Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అద్దె ఇల్లుపై మమకారం..కొత్త ఇంటికి మారాలంటే...

1. అలా కలిగిఉండటం వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అద్దె ఇల్లు తమ సొంత ఇల్లు కాదని ఎప్పటికైనా ఖాళీ చేయక తప్పదని గుర్తుంచుకొంటే ఖాళీ చేయాల్సి వచ్చినప్పుడు మానసికంగా బాధపడాల్సిన అవసరం ఉండదు.
2. అద్దె ఇంట్లో పెంచుకున్న పూలమొక్కల్లో ఒకటి కొత్త ఇంటికి వెళ్ళేటప్పుడు వెంట తీసుకెళ్ళాలి.
3. కుటుంబ సభ్యులకు సంబందించిన వస్తువులు జాగ్రతత్తగా భద్రపరచాలి. వ్యక్తిగత ఫోటో గ్రాఫ్లు, లామినేటెడ్ వస్తువులు భద్రపరచుకొన్నటైతే కొత్త ఇంట్లో కూడా వాటిని చక్కగా అమర్చుకోవచ్చు.
4. అద్దె ఇల్లు మారాల్సి వస్తే వెంటనే మార్పు కోరుకోవాలే తప్ప అక్కడి వాతారణానికి బయపడకూడదు. కొత్త చోట కూడా ఉజ్వల భవిష్యత్ గురించి ఆలోచించవచ్చు...
5. ఉద్యోగ బదీల కారణంగా ఎక్కువగా అద్దెఇల్లు మారాల్సి వచ్చినప్పుడు ఇంటిని అలంకరించుకోవడంపై ప్రత్యేక శ్రద్ద చూపాల్సి ఉంటుంది. ఇల్లు మారేటప్పుడు వస్తువులు పగలకుండా, విరగకుండా ఉండే ఫర్నీచర్ వస్తువలే కొనాల్సి ఉంటుంది.
6. పాత ఇంటికి దగ్గరగా కొత్త అద్దె ఇల్లు దొరికితే సామాను తీసుకెళ్లడం పెద్ద సమస్య కాదు. అయితే కొత్త ఇల్లు పాత ఇంటికి దూరంగా ఉండి మీకు సమయం కూడా తక్కువగా ఉంటే ప్యాకర్స్ కంపెనీని కొనుగోలు చేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో సామాను మీరే స్వంతంగా ప్యాక్ చేసుకుంటే సరే. లేదా మీ సమక్షంలోనే ప్యాకింగ్ జరిగేలా చూసుకోవాలి. అప్పుడు ఏ సామాను ఎక్కడుందీ మీకు సులువుగా తెలుస్తుంది.
7. ముఖ్యంగా టీవీ, ఫ్రిజ్, హీటర్, వాషింగ్ మెషిన్, వాటర్ ఫిల్టర్, కంప్యూటర్ వంటి వాటి కనెక్షన్లను మీరు తీసి పెట్టుకోవాలి. తర్వాత వేరు వేరు గదులకు సంబంధించిన సామాను వేరు వేరు పెట్టెల్లో పెట్టి ప్యాక్ చేసి, పెట్టెపై నెంబర్ వేయడం మర్చిపోరాదు. అవసరం వచ్చినప్పుడు ప్యాకింగ్ విప్పాల్సిన పరిస్థితి రాకుండా డబ్బులు, రిమోట్, మొబైల్ వంటివి బయటే పెట్టుకోవాలి.
8. వంటింటి సామాను, ఇతర గాజు వస్తువులను అన్నిటికంటే జాగ్రత్తగా ప్యాక్ చేయించుకోవాలి. అలాగే సబ్బులు, టవల్స్, టూత్ బ్రస్టులు, బ్రెడ్ షీట్లు, నైట్ డ్రెస్‌లు వంటివి ప్రత్యేకంగా బ్యాగులో కాని సూట్‌కేసులో కాని పెట్టుకోవాలి. ఫర్నీచర్, పెద్ద వస్తువులను గుడ్డలో చుట్టి ప్యాక్ చేయాలి. విప్పిన తర్వాత విడి భాగాల్ని సులభంగా అమర్చుకోగలిగే విధంగా ప్యాక్ చేయాలి. ఉతకాల్సిన బట్టలు ముందుగానే ఉతికి, ఇస్త్రీ చేసి పెట్టుకుంటే ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ప్యాక్ చేయడం, తర్వాత సర్థుకోవడం సులభమవుతుంది. ఇలాంటి జాగ్రత్తులు తీసుకొన్నట్లై కొత్తగా వెళ్ళే అద్దె ఇంటిపై కూడా మమకారం పెరిగిపోతుంది. అక్కడ కూడా ఓ కొత్త జీవితాన్ని ఆరంభించిన అనుభవం కలుగుతుంది.



Click it and Unblock the Notifications