Just In
- 3 hrs ago
Today Rasi Phalalu :ఓ రాశి వారు రియల్ ఎస్టేట్ వ్యాపార నిర్ణయాల్లో తొందరపడొద్దు..
- 13 hrs ago
మీ కొలెస్ట్రాల్ స్థాయిని మరియు PPని తగ్గించడానికి ఈ 3 పదార్థాల మిశ్రమాన్ని తాగడం సరిపోతుంది!
- 14 hrs ago
రాత్రి పడుకునే ముందు పాలలో చెంచా నెయ్యి కలుపుకుని తింటే ఎన్ని లాభాలో తెలుసా?
- 15 hrs ago
రొమాన్స్ లో గ్యాప్ రాకుండా చూసుకోండి.. లేదంటే ఎన్ని ప్రమాదాలో తెలుసా...
Don't Miss
- News
చేరికల కోసం పోటీపడుతున్న తెలంగాణా రాజకీయ పార్టీలు.. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఎవరివ్యూహం వారిదే!!
- Movies
మరోసారి హాట్ వీడియో వదిలిన విష్ణుప్రియ: టాప్‌ను పైకి లేపేసి అందాల జాతర
- Sports
అశ్‘విన్’ అసామాన్య బ్యాటింగ్.. చెన్నై నుంచి విజయాన్ని లాక్కున్నాడు
- Finance
ఈ ఏడాది నిఫ్టీకి ఇదే సెకండ్ బిగ్గెస్ట్ గెయిన్, రూ.5 లక్షల కోట్ల సంపద పెరిగింది
- Technology
స్పామ్ కాల్లతో విసిగిపోయారా? అయితే ఇలా బ్లాక్ చేయండి...
- Automobiles
నా భార్య కోసం XUV700 బుక్ చేశా.. డెలివరీ కోసం నేను కూడా క్యూలో వెయిట్ చేస్తున్నా: ఆనంద్ మహీంద్రా
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వార్డ్ రోబ్ ఎలా మెయింటైన్ చేయాలి...
ఇదివరికటిలా బట్టలు సర్దుకోవడానికి బీరువాలు, చెక్కబీరువాలు, అల్మారాలు ఉపయోగించే వారు. అయితే ఇప్పుడు రాను, రాను ఇవి కనుమరుగు అయిపోతున్నాయి. పట్టణాలకి జీవనాపాధి కోసం జనాభా వలసి వెల్లడం, పట్టణీకరణ పెరగడంతో చిన్న చిన్న అపార్ట్ మెంట్ లు కట్టి అద్దెలకు ఇచ్చేస్తున్నారు. అపా ర్ట్ మెంట్ గదులు చిన్నవిగా ఉండడం వల్ల అల్మారాలు పెట్టుకోవటానికి స్థలం సరిపోదు. అందుకే వార్డ్ రోబ్ లో ఇతర వస్తువులను కూడా చేర్చేస్తుంటారు. అయితే వార్డ్ రోబ్ లలో బట్టలే కాకుండా ఇతర వస్తువులను పెట్టేస్తున్నారు. అలాంటిఅనవసరమైన వాటిని తీసి బయట మరేదైన ప్రదేశంలో పెట్టుకోవాలి. అలా చేయకపోతే అన్ని అందులో మనకు కావలసిన వాటిని ఎక్కడ ఉంచుకోవాలో తెలియక అవసరమైనప్పుడు వాటిని తీయ్యడానికి ఇబ్బంది కలుగుతుంది. అందుకే వార్డ్ రోబ్ సర్దే పనిలో ఇది మొదటగా చేయాలి.
అలా చేయకపోతే చిన్న చిన్న దుస్తులు సమయానికి కనబడవు. దుస్తుల మధ్యలో ఉండిపోయి ఇబ్బంది పెట్టిస్తాయి. అందులో ముఖ్యంగా టైలు, పాంటీస్, సాక్స్, కర్చీఫ్‌లు, లోదుస్తులు. ఇటువంటివి చిన్న అందమైన బుట్టలో వేసుకుని వార్డ్ రోబ్ లో ఒక అల్మారాలో పెట్టుకోవాలి. లేదా హ్యాంగర్స్ ని ఉపయోగించి వాటిలో తగిలించుకోవాలి. అల్మారాలో తగిలించిన దుస్తుల ప్రదేశంపైన, వాటి తాలూకు వివరాలతో ట్యాగ్ అంటిస్తే వెతుక్కోవటం అనే సమస్య ఉండదు. టైమ్ వేస్ట్ కాకుండా ఉంటుంది. దుస్తులన్ని పొందిగ్గా ఉంటాయి. వెతుకులాటలో సర్దిపెట్టుకున్న దుస్తులు చిందర వందర లేకుండా ఉంటాయి. ఒక్కో సీజన్‌కి ఒక్కో రకం దుస్తులు వాడుతుంటాం. సీజన్ కి అనువుకాని షూస్, దుస్తుల కోసం ప్రత్యే అరలు కేటాయించుకోవాలి. ఈ అరలు పార దర్శకంగా ఉన్నవి అయితే మరీ మంచిది. అవసరం పడినపుడు ఎక్కడవున్నా గుర్తించవచ్చు.