Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
వంటగది శుచి-శుభ్రతలే ఆరోగ్యానికి శ్రీరామ రక్ష

1. ప్రతి రోజూ ఉదయాన్నే పళ్ళు రుద్ది, స్నానం చేసిన తర్వాత మాత్రమే వంటగదిలోకి వెళ్లాలి. ఇది అలవాటుగా మారితే అనేక అనారోగ్యాలను దూరంగా ఉంచవచ్చు.
2. జలుబు, దగ్గు, విరేచనాలు, వైరల్ ఫీవర్ వంటి అంటువ్యాధులతో బాధపడుతున్న సమయంలో వంటగది ఛాయలకు వెళ్లకూడదు. ఎందుకంటే వారి నుండి ఇంకొకరి సంక్రమించే అవకాశం ఉంది.
3. వంటగదికి వెంటిలేషన్ బాగా ఉండాలి. ఎందుకంటే ఎంత గాలి వెలుతురు ఉంటే అంత మంచిగా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఒకటి తయారు చేస్తాఉంటాం వాటి వాసనలు, మిగిలిపోయిన పదార్థాల వాసనలు ఇలాంటివి స్ప్రెడ్ అవకుండా ఉంటుంది. గాలి రావడానికి, వెళ్లడానికి వీలుగా కిటికీలను తెరిచి ఉంచాలి.
4. స్టౌ పెట్టే ప్లాట్ ఫామ్ ను, స్టౌ మీద, స్టౌ మీద నుండి పొంగిన పాలు, గెంజి, నేల మీద పడిన నూనె మరకలు, ఆహారపదార్థాలను ఎప్పటికప్పుడు స్పాంజ్ తో తుడిచేయాలి. వాటిని అలాగే వదిలేస్తే బ్యాక్టీరియాకు ఆవాసాలవుతాయి. ప్లాట్ ఫామ్ మీద వెనిగర్ చల్లి తుడిస్తే బ్యాక్టీరియా నశిస్తుంది.
5. ఆహార పదార్థాలను ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేయరాదు. ప్లాస్టిక్ తయారీలో ఉపయోగించే రసాయనాలు, విషపదార్థాల అవశేషాలు ఆహారపదార్థాలను విషపూరితం చేస్తాయి.
6. వంటగదిలో డస్ట్ బిన్ లోని వ్యర్థాలను పారేసి అలాగే పెట్టేయకుండా డస్ట్ బిన్ ను రోజూ శుభ్రంగా కడగాలి.
7. డోమెక్స్, బ్లీచింగ్ వంటి క్లీనింగ్ ఎలిమెంట్స్‌ను ఆహార పదార్థాలు, వంటదినుసులకు దగ్గరగా ఉంచకూడదు. వీటి కోసం విడిగా ఒక అర కేటాయించాలి.
8. వంటగదిలో వాడే టవల్స్ ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. డిటర్జెంట్ తో ఉతికిన తర్వాత వేడినీటిలో ముంచి, బాగా ఎండ తగిలే చోట ఆరేయాలి. వాడిన టవల్స్ ను తడిపి సింక్ లో వదిలేయడం ఆరోగ్యకరమైన అలవాటు కాదు.



Click it and Unblock the Notifications