Latest Updates
-
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.!
స్నానించడంలో ఉన్న మాధుర్యాన్ని పొందాలంటే...?

స్నానం' ప్రతి మనిషికి మంచి ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని, కొత్త శక్తిని ఇస్తుంది. అయితే బాత్‌రూమును శుచిశుభ్రతలకు నిలయంగా కళాత్మకంగా తీర్చిదిద్దుకున్నపుడే స్నానించడంలో వున్న మాధుర్యాన్ని సంపూర్ణంగా అనుభవించగలం. అలాగే స్నానాల గదిలో నిత్యం వాడే వస్తువులు, విద్యుత్ ఉపకరణాలు, తదితరాలన్నింటినీ సరైన స్థానంలో ఉంచుకోగలిగితేనే స్నానంలో ఉండే ఆనందాన్ని అనుభవించగలుగుతాం. అందుకోసం ఈ కింది సూచనలను అందుకోండి.
బేసిన్లు : సాధారణంగా పింగాణీతో తయారయ్యే ఈ వాష్ బేషిన్లను శుభ్రం చేయడానికి ఇంట్లో వాడే బ్లీచింగ్ పౌడరును ఉపయోగించవచ్చు. శుభ్రపరచాలనుకొనే బేసిన్లపై మొదట బ్లీచ్ లో ముంచిన పేపర్ టవళ్లను అరగంట సేపు ఉంచాలి. తర్వాత దానిపై టార్టర్ క్రీమును వేసి మరీ తడిగా లేని బట్టతో తుడిచేస్తే బేసిన్ తెల్లగా తళతళలాడుతుంది.
డ్రెయిన్లు: బాత్‌రూమ్ లోవాడే నీరు బయటికి పోయేందుకు వీలుగా డ్రెయిన్లు కట్టుకోవాలి. తలస్నానం చేసేటప్పుడు జుట్టుతోబాటు కుంకుడుపిప్పి ఇంకా వ్యర్థపదార్థాలు పోయే మార్గానికి అడ్డుపడవచ్చు. కాబట్టి ఆశ్రద్ద చేస్తే ఎక్కడి నీరక్కడే నిలిచిపోయి ఇబ్బందికరంగా మారుతుంది. హెయిర్ పిన్నుతో డ్రైయిన్లో అడ్డుపడిన వెంట్రుకలను సులువుగా తొలగించవచ్చు.
షవర్లు: మనసుకు హాయిని, స్నానాను భూతిని కల్గించడంలో ప్రధాన పాత్ర వహించేవి షవర్లు. నచ్చిన విధంగా నీటిని విరజిమ్మే ఈ షవర్ల నిర్వహణపట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. వీటిని శుభ్రం చేయడానికి పొడవైన హ్యాండిల్స్ ఉండే బ్రష్షులను వాడితే అవి షవర్ అన్ని మూలలనూ చక్కగా మెరిసేలా చేస్తాయి. షవర్ ట్రేలను శుభ్రపరచి ఆరిన తర్వాత వాటిపైన మిథైలేటెడ్ స్పిరిట్లు నీరు, కిరోసిన్ ఈ మూడింటి మిశ్రమ ద్రావణంతో బాగా రబ్ చేయాలి. తర్వాత మెత్తని గుడ్డతో తుడిస్తే ట్రేలు తళతళలాడతాయి.



Click it and Unblock the Notifications
