Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వంటగదిలో ముఖ్యంగా గుర్తించుకోవాల్సింది...

వంటగదిలో ముఖ్యంగా స్టౌ దగ్గర వండేటప్పుటు వండే పదార్థాలు వాటి మరకలు స్టౌ మెనుక గోడ మీద పడుతుంటాయి. వాటిని వెంటనే శుభ్రం చేయకపోతే చూడటానికి ఇబ్బందిగా ఉంటుంది. అందుకోసం నిమ్మరసంలో ఉప్పు కలిపి మరకల మీద రుద్దాలి. లేదంటే గోడకు ఆయిల్ పేపర్లు అంటిస్తే ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చు. ఇదీ కాదంటే వాటర్ ఫ్రూప్ పెయింటింగ్ వేసినా శుభ్రం చేసుకోవడానికి సులభంగా ఉంటుంది.
ఇంట్లోని వంటగదికున్న కిటికీలోని ఇనుప మెష్ కు దుమ్ము, మురికి పట్టుకొని చేతులకు, దుస్తులకు నల్లటి మరకలు పడతుంటాయి. అలాంటప్పుడు తలకు రంగు వేసుకునే బ్రష్ ను సబ్బుద్రావణంలో ముంచి మెష్ ను శుభ్రపరచండి. కిరోసిన్ లో ముంచిన వస్త్రంతో ఇనుప తీగలను తుడిస్తే తప్పు వదులుతుంది.
వంట గది మూలల్లో కీటకాలు గూడుకట్టుకొని బూజు పేరుకుంటుంది, పొడవాటి కర్రకు పెద్ద స్పాంజ్ ను కట్టి డిటర్జెంట్ కలిపిన గోరువెచ్చటి నీటిలో ముంచి వంట గది సీలింగుకు తుడవండి. ఇలా కనీసం పది రోజులకోసారైనా చేస్తుంటే వంటగది చూడటానికి శుభ్రంగా ఉంటుంది.
వంటగదిలో ఉన్న సింక్, డ్రైనేజీ పైపులను శుభ్రపరచడం వీలుకాని పని. అందుకే వెనిగర్, బేకింగ్ సోడాను కప్పు చొప్పున కలిపి నాలుగు మగ్గుల నీళ్లలో బాగా మరిగించండి. ఈ మిశ్రమాన్ని రాత్రిపూట పైపుల్లో పోస్తే మధ్యలోనున్న అడ్డంకులన్నీ నీళ్లతోపాటు కొట్టుకుపోతాయి. వెనిగర్, సోడా క్రిములను హరించి వేస్తుంది.
ముఖ్యంగా వంట గదిలోని చెత్త బుట్టలను ఏ రోజుకారోజు తీయకపోతే దోమలు, క్రిములు ఇంట్లోకి చేరిపోతాయి. అందుకే కనీసం వారానికోసారి నీళ్లతో కడగాలి. లీటరు నీటిలో అమోనియాను కలిపి లోపల బయట స్క్రబ్బర్ తో రుద్ది శుభ్రం చేయాలి. తర్వాత బోరిక్ పొడిని, తేమ ఆరాక బేకింగ్ సోడాను చల్లండి, ఇవి దుర్వాసనలు పోగొడుతాయి.



Click it and Unblock the Notifications