Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వంటగది శుభ్రతకే ప్రాధన్యాత...?

1. రోజూ ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత మాత్రమే వంటగదిలోకి వెళ్లాలి. ఇది అలవాటుగా మారితే అనేక అనారోగ్యాలను దూరంగా ఉంచవచ్చు.
2. వంటగదిలోకి తగినంత సూర్యరశ్మి, గాలి ప్రసరిస్తుండాలి. గాలి రావడానికి, వెళ్లడానికి వీలుగా కిటికీలను తెరిచి ఉంచాలి.
3. స్టౌ పెట్టే ప్లాట్‌ఫామ్‌ను, నేల మీద పడిన నూనె మరకలు, ఆహారపదార్థాలను ఎప్పటికప్పుడు తుడిచేయాలి. వాటిని అలాగే వదిలేస్తే బ్యాక్టీరియాకు ఆవాసాలవుతాయి. ప్లాట్‌ఫామ్ మీద వెనిగర్ చల్లి తుడిస్తే బ్యాక్టీరియా నశిస్తుంది.
4. కిచెన్ బిన్‌లోని వ్యర్థాలను పారేసి సరిపెట్టుకోకుండా డస్ట్‌బిన్‌ను రోజూ శుభ్రంగా కడగాలి.
5. డోమెక్స్, బ్లీచింగ్ వంటి క్లీనింగ్ ఎలిమెంట్స్‌ను ఆహార పదార్థాలు, వంటదినుసులకు దగ్గరగా ఉంచకూడదు. వీటి కోసం విడిగా ఒక అర కేటాయించాలి.
6. వంటగదిని రోజూ సాధారణంగా శుభ్రం చేయడంతోపాటు పర్తిస్థాయిలో శుభ్రం చేయడానికి ఒక క్యాలెండర్ మెయింటెయిన్ చేసుకోవడం మంచి పద్ధతి. వారంలో ఫలానా రోజు అనుకుంటే ఇది పెద్ద కష్టంతో కూడిన పనిగా అనిపించదు.
7. అలాగే ఫ్రిజ్..అదే రోజు ఫ్రిజ్‌లో మిగిలి పోయిన ఆహార పదార్థాలు, పాడైన కూరగాయలు, పురుగుపట్టిన పప్పు దినుసులను పారవేసి టిన్నులను శుభ్రం చేసుకోవాలి.
8. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే తరచూ నేల, ప్లాట్ ఫామ్ తోపాటు కిచెన్ షెల్ఫ్ లు అన్నింటినీ శుభ్రం చేయాలి. సింక్ లో అర కప్పు ఉప్పు చల్లి నిమ్మ చెక్కతో రుద్ది పది నిమిషాల తర్వాత స్క్రబ్బర్‌తో రుద్ది కడగాలి.
9. వంటగదిలో వాడే టవల్స్ ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. డిటర్జెంట్‌తో ఉతికిన తర్వాత వేడినీటిలో ముంచి, బాగా ఎండ తగిలే చోట ఆరేయాలి. వాడిన టవల్స్‌ను తడిపి సింక్‌లో వదిలేయడం ఆరోగ్యకరమైన అలవాటు కాదు.
10. కటింగ్ బోర్డ్, చాకులను వారానికి ఒకసారి బ్లీచింగ్, వెనిగర్ కలిపిన వేడినీటిలో వేసి శుభ్రం చేయాలి. కూరగాయలను ప్లాస్టిక్ కటింగ్ బోర్డు మీద తరిగినప్పుడు కూరగాయలతోపాటు చిన్న ప్లాస్టిక్ రేణువులు కూడా ఆహారంలో కలుస్తాయి. కాబట్టి ఉడెన్ కటింగ్ బోర్డు వాడడం మంచిది.
11. చిన్న కప్పులో బోరిక్ యాసిడ్ వేసి వంటగది మూలల్లో ఉంచితే బొద్దింకలు రావు.
12. ఆహార పదార్థాలను ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేయరాదు. ప్లాస్టిక్ తయారీలో ఉపయోగించే రసాయనాలు, విషపదార్థాల అవశేషాలు ఆహారపదార్థాలను విషపూరితం చేస్తాయి.



Click it and Unblock the Notifications