Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
వర్షాకాలంలో ఇంటి పరిసరాలతో జాగ్రత్త...!

వానాకాలంలో మనం ఆరోగ్యంగా వుండాలీ అంటే దోమలు, ఈగలను దరిచేరనివ్వకూడదు. కొన్ని రకాల జ్వరాలు, అంటువ్యాధుల వ్యాప్తికి అవే కారణం కాబట్టి ... మనం వున్న పరిసరాల్లో అవి వాలకుండా చూసుకోగలిగితే మరీ మంచిది. ఇంట్లోగానీ, ఇంటి పరిసరాల్లోగానీ దోమ కనిపించకుండా జాగ్రత్తలు పాటించాలి. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ముక్కు, నోటికి చేతిరుమాలుగానీ చెయ్యిగానీ అడ్డుపెట్టుకోవా
ఇంటి చుట్టుపక్కల గుంటలు ఏవైనా వున్నాయేమో చూసి వాటిని వానలు పడకముందరే పూడ్చేయాలి. మరుగుదొడ్లు సైతం శుభ్రంగా వుంచుకోవాలి.
వానాకాలం కుళాయి నీరు కూడా కలుషితమయ్యే అవకాశం వుంది. అందుకే కాచి వడపోసిన నీటినే తాగాలి. కాచిన నీటిని 24 గంటలలోపు తాగాలి.
రిఫ్రిజిరేటర్‌లో నిల్వ వుంచిన పదార్థాలను సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి. తాజాగా వండిన ఆహారం తీసుకోవడం మంచిది.
ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా వుంచుకోవాలి. మనకు దోమలు, ఈగల వల్ల వచ్చే జబ్బులు తక్కువవేం కాదు కదా! నీళ్లు నిలబడి దోమలు మకాం పెట్టకుండా చూసుకోవాలి. ఇంటి లోపల కూడా పొడిగా వుంచుకోవాలి. కనీసం ఒకసారైనా ఇంటిని డెట్టాల్ కలిపిన నీళ్లతో తుడుచుకోవాలి.
ఎండాకాలంలో చల్లగా వుండడానికి వాడిని కూలర్లను వానాకాలం రాగానే మూలకు నెట్టేస్తాం. అంతటితో వాటి పని పూర్తయిందనుకుంటాం. కానీ అందులో నిల్వ చేసే నీటిని వంపేయడం మాత్రం మర్చిపోతాం. నీళ్లు నిండిన కూలర్లు దోమలకు అడ్డాల్లాంటివి. అక్కడే హాయిగా కుటుంబ సమేతంగా వృద్ధి చెందుతూ మన పని పడుతుంటాయి. అందుకే ముందు కూలర్లలో నీటిని వంపేద్దాం.
అదేవిధంగా ఎండల్లో వాడిన కుండలు, తాగిన కొబ్బరిబొండాలు, పిల్లలు ఆడిన సైకిల్ టైర్లు... అన్నిటినీ మిద్దెమీదో, గోడపక్కనో పడేస్తాం. మొక్కలు ఎండిపోయిన పూల కుండీల పరిస్థితీ అంతే. కానీ వాటిలో కూడా ప్రమాదం పొంచి వుందనుకోం. వానలు పడినప్పుడు కుండలు, కొబ్బరిబొండాలు, టైర్లు నీళ్లతో నిండిపోతాయి. ఆ తర్వాత చెప్పేదేముంది. దోమలు చేరిపోతాయి. వాటిని రానిచ్చామూ అంటే జ్వరాలను ఆహ్వానిస్తూ తలుపులు తెరిచినట్టే. కాబట్టి ఇంటి పరిసరాలను ఎంత జాగ్రత్తగా పెట్టుకొంటే అంతమంచిది.



Click it and Unblock the Notifications