Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
వెల్లుల్లి..ఉల్లిపాయల ఘాటైన వాసలు పోగట్టడం ఎలా...?
ప్రతి ఇంట్లో వెల్లుల్లి, ఉల్లిపాయలు, అల్లం తప్పనిసరిగా ఉంటుంది. అనేక కూరల్లో దీన్ని వేసుకుంటారు. ముఖ్యాంగా నోరూరించే చికెన్, మటన్ వంటి వంటకాల తయారీలో అల్లం పేస్ట్ ను విధిగా వాడుతారు. అల్లం మన శరీరంలోని రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తూ రక్తపోటును తగ్గిస్తుంది. ‘అల్లం' మన శరీరంలోని కండరాలని మెతక చేసి రక్తనాలాలని ఒత్తిడి విడిపిస్తుంది. అల్లంలో మనకు తెలియ ఔషధ గుణాలెన్నో పుష్కలంగా ఉన్నాయి.ఇది అనేక ఆరోగ్య సమస్యలకు చక్కటి మందులా పనిచేస్తుంది.

వెల్లుల్లి : వెల్లుల్లి సర్వరోగ నివారిణి. ప్రపంచవ్యాప్తంగా వెల్లుల్లిని వాడని వారంటూ ఉండరంటే అతిశయోక్తి కాదు. వెల్లుల్లిలో ఉన్న ఔషధగుణాలు కూడా అదే స్థాయిలో ఉండటం చేత దీనికి ప్రాముఖ్యత ఉంది. దీని శాస్త్రీయ నామం అల్లియం సాటివం. అనాదిగా వెల్లుల్లి
ఆహార పదార్దం గాను మరియు ఆయుర్వేద ఔషదం గాను ఉపయోగించబడుతుంది. ఇందులో విటమిన్- సి, బి6,
సెలీనియమ్, జింక్, కాల్షియమ్, పొటాషియమ్ వంటి లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.
ఇన్ని ఔషదగుణాలు కలిగినటువంటి అల్లం , వెల్లుల్లి, ఉల్లిపాయలను రుచికే కాదు ఆరోగ్యానికి కూడా అరుదుగా ఉపయోగిస్తాము. అయితే వంటిల్లో రుచికి బాగానే ఉన్నా వీటిని ఉపయోగించేటప్పుడు చేతులకు, తిన్నప్పుడు నోటికి ముట్టుకున్నప్పుడు దుస్తులకు వీటి వాసనలు భయంకరంగా ఉంటాయి. ఇవి ఎక్కువ ఘాటుగా ఉండటం వల్ల వీటి వాసనలు ఎక్కువ సేపు నిల్వ ఉంటాయి. కాబట్టి అలాంటి వాసనలు పోగొట్టడానికి కొన్ని చిట్కాలు మీకోసం...
చేతులకు: 1. చేతులకు ఉల్లిపాయ వాసనలు పోగట్టడానికి చేతులకు కొద్దిగా ఉప్పు రుద్ది వేడినీళ్లతో శుభ్రం చేసుకోవాలి. అలాగే కొద్దిగా నీటిలో సాల్ట్ వేసి షింక్ దగ్గరపెట్టుకొంటే ఇవి తరిగిన వెంటనే చాకులు శుభ్రం చేయడానికి ఉపయోగపడుతుంది. ఉప్పుతో చేతులకు శుభ్రం చేసుకోవడం వల్ల ఒక్క వాసనలు మాత్రమే కాదు చేతులను కూడు శుభ్రంగా కోమలంగా ఉంచుతుంది.
2. కొద్ది సేపు టమోటో రసాన్ని చేతులకు పట్టించి, ముఖ్యంగా ముని వేళ్ళు టమోటో జ్యూస్ లో బాగా నాన్చి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
3. చేతుల నుండి వచ్చే వెల్లుల్లి, ఉల్లిపాయ వాసనలు పోగట్టడానికి మరో చిట్కా నిమ్మరసం. బాగా పట్టించి తర్వాత శుభ్రం చేసుకోవాలి.
4. మరొక సులభమైన చిట్కా ఏంటంటే మెటల్ లేదా స్టీల్ ఐటమ్స్ కు చేతులను బాగా రుద్ది చల్లని నీటితో శుభ్రం చేసుకోవచ్చు.
పాత్రలకు:
1. పాత్రలకున్న వెల్లుల్లి, ఉల్లిపాయ వాసనలు పోవాలంటే డిటర్జెంట్ సోప్ తో రుద్ది కడిగి, తర్వాత నిమ్మ తొక్కతో రుద్ది నీటితో శుభ్రం చేయాలి. నిమ్మరసం ఉపయోగించినా కూడా పాత్రల నుండి వెల్లుల్లి, ఉల్లిపాయ వాసనలు సులువుగా పోగొట్టవచ్చు.
2. గ్లాసులకు అంటుకొన్న ఉల్లిపాయ, వెల్లుల్లి వాసనలు అంత సులభంగా వదిలి పోవు. అటువంటప్పుడు వాటిని మంచి డిటర్జెంట్ సోపుతోపాటు నిమ్మతొక్కను కూడా రుద్దాలి. లేదా బేకింగ్ సోడా తో రుద్ది కడిగితే సరిపోతుంది.
3. గ్రీస్ ప్యూనట్ పిండి ని పాత్రలకు పట్టించి ఐదునిమిషాల తర్వాత వేడినీళ్లతో శుభ్రం చేస్తే వాసనలు సులువుగా వదిలించవచ్చు.
నోటి వాసనలు: 1. వెల్లుల్లి, ఉల్లిపాయలు తిన్నప్పుడు ఎక్కువ వాసనలు రావడంతో పాటు నోట్లో ఒకరకమైనటువంటి ఇబ్బందిగా ఫీలవుతుంటాం. అటువంటప్పుడు భోజనం అయిన వెంటనే నోటిని టూత్ పేస్ట్ తో రుద్ది శుభ్రపరుచుకోవాలి.
2. నోటి నుండి వాసన పోవడానికి మరోక చక్కటి ఉపాయం భోజనం తర్వాత నిమ్మ జ్యూస్, లేదా ఆరెంజ్ జ్యూస్ , లేదా స్ట్రాబెరీ షేక్, లేదా గ్రీన్ టీ తాగడం వల్ల మూడ్ ఫ్రెష్ గాను వాసనలు తొలిగిపోతాయి.
దుస్తులపై వాసనలు: 1. దుస్తులపై వెల్లుల్లి, ఉల్లిపాయ వాసనలు పోగొట్టుటకు నిమ్మరసం బాగా ఉపయోగపడుతుంది. నిమ్మరసంను నీళ్లలో వేసి అందులో బట్టలను కొద్దిసేపు నానబెట్టి తర్వాత శుభ్రం చేస్తే దుస్తులు నుండి వెల్లుల్లి, ఉల్లిపాయల వాసనలు తొలగిపోవడమే కాకుండా, మరకలను తొలింగి . మంచి సువాసనలు కలిగి, తాజాగా మెరుస్తుంటాయి.
2. మరొక చక్కటి ఉపాయం బేకింగ్ సోడాలో బట్టలను బాగా నానబెట్టి తర్వాత శుభ్రం చేయాలి.



Click it and Unblock the Notifications