Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
ఇంట్లో వారికే కాదు అతిథులకు ఆహ్లాదకరమే...!

ఈ చెడు వాసనలను దూరం చేసే ఎయిర్ ఫ్రెషనర్స్ ఇప్పుడు మార్కెట్లోకి వచ్చాయి. టాయిలెట్, బాత్ రూమ్ లో వెలువడే దుర్వాసనలు ఇవి తొలగిస్తాయి. వీటిని ఉపయోగించి ఇంట్లో హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. అంతే కాకుండా ఇంటి చిట్కాలు కూడా చక్కగా పనిచేస్తాయి. బాత్రూం, వంటిట్లో నాణ్యమైన ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ని విధిగా అమర్చాలి. వంటింట్లో వాసనలు తొలగాలంటే కాసిన నీటిలో నిమ్మకాయ తొక్కలను వేసి మరిగించాలి. ఇవి ఇల్లంతా వ్యాపించి మంచి వాసనను ఇస్తాయి. లేదంటే వేడినీటిలో నారింజ తొక్కలను వేసి మరిగించాలి లేదా కాసింత రసాన్ని పిండినా సరే.
తులసి ఆకులని వెడినీటిలో మరిగించి ఆ నీటిని ఇంట్లో అక్కడక్కడా ఉంచినా మంచి వాసన వస్తుంది. ఇంటిచుట్టూ బేకింగ్ పౌడర్‌ని జల్లితే ఈగలు ఇంట్లోకి రావు. కార్పెట్లు వాసన రాకుండా వాటిని బేకింగ్ సొడా కలిపిన నీటిలో నానబెట్టి వాక్యూమ్ క్లీనర్ తో శుభ్రపరచాలి. సెంటెడ్ క్యాండిల్స్ ను ఇంట్లో వెలిగిస్తే.. వెన్నెల్లా మంచి వెలుతురు ఇస్తూనే మనసుని మురిపించే వాసనలు వెదజల్లు తుంటాయి.
మసాలాలు, నూనె వంటలు, పిండి వంటలు చేసినప్పుడు ఇంట్లో అన్ని గదులకు వ్యాపించి వాసన ఎక్కువగా వస్తాయి. అటువంటప్పుడు ఒక కప్పు నీళ్ళలో నిమ్మకాయ తొక్కలను వేసి మరిగించాలి. ఇవి ఇల్లంతా వ్యాపించి మంచి వాసనను ఇస్తాయి. వేడినీటిలో నారింజ తొక్కలను వేసి మరిగించండి. ఇల్లంతా నారింజ వాసనలతో గుభాళిస్తుంటుంది
మార్కెట్లో దొరికే స్ప్రేలతో వంటగది, డ్రాయింగ్ రూమ్, బెడ్ రూమ్, వరండా వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చవచ్చు. ఫ్రూట్, ఫ్వవర్ (ఫ్లేవర్స్) సువాసనలతో ఇవి అభిస్తున్నాయి. కావాలంటే మీరు ప్రత్యేక సువాసన వెదజల్లే ఫ్రెషనర్స్ ను ఎంపిక చేసుకోవచ్చు. రూమ్ ఫ్రెషనర్స్ ను కొనుగోలు చేసే ముందు 'బ్రాండ్"విషయం గుర్తుంచుకోండి. క్వాలిటీ, ఎక్స్ పైరీ డేట్, ఎలర్జీ స్టేటస్ తదితర అంశాలను బాగా పరిశీలించండి. ఇలా రకరకాలైనటువుంటి సుగంధభరితమైన పరిమళాలతో ఇల్లు ఆ ఇంటివారినే కాదు ఆ ఇంట్లో అడుగు పెట్టిన వారందరికీ ఆహ్లాదాన్ని పంచుతుంది. అందరిలో తాజాదనాన్ని నింపుతుంది.



Click it and Unblock the Notifications
