Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
వంటింట్లో వాసనలు పోగట్టడం ఎలా
వంటింటి పరిశుభ్రత, ఆహార పదార్థాల్లో పోషక విలువలు నష్టపోకుండా వండే పద్ధతిపై కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.
1. టైల్స్‌ను సబ్బునీటితో తుడిచినట్లయితే ఎటువంటి మరకలు, జిడ్డు లేకుండా పరిశుభ్రంగా మెరుస్తుంది.
2. చేపలతో వంటలు చేసినప్పుడు గిన్నెలకు ఆ వాసన అంటుతుంది. అప్పుడు పాత్రలు కడిగే నీటిలో ఆవపొడిని కలపండి. చేపలవాసన పోతుంది. చేపలు కట్‌చేసిన కత్తికి ఆవపొడి రాసి కడగాలి.
3. కోడిగుడ్డు వాసన పోవాలంటే గిన్నెను కాని బాండీని కాని క్లీన్ చేశాక ఒకసారి గ్యాస్‌స్టౌపై పెట్టి వేడి చేయండి. గిన్నెలకు వున్న వాసన పోతుంది.
4. ఉల్లిపాయ కోశాక ఏవైనా ప్రూట్స్ కట్ చేద్దామంటే ఉల్లి వాసన వస్తూవుంటుంది. ఈ వాసన త్వరగా పోదు. అందుకని ఉల్లిపాయ కట్ చేసిన కత్తిపీటను కానీ, చాకునుకానీ నిమ్మ చెక్కతో రుద్ది కడుగాలి.
5. తినేసోడా కలిపిన నీళ్ళతో గిన్నెలను, బాండీలను కడిగితే వాటికి అంటిన వాసనలు పోయి పాత్రలు మిళమిళ మెరిసి పోతాయి.
6. కిచెన్ రాత్రి సమయంలో చీకటిగా వుంచకుండా నైట్ బల్బ్‌ను వేసివుంచడం వల్ల పురుగులు బొద్దిం కలు ఎక్కువగా వ్యాపించవు.
7. స్టౌవ్ మీద పదార్థాల మరకలను ఊరకే తుడిచేస్తే సరిపోదు..గోరువెచ్చని నీటిలో సబ్బుద్రావణం కలిపి తుడవాలి. అప్పుడు ఈగలు, చీమల బెడద ఉండదు.
8. వంటింట్లో సింక్ ను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటే చెడు వాసనలు రావు. అలాగే మూడు నాలుగు రోజులకోసారి వంటింట్లో వాడే పాత వస్త్రాలను వేణ్నీళ్లలో నానబెట్టి ఉతకాలి. దాంతో బ్యాక్టీరియా దుమ్ము దూరమవుతాయి.



Click it and Unblock the Notifications
