For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐరెనింగ్ చిట్కాలతో...ఆనందం మీ వెంట...!

|

Ironing Tips
ప్రస్తుత జనరేషన్ లో మానవులు సౌకర్యాలకు బాగా అలవాటు పడ్డారు. ప్రతి ఇంట్లో కచ్చితంగా విద్యుత్తుతో పనిచేసే పరికరాలు ఒకటో రెండో ఉంటున్నాయి. పొద్దుటిపూట హటాత్తుగా విద్యుత్తు సరఫరా ఆగిపోతే దినచర్యలకు ఆటంకం కలుగుతుంది. మిక్సీ పనిచేయుదు. రైస్ కుకర్‌లో అన్నం ఉడకదు. ఐరన్ బాక్స్ వేడెక్కక బట్టలు ఇస్ర్తీ కావు. ఇలా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అవసరం తీరకుండా పోతుంది. ఎలక్ట్రానిక్ పరికరాలు ఎన్ని వినియోగించినా వాటి వాడకంలో మెలుకువలు, జాగ్రత్తలు, లాభనష్టాలను తెలిసుకొని ఉండాలి.

ఐరన్ బాక్స్ కొనే ముందు ఎక్కువకాలం మన్నిక ఉండే బ్రాండ్‌ కంపెనీలవే కొనాలి. తక్కువ బరువు ఉండేవి, ఆటోమే టిక్‌ వి ఎంతో ఉపయోగం. వీటివల్ల కరెంటు ఆదా అవుతుంది. బట్టలు ఐరన్‌ చేసేటపుడు మధ్యలో ఆపకూడదు. ఆపితే ఎక్కువ కరెంటు ఖర్చు అవుతుంది. ఐరన్ చేసే సమయంలో పరాకు, అశ్రద్ధ, మతిమరుపు ఉండకూడదు. అందువల్ల బట్టలకు నష్టం జరుగుతుంది.

ఐరన్ చేస్తూ ఏదో పని గుర్తొచ్చి, లేదా ఫోన్‌ మ్రోగినా, కాలింగ్‌ బెల్స్‌ ఎవరైన నొక్కినా, పెట్టెను అలాగే వదలి అవతలకు వెళ్ళకూడదు. పిల్లలు దానిని ముట్టుకుని ప్రమాదాల పాలవుతారు. చిన్నపిల్లలున్న ఇంట్లో బట్టలను ఐరన్‌ చేసేటప్పుడు పిల్లలకు అందనంత ఎత్తులో బల్లమీద బట్టలను ఐరన్ చేయాలి.చివరిగా బట్టలు అయిపోయే ముందు స్విచ్‌ ఆప్‌ చేయాలి. ఐరన్‌ పని పూర్తవగానే స్విచ్‌ ఆఫ్‌చేసేసి, ప్లగ్‌ నుంచి వైర్‌ ను తీసెయ్యాలి. ఐరన్‌ బాక్స్‌ చల్లబడిన తర్వాత, దాని యధాస్థానానికి చేర్చాలి.

దుస్తులను ఐరన్ చేసి చక్కగా మడత పెట్టడమే కాదు...ఆ సమయంలో కొన్ని జాగ్రత్తలూ పాటించాలి. అప్పుడే మడతలు చెదరకుండా...నాణ్యత చెడిపోకుండా ఉంటాయి. దుస్తులు కొత్త వాటిలా మెరుస్తాయి. కొందరు పరుపు మీద వేసి దుస్తులను ఐరన్ చేస్తుంటారు. ఎప్పుడైనా బల్ల లేదా గట్టిగా ఉండే ఉపరితలం మీద చేయాలి. అప్పుడే వస్త్రాలకు బాగా వేడి అందుతుంది. పని కూడా త్వరగా పూర్తవుతుంది. విద్యుత్ ఆదా అవుతుంది.

అల్యూమినియం ఫాయిల్ అందుబాటులో ఉంటే దాన్ని వస్త్రం మీద వేసి ఐరన్ చేస్తే దుస్తుల మీద ప్రింట్ పోకుండా ఉంటాయి. ముడతలు లేకుండా త్వరగా సాఫీ అవుతుంది.
మందంగా ఉండే చోట అంటే కాలరు, మణికట్లు, కుట్లున్న చోట తిరగవేసి చేయాలి. అప్పుడే వస్త్రం పాడవదు. కుట్లు వేసిన చోట దారం బలహీనపడదు. నూలు దుస్తులను తప్పనిసరిగా రెండు వైపులా ఐరన్ చేయాలి. అప్పుడే ముడతలు పోయి...చక్కగా కనిపిస్తుంది. చేతులు నెట్ , లేదా సున్నితమైన వస్త్రంతో తీర్చిదిద్ది ఉంటే కాస్త వేడి తగిలినా అవి చిరిగిపోతాయి. అందుకే బల్ల మీద దుస్తులని పరిచినప్పుడు చేతుల భాగంలో కాటన్ బట్టను పరిస్తే సరిపోతుంది.

చేతి రుమాళ్ళు, చిన్న చిన్న నాఫ్‌కీన్స్‌కు ప్రత్యేకంగా ఐరన్‌ చేయకుండా చీరమీద ఉంచి చేస్తే , అవి ఇస్త్రీ అవుతాయి. లేకుండా చీర మీద ఉంచి చేస్తే, అవి ఇస్త్రీ అవుతాయి. కాదా ఐరన్‌ బాక్స్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసిన తర్వాత బాక్స్‌ అడుగు, భాగం కొంత వేడిగా ఉంటుంది. కనుక పలుచని తువ్వాళ్ళు, రుమాళ్ళు, నాఫ్‌కిన్స్‌ను ఐరన్‌ బాక్స్‌తో రుద్దితే అవి ఇస్త్రీ చేసినట్లుగా అవుతాయి.

English summary

Ironing Tips for Best results...! | ఐరన్ చేయండి....ఆనందించండి....

Ironing is not one of those household tasks that bother me. It's rather mindless and can be done in front of the television or while listening to the radio. Of course, after 30 years of ironing clothes for my family, I have learned a trick or two to make ironing just a little easier. If you wear cotton, or cotton blends such as my family does, those garments tend to wrinkle in the dryer. The secret to keeping those wrinkles to a minimum is all in how you dry your clothes in the first place.
Story first published:Wednesday, May 9, 2012, 12:45 [IST]
Desktop Bottom Promotion