Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
చిన్న ఇల్లు అయినా సరే అతి విశాలంగా...

మొదట వరండా..వరండాలో చెప్పుల వదులుతారు. అవి ఎలాఅంటే అలా చిందరవందరగా ఉన్నట్లైతే ఆ వరండాకే అందం కరువౌతుంది. కాబట్టి చెప్పులు పెట్టుకోవడానికి చెక్కతో, లేదా స్టీల్ తో, లేదా ప్లాస్టిక్ తో చేసి షూ స్టాండ్స్ బయట మార్కెట్లో దొరుకుతున్నాయి. అలాంటి వాటిని అరేంజ్ చేసుకొన్నట్లైతే ఆ వరండా అందమే మారిపోతుంది. తర్వాతది హాలు: హాలు లో ముఖ్యంగా ఉండాల్సి ఫర్నీచర్. ఈ ఫర్నీచర్ ను గోడలకు ఆనించి పెట్టడం మంచిది. ఇలా చేయడం ద్వారా అటూ ఇటూ తిరగేందుకు చోటు విశాలంగా ఉంటుంది. సోఫాదీవానాలు కొనే ముందు గది పొడవు, వెడల్పులు దష్టిలో పెట్టుకొని కొనడం మంచిది. సోఫా..దీవాన్ వంటివి ఒక కోణంలో పెట్టడం ద్వారా ఆ గడి పొడుగ్గా ఉన్న భావన కలుగుతుంది.
హాలుకైనా, బెడ్ రూం కైనా, డ్రాయింగ్ రూం కైనా ఫర్నీచర్ ను కొనేటప్పుడు ఎంపిక విధానంలో అవి బహువిధాలుగా ఉపయోగపడేలా ఉడేవిగా చూసి కొనుగోలు చేసుకోవాలి. ఉదాహరణకు టీవీ స్టాండ్ తీసుకునేటప్పుడు ఎక్కువ సెల్ఫ్ లు ఉన్న దానిని తీసుకుంటే డివిడిలు, పుస్తకాలు, వాటిలో దాచుకోవచ్చు. అలాగే ఫోటో ఫ్రేమ్ లు, ఫవర్ వాజ్ లు షోకేష్ అలంకరణలు అందులో సర్దుకొని టీ స్టాండ్ కు కొత్త అందాలు తీర్చిదిద్దవచ్చు. అలాగే సోఫా కం బెడ్ వంటి వాటిని తీసుకోవడం వల్ల అవి బహుళార్థక ప్రయోజనాలు ఇస్తాయి. అందులో బట్టలు, పుస్తకాలు, సామాన్లు వంటి వాటిని పెట్టుకొనుటకు అనుకూలంగా ఉంటుంది.
వంటగది: వంటగదిలో బెంచీలు స్టోర్ చేసుకునేందుకు, కాఫీ టేబుల్ గా ఉపయోగించేందుకు అదనంగా కూర్చోవడానికి ఇవి ప్రయోగనకరంగా ఉంటున్నాయి. వంటగది విశాలంగా కనిపించాలంటే ఆ గదిలో అల్మరాలు గోడలోపలకు పె ట్టుకోవడం సరైనది. తద్వారా అన్ని వస్తువులను వాటిలో పెట్టుకోవచ్చు. అలాగే వంట గట్టు కింద అరలు పెట్టుకోవడం వల్ల కూడా గది చిందరవందరగా కనిపించకుండా ఉంటుంది. డైనింగ్ రూం... డైనింగ్ రూం పెద్దగా కనిపించాలంటే చేయాల్సింది టేబుల్ సైజ్‌ను చిన్నదిగా ఉంచడమే. చిన్న డైనింగ్ టేబుల్ లేదా మడిచిపెట్టుకునే అవకాశం ఉన్నదానిని ఉపయోగించడం వల్ల మాత్రమే ఆ గది విశాలం గా కనిపించగలదు. అలాగే మూల అల్మరాలో గాజు సామాన్లు పెట్టుకోవడం, అలాగే జాడీలు వంటి వాటిని పెట్టుకోవడం వల్ల గది ఇరుకుగా కనిపించదు.
గదుల్లో ఎక్కడబడితే అక్కడ బుక్స్, పేపర్లు, బట్టలు, చెప్పులు వంటివి పెట్టుకోవడం వల్ల ఆ ఇల్లు కిక్కిరిసినట్టుగా కనిపిస్తుంది. కనుక గోడకు ఫిక్స్ చేసుకునే షూరాక్స్, మ్యాగజైప్ ర్యాక్స్ ఏర్పాటు చేసుకోవడం వల్ల వాటన్నింటినీ గోడల మీదకు ఎక్కించేయవచ్చు. ఇలా చేయడం ద్వారా చిన్న ఇంట్లో ఎక్కువ స్థలం ఏర్పడుతుంది. సాధ్యమైనంత వరకూ వార్డ్‌రోబ్స్ వంటివి గోడలకే ఫిట్ చేయించుకోవడం మంచిది. అలాగే డ్రెస్సింగ్ టేబుల్ పెట్టి ఉన్న చోటును మింగేయకుండా గోడలకు అద్దాలను బిగించడం వల్ల గది కాస్త విశాలంగా ఉన్నట్టు కనుపిస్తుంది. అలాగే మంచంకన్నా పెద్దగా ఉండే వస్తువు ఏదీ ఆ గదిలో ఉండకూడదన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని దానిని సర్దుకోవాలి. బెడ్‌రూంలో గోడలకు అన్నీ తగిలించడం వల్ల కూడా గది చిన్నగా అనిపించే అవకాశమున్నందున గది గోడలను కూడా సాధ్యమైనంత ఖాళీగా ఉంచడం మంచిది.



Click it and Unblock the Notifications
