Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
వంటిట్లో హాయిగా గడపాలంటే....

1. ముఖ్యంగా వంట చేసుకునేందుకు వీలుగా ఫ్లాట్‌పామ్, ప్రక్కనే సింక్, అల్మారాలు ఏర్పాటుచేసుకోవాలి. ఫ్లాట్‌ఫాం ఎత్తునుంచి మరో రెండు అడుగుల ఎత్తులో స్టోరేజ్ కప్ బోర్డులు ఉండాలి. ఈ మాత్రం ఎత్తులో ఉండటంవల్ల అవి తలకు తగలకుండా ఉంటాయి.
2. ఫ్లాట్‌ఫామ్ ను గ్రానైట్‌తో ఏర్పాటుచేసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. దీని మీద మరకలు పడవు. గీతలు పడవు. శుభ్రం చేయడం కూడా చాలా తేలిక.
3. కప్ బోర్డులకు వాడే ప్లైవుడ్ వాటర్ ప్రూఫ్, పెస్ట్ ప్రూఫ్ అయితే మంచిది. లేదంటే చెదల పురుగులు చేరతాయి.
4. ఇక సింక్… రెండు విభాలుగా ఉంటే సౌకర్యంగా ఉంటుంది. ఒకదాంట్లో కడగాల్సినవీ, మరోదాంట్లో కడిగినవీ పెట్టుకోవచ్చు. లేదా ఖరీదైన గాజు సామాన్లను అన్నింటితో కలిపివేయకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. అలా వీలుకానప్పుడు ఫ్లాట్‌ఫాం కొంచెం పెద్ద సైజులో నిర్మించుకోవచ్చు.
5. కిచెన్ లో కనీసం నాలుగు ప్లగ్ పాయింట్లు ఏర్పాటుచేసుకోవాలి. ఫ్రిజ్, మైక్రో ఓవెన్, రైస్ కుక్కర్, గ్రైండర్, మిక్సి…లాంటి వాటిని అవసరాలకు వినియోగించుకోవడానికి వీలుగా ఉండాలి. అలాగే మంచి నీళ్ల ఫిల్ట్రేషన్ కోసం కూడా అందులో ఏర్పాటుచేసుకోవాలి.
6. వంట చేసేటప్పుడు వచ్చే ఘాటైన వాసనలు ఇల్లంతా నిండిపోకుండా ఆధునిక కిచెన్ లలో ఎలక్ట్రిక్ చిమ్మీనీలను వాడుతున్నారు. స్టౌకి పైభాగంలో అమర్చే ఈ చిమ్మీనీలు వాసనను పీల్చేస్తాయి అంత స్థోమత లేకపోతే ఎగ్జాస్ట్ ఫ్యాన్ అమర్చుకోవచ్చు.
7. వంటింట్లో ముఖ్యంగా ఉండాల్సింది వెలుతురు. చీకటిగా ఉంటే పురుగులు చేరతాయి. అందుకే సూర్యకాంతి బాగా ప్రసరించేలా ఉంటే మంచిది. అలాగే వండిన వాటిని కూడా ఫ్లాట్‌ఫాంమీద కాకుండా అల్మారాలో పెట్టుకుంటే శుభ్రంగా ఉంటుంది.
8. సాధారణంగా చాలామంది చెత్తబుట్టని సింక్ కిందే పెడతారు. దీని కోసం ప్రత్యేకంగా సింక్ కిందే చిన్న కప్ బోర్డు చేయించి తలుపులకి జాలి అమర్చితే నీట్‌గా ఉంటుంది.
9. వంటిల్లు అనగానే అదేదో ఇల్లాలికి మాత్రమే పరిమితమైనది అనుకోకుండా స్నేహితులూ, బంధువులు వచ్చినపుడు అంతా కలిసి కబుర్లు చెప్పుకుంటూ పనిచేసుకునేలా విశాలంగా ఉంటే బాగుంటుంది.
10.వంటింట్లో చిన్న డైనింగ్ టేబుల్ కూడా ఉంటే బాగుంటుంది. స్థలం తక్కువగా ఉండి టేబుల్ వేసుకోవడం కుదరకపోతే మడవడానికి వీలయ్యే చిన్న బల్లను గోడకు అమర్చి అక్కడే ఓ కుర్చీ వేస్తే కూరగాయలు కోసుకోవడానికీ బ్రేక్‌ఫాస్ట్ చేయడానికీ ఎవరైనా వస్తే కూర్చోవడానికి కూడా పనికొస్తుంది. ఇలా అనేక సౌకర్యాలు కలిగిన ఆ వంటింట్లో ఆడుతూ, పాడుతూ, ఆనందంగా వంట చేసుకోవచ్చు. కమ్మని రుచులు చవిచూడవచ్చు.



Click it and Unblock the Notifications