాడయ్యే ప్రమాదం ఉంది. వండిన పదార్థాలు పైన, పచ్చి పదార్థాలను కింద ఉంచడం మంచిది.
3. ఫ్రిజ్ లోనేకదా అని పదార్థాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచకండి. ఫ్రిజ్ లో పెట్టినంత మాత్రాన అవి చాలా రోజులు పాడవకుండా ఉంటాయనుకోవడం భ్రమ మాత్రమే.
4. ఫ్రిజ్ లో చిందిన పదార్థాలు, గడ్డ కట్టిన ఐస్ వంటి వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. ఇలా చేస్తే లోపల ఉన్న పదార్థాలు విషపూరితం కాకుండా జాగ్రత్త పడవచ్చు.
5. వేడి పదార్థాలను చల్లారిన తర్వాతే ఫ్రిజ్ లో పెట్టాలి. అతివేడివి పెడితే లోపల ఉష్ణోగ్రత పెరిగి సూక్ష్మజీవులూ పెరుగుతాయి. తలుపును ఎక్కువ సేపు తెరిచి ఉంచితే ఫ్రిజర్ లోపల ఉష్ణోగ్రత పెరిగి సూక్ష్మజీవులు వ్యాపిస్తాయి. 6. నీటి పరిమాణం ఎక్కువగా ఉండే పుచ్చకాయ వంటి వాటిని సిల్వర్ ఫాయిల్‌లో ఉంచాలి. లేకపోతే నీరు అంతాపోయి, ఎండిపోవడమేకాక పోషక విలువలు కూడా మాయం అవుతాయి.
7. ఒకసారి డీప్ ఫ్రీజర్ లోంచి తీసిన పదార్థాలను తిరిగి ఫ్రీజర్ లో ఉంచొద్దు. ఒకసారి బయట పెట్టిన ఆహారంపై బ్యాక్టీరియా పెరగడం ప్రారంభం అవుతుంది. దాన్ని మళ్లీ లోపల పెడితే ఆ బ్యాక్టీరియా ఎక్కువవుతుంది. అందువల్ల అవసరమైనంత వరకు తీసుకుని మిగిలింది లోపలే ఉంచాలి.
8. బేకరీ పదార్థాలు ఫ్రిజ్‌లో ఉంచాల్సిన పనిలేదు. ప్లాస్టిక్ కవర్‌లో చుట్టిపెడితే రెండురోజులు నిల్వ ఉంటాయి.
9. యాపిల్, బొప్పాయి, ద్రాక్ష మొదలగు పండ్లను వారానికి మించి ఉంచకూడదు. అరటి పళ్లను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. గట్టిగా అయిపోతాయి.
10. చాలా మంది విద్యుత్తు ఆదా అవుతుందని రాత్రివేళ ఫ్రిజ్ ను ఆఫ్ చేసి ఉదయాన్నే ఆన్ చేస్తారు. ఇది సరైన పద్దతి కాదు.ఇలా చేయడం వల్ల లాభం కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయి. ఫ్రిజ్ లో ఆటోమెటిక్ గా ఆన్ ఆఫ్ విధానం ఉంటుంది.



Click it and Unblock the Notifications