Latest Updates
-
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే..
వంటగది రిచ్ గా కనబడాల్సిన అవసరం లేదు..కానీ....

1. వంటగదిలో ప్రతి వస్తువును శుభ్రంగా ఉంచుకోవాలి. కంచాలు, పేపర్ ప్లేట్స్, టవల్స్, నాప్‌కిన్స్ ఇలాంటివన్నీ పొందిగ్గా ఒక షెల్ప్‌లో అమర్చుకోండి.
2. వంటగదిలో ధారాళమైన గాలి, వెలుతురు ఉండేటట్లు జాగ్రత్త పడడం వల్ల ఘాటైన వాసనలు ఇంట్లోని ఇతర గదుల్లోకి వ్యాపించకుండా ఉంటాయి. వీలైతే ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఏర్పాటు చేసుకోవడం మంచిది.
3. వంటగదిలో షింకు పక్కనే చెత్తబుట్ట ఒకటి తప్పనిసరిగా ఉండేలా ఏర్పాటు చేసుకోండి.
4. బేకింగ్ పౌడర్, బేకింగ్ షీట్స్, కేక్, పిజ్జా పాత్రల కోసం ప్రత్యేకంగా ఓ క్యాబిన్ ఉండేలా చూసుకోండి.
5. పెద్ద పెద్ద కబోర్డుల్లో వాడే పాత్రలను ముందుగానూ... ఇంటికి అతిథులొస్తే వాడే పాత్రలను వెనుక పక్కగానూ అందంగా అమర్చుకోవాలి.
6. పేపర్ ప్లేట్ లు, స్టీల్ ప్లేట్ లు టవల్స్ లను ఒకే సెల్ఫ్ లో చేతికి అందే విధంగా అమర్చుకోండి. రోజు అవసరమయ్యే వస్తువులు అందుబాటులో ఉండేటట్టు సర్దుకోవాలి.
7. స్నాక్ డబ్బాలను ఉంచుకునేందుకు, ఉప్పులు, పప్పులు వంటివి పెట్టుకోనికి ప్రత్యేకంగా ఓ అలమారిని ఎంచుకోవాలి. ఏ డబ్బాలో ఏమున్నాయో చూడగానే తెలిసేలా వాటిపై పేర్లను రాసి లేబుల్‌ను అతికించుకోండి. ఇలా చేస్తే వంటచేసే సమయంలో వెతుక్కోవాల్సి పని తప్పు తుంది.
8. కొందరి ఇల్లల్లో వంటగదిలో స్థలం సరిపోక హాలుల్లో ఫ్రిజ్ లను ఉంచడం సహజం. అలాంటి వారు వారానికి ఒకసారి ఫ్రిజ్ ను శుభ్రపరుస్తుండాలి. ఫ్రిజ్ లో కూడా ప్రతి వస్తువు ఓ పద్ధతి ప్రకారం ఉండేలా చూసుకోవాలి. అంతేకానీ డోర్ తెరచి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఏది పడితే అది సర్దేయకూడదు.
9. హాల్లో గనుక ఫ్రిజ్ ను పెట్టుకొన్నట్లైతే వంటకు కావాల్సిన కూరగాయల్ని ఒకే సారిగా ఓ ప్లేట్ లో గానీ లేదా ప్యాన్ లో వేసి తెచ్చుకుని తరుక్వోవాలి. దాంతో పదేపదే ఫ్రిజ్ దగ్గరకు వెళ్లే పని ఉండదు. వీలైనంతవరకు ఫ్రిజ్ ను వంటగదిలోనే ఉంచుకోవడం మంచిది.
10. వంటింట్లో చిన్న డైనింగ్ టేబుల్ కూడా ఉంటే బాగుంటుంది. స్థలం తక్కువగా ఉండి టేబుల్ వేసుకోవడం కుదరకపోతే మడవడానికి వీలయ్యే చిన్న బల్లను గోడకు అమర్చి అక్కడే ఓ కుర్చీ వేస్తే కూరగాయలు కోసుకోవడానికీ బ్రేక్‌ఫాస్ట్ చేయడానికీ ఎవరైనా వస్తే కూర్చోవడానికి కూడా పనికొస్తుంది. ఇలా ప్రతి పనిని ప్రణాళికతో చేస్తే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మళ్ళీ సర్దుకోడానికి సులువుగా ఉంచుకునేందుకు ఆస్కారం ఉంటుంది.



Click it and Unblock the Notifications
