Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
హడావుడి... హైరానా అక్కర్లేదు...!
బయట షాపింగులకు వెళ్లినప్పుడు... హడావుడి పడకుండా, ఎవరికీ అసౌకర్యం కలిగించకుండా కావల్సినవి కొనుక్కోవడం ఓ కళ. అంతేనా ఏ ఇబ్బందీ లేకుండా చకచకా ముగించడం కూడా తెలిసుండాలి. మరీ అందుకేం చేయాలంటే... షాపింగ్ చేసేటప్పుడు అవి ఎంత వరకూ... ఎన్ని రోజులకు అవసరమో అంత వరకే క్వాంటిటీ, క్వాలిటీ చూసి కొనాలి. ఒక వారానికి లేదా ఒక నెలకూ సరిపడా ఎంపిక చేసుకోవాలి

ముందుగా మీ దగ్గర షాపింగ్ లిస్ట్ ఉందా?: షాపింగ్ చేయాలనుకున్నప్పుడు బయటకు వెళ్ళే ముందు మీకు ఏఏ వస్తువులు కావాలో వాటన్నింటి పేపర్ మీద లిస్ట్ తయారు చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల మర్చిపోకుండా ఉండటమే కాక, కావలసిన వస్తువులను త్వరగా కొనుగోలు చేయడానికి సులభమైన పద్దతి. కొత్తగా షాపింగ్ మాల్స్ కు వెళ్లేవాళ్లు ముఖ్యంగా ఏ వస్తువులు అవసరమో అటువంటి వాటినే కొనుగోలు చేయాలి. ఏదో కలర్ ఫుల్ గా కనిపించేసింది కొనేస్తాం అనుకుంటే డబ్బుతో పాటు నిరుపయోగం అవుతుంటాయి కొన్ని. కాబట్టి ఏది అవసరమో అంత మేరకు మాత్రమే కొనాలి.
ఇష్టమైనవి - ఇష్టం లేనివి మనస్సులో ఉంచుకొనుట: ఉదాహరణకు మీకు ఓట్స్ అంటే ఇష్టం. కానీ అది మీ పిల్లలకు ఇష్టం ఉండవు. అలాంటప్పుడు ఒక్కరి కోసం ఓట్స్ నిరుపయోగమే అవుతుంది. అలాగే ఏదేని ఒక వస్తువు చూడగానే అదే మనకు కావాల్సింది అని చటుక్కున పాకెట్ ను లాగేసి బ్యాగ్ లో పెట్టేసుకోకూడదు. ఇంట్లో ఎంత మంది ఉన్నారు. ఎంత క్వాంటిటీ అవసరం అవుతుందో అంత మేరకు మాత్రమే తీసుకోవాలి.
ఖర్చు: షాపింగ్ లకు వెళ్ళిన తర్వాత కళ్ళు మూసుకొని ఖర్చు చేసేయకూడదు. ముఖ్యంగా ఇంటి సరుకులకు వెళ్ళేటప్పుడు బడ్జెట్ వేసుకొనే వెళ్ళాలి. ఒక వేళ మీరు ఒక్కరే ఉన్నట్లేతే ఆలోచించాల్సిన పనిలేదు. ఇంట్లో చాలా మంది నివసించేటట్లైతే అందుకు తగినంత మోతాదులోనే తీసుకోవాల్సి ఉంటుంది.
స్టోరేజ్: నిల్వ వుంచిన పదార్థాల విషయంలో మెలుకువులు పాటించాలి. ఎందుకంటే కొన్ని పదార్థాలు ఎప్పటి నుండో అలాగే ఉండి ఉంటాయి.వ వాటి ఎక్స్ పైరీ డేట్స్ ముగిసి వుంటాయి. అటువంటివి గమనించి తీసుకోవాలి. ఉదాహరణకు బియ్యం, గోదుమలు, వైన్, గరం మాసాల, స్పైసీ ఐటమ్స్, ఊరగాయలు వంటివి సంవత్సరాల పొడవునా అలాగే ఉంచేస్తుంటారు. ఏదేని ఆఫర్స్ చూసి కొనాలనుకొంటే అందులో ఏదో మిస్టేక్ ఉందని గమనించాలి.
షాపింగ్ మాళ్లలో వాహనాలు నిలిపే స్థలంలో.. కొంత భాగం వికలాంగుల కోసం కేటాయిస్తారు. అది గమనించకుండా చాలా మంది అక్కడే పార్కింగు చేస్తుంటారు. దాంతో వారికి అసౌకర్యం కలుగుతుంది. అలానే వారు ద్విచక్ర వాహనంలో వస్తున్నప్పుడు.. లేదా వెళ్లేటప్పుడు సాయపడటం వల్ల సులువుగా బయటకు వెళతారు. గర్భిణులూ పార్కింగ్ చేయడానికి వస్తుంటారు. అలాంటి వారిని గౌరవించి దారి ఇవ్వడం మంచి పద్ధతి.
లోపలికి వెళ్లేటప్పుడు ఎక్కువ మంది ఉంటే వరుస పద్ధతి పాటించాలి. పెద్దలు, గర్భిణులు, పసిపిల్లల తల్లులుంటే వారికి దారి ఇస్తే ఇబ్బంది లేకుండా వెళతారు. బిల్లు కంట్టే దగ్గర కూడా ఈ నియమం పాటించాల్సి ఉంటుంది. ఇక, సరుకులు వేసుకోవడానికి ఉపయోగించే షాపింగు కార్ట్ హ్యాండిల్ మీద టిష్యూ పేపర్ పరిచి పట్టుకోవాలి. దానిపైన ఉన్న సూక్ష్మక్రిములు చేతులకు అంటుకోకుండా ఉంటాయి.
కార్ట్ తోసేటప్పుడు చుట్టు పక్కల గమనిస్తూ ఉండాలి. పొరబాటున పిల్లలకు, పెద్దలకు తగిలితే ఇబ్బంది. అలానే కొందరు వాటిలో పర్సులు, హ్యాండ్ బ్యాగులు ఉంచి.. వెనక్కి తిరిగి వస్తువులు చూస్తుంటారు. అలాంటి వాటిని చేతిలో పెట్టుకుంటేనే భద్రతగా ఉంటుంది.
సరుకులు వేసుకొనే బుట్టలు, బండ్లను కొందరు మధ్యలో పెట్టి పని చూసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మిగతా వారికి అసౌకర్యం కలుగుతుంది. అవి అడ్డురాకుండా.. పక్కన పెట్టుకోవడం మంచిది. అలానే చిన్నారుల చేతికి ఇవ్వడం కూడా సరికాదు. కొందరు తెలిసిన వాళ్లు కనిపిస్తే అక్కడే నిల్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. దాని వల్ల ఇతరుల షాపింగుకు అంతరాయం కలుగుతుంది. అందుకే పక్కకు వెళ్లడం ఉత్తమం. లేదంటే వారి సమయం వృథా చేసినవాళ్లమవుతాం.
అక్కడి సిబ్బందితో కసురుకున్నట్లు కాకుండా.. మర్యాద పూర్వకంగా పలకరించడం వల్ల వారూ సానుకూలంగా స్పందిస్తారు. షాపింగ్ తర్వాత పూర్తి చేయడానికి సాయపడతారు. కొన్న వస్తువులను బిల్లుకు ముందు తర్వాత లెక్క వేసుకోవడం.. తిరిగి వచ్చిన చిల్లర సరిచూసుకోవడం తప్పనిసరి. ఏదన్నా తేడా వచ్చినా వెంటనే పరిష్కారం దొరుకుతుంది. ఇంటికి వెళ్లాక చూసుకోవడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు.



Click it and Unblock the Notifications











